ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘తెలుగు టాలన్స్’

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి ఎడిషన్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఫ్రాంచైజీకి చెందిన తెలుగు టాలన్స్ చోటు సంపాదించింది. ఈ జట్టుతో పాటు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఢిల్లీ పంజర్స్ జట్టు కూడా చేరినట్టు ప్రీమియర్ హ్యాండ్‌ బాల్ లీగ్ తెలిపింది. మన భారత్ దేశ వేదికగా తొలిసారి నిర్వహించనున్న ప్రీమియర్ హ్యాండ్‌ బాల్ లీగ్ తోలి ఎడిషన్‌లో భాగంగా తెలుగు టాలన్స్ జట్టు ఆడనుంది. దీంతో పాటు మరో జట్టు ఢిల్లీ […]

Share:

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి ఎడిషన్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఫ్రాంచైజీకి చెందిన తెలుగు టాలన్స్ చోటు సంపాదించింది. ఈ జట్టుతో పాటు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఢిల్లీ పంజర్స్ జట్టు కూడా చేరినట్టు ప్రీమియర్ హ్యాండ్‌ బాల్ లీగ్ తెలిపింది.

మన భారత్ దేశ వేదికగా తొలిసారి నిర్వహించనున్న ప్రీమియర్ హ్యాండ్‌ బాల్ లీగ్ తోలి ఎడిషన్‌లో భాగంగా తెలుగు టాలన్స్ జట్టు ఆడనుంది. దీంతో పాటు మరో జట్టు ఢిల్లీ పంజర్స్ కూడా పీహెచ్ఎల్ లీగ్ ఎడిషన్‌లో చోటు సంపాదించింది. మన తెలుగు రాష్ట్రాల ప్రాంఛైజీకి చెందిన తెలుగు టాలన్స్ టీం ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో ప్రవేశిస్తున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ ఏప్రిల్ 22న (శనివారం) ప్రకటించింది.

వాలీబాల్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ వంటి ఇతర టీంలతో పాటు పలు స్పోర్ట్స్ లీగ్‌లలో కూడా సత్తా చాటిన తెలుగు టాలన్స్.. రాబోయే పీహెచ్ఎల్ ప్రారంభ ఎడిషన్‌లో ఇతర జట్లతో పోటీపడుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు టాలన్స్ జట్టు.. క్రీడా, పారిశ్రామికవేత్త అభిషేక్ రెడ్డి కంకణాల ప్రాంఛైజీకి చెందినది. అలాగే,  ఢిల్లీ పంజర్స్ భండారీ స్పోర్ట్స్‌కు చెందిన వినీత్ భండారీ ఫ్రాంచైజీకి చెందినది.

కాగా 2023 ఏప్రిల్ 23న అంటే ఆదివారం, ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌ లో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ వేలం జరుగనున్నట్టు తెలుగు టీం యజమాని తెలిపారు. ఇక ఇందులో ఒక్కో జట్టులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లు, 11 మంది భారత ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తారు. ఇక అంతకు ముందు గర్విట్ గుజరాత్‌, గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్లు ఈ లీగ్‌లో చేరాయి.

ఈ లీగ్ ఇనగురల్ ఎడిషన్‌లో చోటు సంపాదించిన సందర్బంగా పటిష్టమైన జట్టును ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రాంఛైజీ తెలుగు టాలన్స్ భావిస్తోంది. కాగా.. తెలుగు టాలన్స్ జట్టులో పెట్టుబడులు పెట్టి క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన ఆటగాళ్లను, వారి నైపుణ్యాలను పెద్దపెద్ద వేదికలపై ప్రదర్శించడానికి అవకాశం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కంకణాల అభిషేక్ రెడ్డి. అదే విధంగా, మన దేశంలో క్రీడా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఆయన మరింత కృషి చేస్తున్నారని చెప్పవచ్చు.

వివిధ స్పోర్ట్స్ పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరించేందుకు దృష్టి సారించారు అభిషేక్. ముఖ్యంగా చెప్పాలంటే.. మన దేశంలో హ్యాండ్‌ బాల్ కమ్యూనిటీని మరింత పటిష్టం చెయ్యడానికి కంకణం కట్టుకున్నారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, గోల్ఫ్ వంటి స్పో‌ర్ట్స్ లీగ్‌లు మునుపటి క్రీడలలో కూడా ఆయన తన వంతు  సాయాన్ని అందిస్తున్నారు. ఇక హ్యాండ్‌బాల్ ప్రపంచంలోకి తమ జట్టు అరంగేట్రం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అథ్లెట్లకు సహాయంగా నిలబడడం చాల గర్వంగా ఉంది’ అని కూడా అభిషేక్ రెడ్డి తెలిపారు.

పీహెచ్ఎల్ లో ఉత్తమ స్థాయిలో పోటీపడేలా తెలుగు టాలన్‌ జట్టును అభివృద్ధి చేసేందుకు జాతీయంగా, అంతర్జాతీయంగా కృషి చేస్తానన్నారు. పీహెచ్ఎల్ మొదటి సీజన్ వచ్చే జూన్ 8  నుండి ప్రారంభమై  జూన్ 25 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ ఎడిషన్ ను.. వయాకామ్ నెట్‌వర్క్‌‌ అయిన జియో సినిమాలో, స్పోర్ట్స్ 18-1, స్పోర్ట్స్ 18 ఖేల్‌ లో లైవ్ చూడొచ్చు.