వరల్డ్ కప్ మ్యాచ్ డేట్ మార్చాలంటున్న మ‌రో అసోసియేషన్

ఇటీవల బీసీసీఐ వరల్డ్ కప్ గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. మరింత ముందుకు జరుపుతూ వరల్డ్ కప్ డేట్ లో మార్పు జరిగినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం నవంబర్ 12న జరగబోయే మ్యాచ్ను కూడా మార్చాలి అంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, ICC రెసి టీమ్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అదేం లేదు అంటున్న CAB అధ్యక్షుడు: నవంబర్ 12న కాళీపూజ అంగరంగ వైభవంగా జరగనుంది, నవంబర్ 12న జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో […]

Share:

ఇటీవల బీసీసీఐ వరల్డ్ కప్ గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. మరింత ముందుకు జరుపుతూ వరల్డ్ కప్ డేట్ లో మార్పు జరిగినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం నవంబర్ 12న జరగబోయే మ్యాచ్ను కూడా మార్చాలి అంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, ICC రెసి టీమ్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అదేం లేదు అంటున్న CAB అధ్యక్షుడు:

నవంబర్ 12న కాళీపూజ అంగరంగ వైభవంగా జరగనుంది, నవంబర్ 12న జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ICC రెసి టీమ్‌ను కోరినట్లు శనివారం నివేదిక వెల్లడించింది.

కాళీపూజ పశ్చిమ బెంగాల్‌లో రెండవ అతిపెద్ద పండుగ మరియు దుర్గా పూజ ముగిసిన దాదాపు 2 వరాల తర్వాత జరుగుతుంది. కోల్‌కతాలోని వేలాది స్థానిక క్లబ్‌లు, కాళీ పూజపై కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నందున, శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడానికి నగరం అంతటా ముఖ్యంగా పోలీసులు సెక్యూరిటీ అనేది తప్పకుండా ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ డ్యూటీ కోసం ప్రత్యేక పోలీసుల ఏర్పాటు అనేది చేయడం అసాధ్యమైన పని అని చెప్పాలి. ఇదిలా ఉండగా షెడ్యూల్‌లో మార్పు కోసం ఐసిసి బోర్డుకి ఎటువంటి అభ్యర్థనను పంపలేదని CAB అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ తెలపడం జరిగింది. అయితే కోల్‌కతా పోలీసులు భద్రతా సమస్యను లేవనెత్తారని సీనియర్ సభ్యులు వెల్లడించారు. 

ఇటీవల షెడ్యూల్లో మార్పులు: 

అయితే ప్రస్తుతం భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు.

అయితే మూడు క్రికెట్ బోర్డులు, వరల్డ్ కప్ షెడ్యూల్లో అడ్జస్ట్మెంట్ కోసం ఐసీసీ కి లేఖ రాసినట్లు, అందుకే ప్రస్తుతం డేట్ అలాగే టైమింగ్ లో మార్పులు వచ్చినట్లు బీసీసీఐ సెక్రెటరీ చెప్పారు. అయితే టైమింగ్ అలాగే డేట్ విషయంలో మార్పులు తర్వాత జరగబోయే మ్యాచ్ లకు మధ్యలో నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్లో మార్పుల కోసం ఐసీసీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారో వాళ్ళ వివరాలైతే బిసిసిఐ సెక్రటరీ ప్రస్తుతానికి అయితే వెల్లడించలేదు. 

నవరాత్రి పండుగ ఒక కారణం:

అయితే క్రికెట్ వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసేందుకు నవరాత్రి పండుగ కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే అహ్మదాబాద్ లోకల్ పోలీస్ వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అక్టోబర్ 15న అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని, వారి తరఫునుంచి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 15వ రోజున నవరాత్రి పండుగ కూడా వచ్చినందువల్ల ఆరోజు రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపడి, రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 15న ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం అభిమానులు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బుకింగ్స్ చేసుకోవడం కారణంగా, ఇప్పుడు వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసిన తర్వాత అభిమానులలో కాస్త అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.