Sri Lanka: షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోని శ్రీలంక‌, బంగ్లాదేశ్ ప్లేయర్స్

Sri lanka: క్రికెట్ వరల్డ్ కప్ (World Cup) రసవత్తరంగా సాగుతోంది. నిన్న ముగిసిన ఆస్ట్రేలియా-అఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తో సెమీస్ కి వెళ్లే మూడు జట్లు ఏంటనేది తేలిపోయింది. కానీ ఇంకో టీం మాత్రం ఏది అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం కాసేపు పక్కన పెడితే ఏ ఆటలోనైనా షేక్ హ్యాండ్స్ (Shake Hands) ఇచ్చుకోవడం సహజం. ఆటలో ఎంత గొడవపడినా కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్స్ ఒకరినొకరు అభినందించుకుంటూ షేక్ […]

Share:

Sri lanka: క్రికెట్ వరల్డ్ కప్ (World Cup) రసవత్తరంగా సాగుతోంది. నిన్న ముగిసిన ఆస్ట్రేలియా-అఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తో సెమీస్ కి వెళ్లే మూడు జట్లు ఏంటనేది తేలిపోయింది. కానీ ఇంకో టీం మాత్రం ఏది అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం కాసేపు పక్కన పెడితే ఏ ఆటలోనైనా షేక్ హ్యాండ్స్ (Shake Hands) ఇచ్చుకోవడం సహజం. ఆటలో ఎంత గొడవపడినా కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్స్ ఒకరినొకరు అభినందించుకుంటూ షేక్ హ్యాండ్స్ (Shake Hands) ఇచ్చుకోవడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఈ మధ్య వరల్డ్ కప్ వేదికగా జరిగిన బంగ్లా-శ్రీలంక మ్యాచ్ లో మాత్రం ప్లేయర్స్ ఇలా షేక్ హ్యాండ్స్(Shake Hands) ఇచ్చుకునేందుకు నిరాకరించారు. ఇందుకు లంక (sri lanka) బ్యాటర్ ఏంజెలో మ్యాథ్యూస్ ను టైమ్డ్ ఔట్ (Timed Out) గా బంగ్లా కెప్టెన్ ఔట్ చేయడమే కారణంగా తెలుస్తోంది. 

జరిగిందిదే.. 

బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. లంక (Sri Lanka)మొదటి బ్యాటింగ్ చేస్తుండగా… వికెట్ పడిన తర్వాత మరో బ్యాటర్ అయిన ఏంజెలో మ్యాథ్యూస్ (Mathwes) క్రీజులోకి రావడానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టింది. దీంతో బంగ్లాదేశ్ ప్లేయర్స్ అతడి మీద ఎంపైర్ (Umpire) కు అప్పీల్ చేశారు. దీంతో ఎంపైర్ లంక ఆటగాడు మ్యాథ్యూస్ ను టైమ్డ్ ఔట్ (Timed Out) గా ప్రకటించారు. ఇన్ని రోజుల క్రికెట్ చరిత్రలో ఇలా ఈ పద్ధతిలో ఎవరూ ఔట్ కాలేదు. మొట్టమొదటి సారిగా లంక(Sri Lanka) బ్యాటర్ మ్యాథ్యూస్ పేర ఈ రికార్డు నమోదైంది. దీని ఫలితంగా శ్రీలంక (Sri Lanka) ఆల్‌రౌండర్ ఒక్క డెలివరీని కూడా ఎదుర్కోకుండానే డ్రెస్సింగ్ రూమ్‌ కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. 

తొలి బ్యాటర్ గా రికార్డు.. 

