IND vs AUS T20 Series: సిరీస్ మధ్యలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంటికి..

ఏకంగా ఆరుగురు..

Courtesy: Twitter

Share:

IND vs AUS T20 Series: టీమిండియాతో(Team India) జరుగుతున్న టీ20 సిరీస్(T20) కోసం ఆస్ట్రేలియా (Australia) తమ జట్టులో భారీ మార్పులు చేసింది. ఆఖరి మూడు మ్యాచ్‌లకు కొత్తగా నలుగురిని జట్టులోకి తీసుకుంది. ప్రపంచకప్(World Cup) నుంచి జట్టుతో ఉన్న ఆరుగురు ఆటగాళ్లను రెస్ట్ ఇచ్చింది. వీరంతా మూడో టీ20 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా (Australia) బయల్దేరి వెళ్లనున్నారు. మూడో టీ20 మ్యాచ్ మంగళవారం గౌహతి(Guwahati) వేదికగా జరగనుంది. ప్రపంచకప్‌లో ఆడిన ట్రావిస్ హెడ్ మాత్రమే జట్టుతో పాటు కొనసాగగనున్నాడు.

ఇండియాతో (India) జరుగుతున్న టీ20 సిరీస్(T20 series) కోసం ఆస్ట్రేలియా (Australia) తమ జట్టులో మార్పులు చేసింది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‍‌ల టీ20 సిరీస్ నడుస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తికాగా.. రెండింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్ (నవంబర్ 28)న జరగనుంది. అయితే మిగతా సిరీస్ (Series) కోసం ఆస్ట్రేలియా తమజట్టులో భారీగా మార్పులు చేసింది. జట్టులోని ఆరు మంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. ప్రపంచకప్‌లో ఆడిన ఆరుగురు ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా (Australia).. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించింది.

స్పిన్నర్ ఆడమ్ జంపా(Spinner Adam Zampa)తో పాటు, స్టీవ్ స్మిత్(Steve Smith) ఇప్పటికే వెళ్లిపోయారు. గౌహతి వేదికగా జరిగే మూడో టీ20 మ్యాచ్ పూర్తైన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టయినిస్, జోస్ ఇంగ్లిస్, సీన్ అబాట్ స్వదేశానికి బయల్దేరనున్నారు. ప్రపంచకప్ ఆడిన జట్టులో ఉన్న ట్రావిస్ హెడ్ మాత్రమే ఇండియాతో టీ20 సిరీస్‌లో (T20 series) కొనసాగనున్నాడు. గాయం కారణంగా వరల్డ్ కప్‌లో(World Cup) సగం మ్యాచ్‌లకు దూరమైన ట్రావిస్ హెడ్.. తిరిగొచ్చి ఆసీస్‌కు ప్రపంచకప్ అందించాడు. సెమీఫైనల్, ఫైనల్‌లలో అద్భుత ఆటతీరుతో ఆస్ట్రేలియాను ఆరోసారి ఛాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, జోస్ ఇంగ్లిస్, సీన్ అబాట్, మార్కస్ స్టయినిస్ స్థానంలో బెన్ మెక్‌డెర్మోట్, జోస్ ఫిలిప్, బెన్ డ్వార్‌షుయిస్, క్రిస్ గ్రీన్ ఆస్ట్రేలియా టీ20 జట్టుతో కలుస్తారు.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా (Team India) ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్(Vizag) వేదికగా జరిగిన తొలి టీ20లో రెండు వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. ఆస్ట్రేలియా (Australia) విధించిన 209 భారీ లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా (Team India). పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు (Team India) అదే అత్యధిక లక్ష్యఛేదన కావడం విశేషం. ఇక త్రివేండ్రంలో జరిగిన రెండో మ్యాచ్‍‌లో టీమిండియా యువబ్యాటర్లు చెలరేగి ఆడారు. టాప్ త్రీ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి టీమిండియా 235 పరుగులు చేసింది. అనంతరం రవిబిష్ణోయ్ స్పిన్ మ్యాయాజాలంతో ఆస్ట్రేలియాపై (Australia) 44 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఇక సిరీస్ కైవసం చేసుకోవటమే లక్ష్యంగా మంగళవారం నాటి మ్యాచ్‌కు రెడీయైంది.

మరోవైపు ప్రపంచకప్(World Cup) ముగిసిన నాలుగురోజులకే ఈ సిరీస్ ప్రారంభం కానుండటంతో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చింది. అయితే ప్యాట్ కమిన్స్(Pat Cummins), డేవిడ్ వార్నర్ (David Warner), మిచెల్ స్టార్క్(Mitchell Starc) , హేజిల్ వుడ్(Hazel Wood) వంటి ప్లేయర్లకు మాత్రమే విశ్రాంతి ఇచ్చిన కంగారూలు.. మిగతావారితో బరిలోకి దిగారు. కానీ మొదటి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవటంతో సిరీస్ మీద ఆశలు కోల్పోయి ఇప్పుడు మిగతావారికి రెస్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇవ్వాల్సిన రెస్ట్ సిరీస్ ఆరంభంలోనే ఇస్తే పోయేదిగా అంటున్నారు.

మార్పుల తర్వాత ఆస్ట్రేలియా జట్టు: మ్యాథ్యూ వేడ్ (కెప్టెన్), జోస్ బెహ్రాడార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్‌షుయిస్, నాథన్ ఇల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డొర్మేట్, జోస్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మ్యాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్