ఐపీఎల్ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు  దూరమయ్యే ఛాన్స్.. నెదర్‌ల్యాండ్స్ వన్డే సిరీస్ కోసం దూరం కానున్న ఆటగాళ్లు?

ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం కానుంది. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తి పోనున్నాయి. మూడేళ్ల తర్వాత ఫ్రాంచైజీలన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్.. రాజస్థాన్ రాయల్స్ తో పోరాడి  కప్పు గెలిచింది.  గత కొన్ని సీజన్లలో తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రేమికులకు ఈసారి ఆ లోటు తీరబోతోంది. అయితే.. ఈ సీజన్ మొదట్లో 3 రోజులపాటు కొందరు దక్షిణాఫ్రికా […]

Share:

ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం కానుంది. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తి పోనున్నాయి. మూడేళ్ల తర్వాత ఫ్రాంచైజీలన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్.. రాజస్థాన్ రాయల్స్ తో పోరాడి  కప్పు గెలిచింది.  గత కొన్ని సీజన్లలో తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రేమికులకు ఈసారి ఆ లోటు తీరబోతోంది. అయితే.. ఈ సీజన్ మొదట్లో 3 రోజులపాటు కొందరు దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్‌కి దూరమవుతారని బీసీసీఐ తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చి 31న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఐపిఎల్ కోసం దక్షిణాఫ్రికా స్టార్లు ఆలస్యంగా భారత్‌కు చేరుకుంటారు. ఇది ఐపీఎల్ జట్లకి పెద్ద దెబ్బే. అభిమానులు కూడా కొద్దిగా నిరాశ పడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరగబోయే వన్డే సిరీస్ కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమవుతారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), 2023 మార్చి 31 నుండి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో తమ అభిమాన జట్లు ఒకదానితో ఒకటి తలపడటం చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నివేదికలను బట్టి, నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా స్వదేశీ సిరీస్ కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కొన్ని ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఆడలేకపోవచ్చు.

కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల జట్లలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఉన్నారు. కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ వంటి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2023లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లేకపోవడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు ప్రధానంగా ప్రభావితమవుతాయి.

టాటా ఐపీఎల్ 2023లో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్ల జాబితా:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్

ఢిల్లీ క్యాపిటల్స్ : అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్గిడి

ముంబై ఇండియన్స్: ట్రిస్టన్ స్టబ్స్

గుజరాత్ టైటాన్స్: డేవిడ్ మిల్లర్

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్

పంజాబ్ కింగ్స్: కగిసో రబడ

క్రికెట్ సౌతాఫ్రికా (CSA) BCCIకి ఈ సమాచారం అందించింది

దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్‌తో మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనున్నందున, ఈ దక్షిణాఫ్రికా ఆటగాళ్లందరూ ఏప్రిల్ 3 నుండి ఐపీఎల్ 2023లో ఆడేందుకు అందుబాటులో ఉంటారు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం తమ అగ్రశ్రేణి ఆటగాళ్ళు తమ జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి తెలియజేసింది.

ఐపీఎల్ 2023 కోసం సిద్ధమవుతున్న పై ఫ్రాంచైజీలకు ఇది పెద్ద దెబ్బ. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రాలేకపోవడం వల్ల ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఫ్రాంచైజీలపై అధిక ప్రభావం పడుతుంది.