ఈ ఘటనతో శ్రీలంక (Sri Lanka) ఆల్ రౌండర్ మ్యాథ్యూస్ ఒక రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఇంటర్నేషనల్  క్రికెట్ లో ఈ విధంగా టైమ్డ్ ఔట్ గా వెనుదిరిగిన మొదటి బ్యాటర్ గా మ్యాథ్యూస్ రికార్డలకెక్కాడు (Record). ఇన్ని రోజుల నుంచి ఏ క్రికెటర్ కూడా ఇలా ఔట్ కాలేదు. మొట్టమొదటి సారి మ్యాథ్యూస్ విషయంలోనే ఇలా జరిగింది. ఇలా బంగ్లా (Bangladesh) మ్యాథ్యూస్ ను టైమ్డ్ ఔట్ విధానంలో ఔట్ చేయడంతో లంక (Sri Lanka) భారీ స్కోరు చేయలేకపోయింది. రెండో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ లంక చేసిన స్కోరును అలవోకగా చేధించింది. దీంతో లంక (Sri Lanka) పసికూన బంగ్లా మీద ఓడిపోయింది. ఇది రుచించని ప్లేయర్స్ తాము ఓడిపోయేందుకు బంగ్లా అవలంభించిన వైఖరే కారణం అని ఆరోపిస్తూ మ్యాచ్ తర్వాత కరచాలనం (Shake Hand) కూడా చేయకుండానే డ్రెస్సింగ్ రూంలకు చేరుకున్నారు. 

అందుకోసమే అలా చేశాం.. 

మ్యాచ్ ముగిసిన తర్వాత అలా ఎందుకు చేశారో ఏంజెలో మ్యాథ్యూస్ (Mathews) వివరించాడు. బంగ్లాదేశ్ తమను గౌరవించలేదని, అందుకే కరచాలనం చేయడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అవును, మమ్మల్ని గౌరవించే వ్యక్తులను మేము గౌరవిస్తాం.. కానీ బంగ్లా (Bangladesh) అలా చేయలేదని మ్యాథ్యూస్ విలేకరులకు వెల్లడించాడు. వారు ఆటను గౌరవించాలని తెలిపాడు. ఇంత అందమైన గేమ్ ను మనం రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఎంతో కొద్దిగా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపాడు. సదీర సమరవిక్రమ ఔట్ (Out) అయిన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి రావాల్సి ఉండింది. కానీ అతడు మైదానంలోకి అడుగు పెట్టే సమయంలో తన హెల్మెట్ పట్టీ (Helmet Strip) విరిగిపోయిందని గమనించి, మరో హెల్మెట్ తెప్పించుకునేందుకు అతడు బౌండరీ లైన్ బయటే వెయిట్ చేశాడు. దీంతో కాస్త ఆలస్యం అయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో (International Cricket) ఒక బ్యాటర్ ఔట్ అయిన తర్వాత రెండు నిమిషాల్లోపు మరో బ్యాటర్ క్రీజులోకి అడుగు పెట్టాలి. అలా కాకుండా ఎక్కువ సేపు బయటే గడిపితే అతడిని టైమ్డ్ ఔట్ (Timed Out) విధానంలో ఔట్ గా ప్రకటిస్తారు. ఇలా మ్యాథ్యూస్ కు లేట్ కావడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (Shakib) ‘టైమ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. రెండు నిమిషాల్లోనే అతను బ్యాటింగ్ క్రీజుకు చేరుకున్నాడని శ్రీలంక వాదించినప్పటికీ అంపైర్లు మాథ్యూస్‌ మాట వినలేదు. అతడిని ఔట్ గా ప్రకటించారు. 

షకీబ్ ను తప్పుబట్టిన మ్యాథ్యూస్

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ (Shakib) ను లంక (Sri Lanka) ఆల్ రౌండర్ మ్యాథ్యూస్ తప్పుబట్టాడు. తనను ఎంపైర్లు ఔట్ గా ప్రకటించినా కానీ వెనక్కు పిలిపించే అధికారం షకీబ్ కు ఉందని అతడు అలా చేయలేదని ఫైర్ అయ్యాడు. అతడు నన్ను వెనక్కు పిలిపించవచ్చు కానీ షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. అతడి స్థానంలో మరే వ్యక్తి ఉన్నా కానీ బ్యాటర్ ను వెనక్కు పిలిచే వారని మ్యాథ్యూస్ (Mathews) తెలిపాడు. ఈ వివాదం కారణంగానే లంక మరీ బంగ్లా చేతిలో ఓడిపోయింది. లేకపోతే లంక మరింత స్కోర్ చేసి ఉండేదేమో. ఆల్రెడీ టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్ ఇలా చేయడం అస్సలు బాగోలేదని పలువురు మాజీలతో పాటు క్రికెట్ విశ్లేషకులు, ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు. బంగ్లా కెప్టెన్ షకీబ్ (Shakib) వైఖరిని తప్పుబడుతున్నారు.