వరల్డ్ కప్ కి స్పోర్ట్స్ ఛానల్ ఇన్సూరెన్స్

నిజానికి ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు చేయించుకుంటాము? మనం ఏదైనా కొనే వస్తువు డ్యామేజ్ అయినప్పుడు వెంటనే మనీ రికవరీ చేసుకోవడానికి ఆ వస్తువుకి సంబంధించి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటాం కదా… అదే విధంగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకుంది ఒక స్పోర్ట్స్ ఛానల్. వరల్డ్ కప్ కి స్పోర్ట్స్ ఛానల్ ఇన్సూరెన్స్:  భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ICC ప్రపంచ కప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల మధ్యలో వచ్చే ప్రకటనలకు సంబంధించిన ఆదాయ […]

Share:

నిజానికి ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు చేయించుకుంటాము? మనం ఏదైనా కొనే వస్తువు డ్యామేజ్ అయినప్పుడు వెంటనే మనీ రికవరీ చేసుకోవడానికి ఆ వస్తువుకి సంబంధించి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటాం కదా… అదే విధంగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకుంది ఒక స్పోర్ట్స్ ఛానల్.

వరల్డ్ కప్ కి స్పోర్ట్స్ ఛానల్ ఇన్సూరెన్స్: 

భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ICC ప్రపంచ కప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల మధ్యలో వచ్చే ప్రకటనలకు సంబంధించిన ఆదాయ నష్టంపై, స్టార్ ఇండియా రూ.1750 కోట్ల ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్లు సమాచారం. భారతదేశం-పాకిస్థాన్‌ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం గాను రూ.110 కోట్లకు బీమా తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు FCకి తెలిపాయి. పాలసీ కవర్ నిబంధనలు, షరతుల ప్రకారం, మ్యాచ్‌లు రద్దు చేయబడినట్లయితే, డిస్నీ స్టార్‌కి బీమా కంపెనీలు చెల్లించే గరిష్ట మొత్తం రూ. 500 కోట్లు. వాతావరణ పరిస్థితులు మరియు విపత్తుల కారణంగా మ్యాచ్ రద్దును కవర్ చేసే విధంగా పాలసీ చాలా క్లియర్ గా రూపొందించినట్లు సమాచారం.

న్యూ ఇండియా అష్యూరెన్స్ 73 శాతం రిస్క్‌ను కవర్ చేసే లీడ్ ఇన్సూరెన్స్, పాలసీలో 25 శాతం వాటాను.. SBI జనరల్ ఇన్సూరెన్స్ కవర్ చేయగా, మిగిలిన రెండు శాతం రిస్క్‌ను ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

500 కోట్లకు పెంచారు: 

క్రికెట్ బోర్డుకి సంబంధించిన ఒక అధికారి మాట్లాడుతూ, ఈసారి, మ్యాచ్‌ల రద్దు కారణంగా అడ్వర్టైజ్‌మెంట్ నష్టాన్ని కూడా కవర్ చేసే విధంగా రూ. 1750 కోట్ల పాలసీ బీమా రూపొందించినట్లు చెప్పారు. నష్ట పరిమితి ఫైనల్‌ను మినహాయించి ఒక్కో మ్యాచ్ పరిమితి రూ.45 కోట్లతో.. మొత్తం భారతదేశం మ్యాచ్‌లకుగాను రూ.500 కోట్లకు పెంచారని చెప్పుకొచ్చారు. 2019 ప్రపంచ కప్‌లో, బీమా మొత్తం రూ. 1477 కోట్లు ఉండేదని, ప్రీమియం రూ. 59 కోట్లు, నష్ట పరిమితి రూ. 150 కోట్లు, అంతేకాకుండా ఒక్కో మ్యాచ్ పరిమితి రూ. 40 కోట్లు ఉండేది అని పరిశ్రమ అధికారి ఎఫ్‌సికి తెలిపారు. భారతదేశం ఆడే అన్ని మ్యాచ్‌లకు రూ. 110 కోట్ల ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌కు రూ. 110 కోట్ల బీమా రక్షణ కూడా ఉంది అన్నారు పరిశ్రమ అధికారి.

2019 ఎడిషన్‌లో నాలుగేళ్ల క్రితం చేసిన రూ. 1,350 కోట్లతో పోలిస్తే, టీవీ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ టోర్నమెంట్ ద్వారా రూ. 2,000-రూ. 2,200 కోట్ల యాడ్ రాబడిని వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఎలారా క్యాపిటల్ నోట్ తెలిపింది. ఫోన్ పే, మహేంద్ర & మహేంద్ర, హిందుస్థాన్ యూనిలీవర్ , ఇండస్ ల్యాండ్ బ్యాంక్, MRF టైర్స్, లండింగ్ కార్ట్, BPCL, గూగుల్ పే మొదలైన వాటితో సహా ఈ సంవత్సరం 26 బ్రాండ్‌లు స్పాన్సర్‌లుగా ఉన్నారు.

వరల్డ్ కప్ సంగతులు:

గురువారం ప్రారంభమైన టోర్నమెంట్ 45 రోజుల పాటు అంటే ఈ నెలలో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనుండగా అందులో, దేశవ్యాప్తంగా 10 వేదికలలో జరిగే 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌లను చూసేందుకు కనీసం 25 లక్షల మంది అభిమానుల రాక కనిపిస్తుంది. ఓపెనింగ్ మ్యాచ్ మరియు ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. TV, OTT వంటి మాధ్యమాల ద్వారా 2019 ప్రపంచ కప్ చూసిన 552 మిలియన్ల మంది భారతీయ వ్యూయర్స్ కంటే ఈ సంవత్సరం మొత్తం వీక్షకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.