ఐపీఎల్ 2023లో తన విజయ రహస్యాన్ని బయటపెట్టిన సిరాజ్

హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్.. ఐపీఎల్-16వ సీజన్ లో అదరగొడుతున్నాడు.  బెంగుళూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా గురువారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సిరాజ్.. తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కీలకమైన పవర్ ప్లేలో వికెట్లు పడగొడుతూ బ్యాటర్లకు సవాల్ విసిరాడు. ఈ మ్యాచ్ లో 4/21 ప్రదర్శన చేసిన సిరాజ్.. కెరీర్ లో ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ […]

Share:

హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్.. ఐపీఎల్-16వ సీజన్ లో అదరగొడుతున్నాడు.  బెంగుళూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా గురువారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సిరాజ్.. తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కీలకమైన పవర్ ప్లేలో వికెట్లు పడగొడుతూ బ్యాటర్లకు సవాల్ విసిరాడు. ఈ మ్యాచ్ లో 4/21 ప్రదర్శన చేసిన సిరాజ్.. కెరీర్ లో ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను అందుకున్నాడు. 

నాలుగు ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ జట్టునప ఆరంభంలోనే సిరాజ్ హడలెత్తించాడు. ఇన్నింగ్స్ లో రెండో బంతికే ఓపెనర్ అథర్వ (4) ను అవుట్ చేశాడు .తర్వాత లివింగ్ స్టోన్ ను వెనక్కి పంపాడు. సిరాజ్ తో పాటు హసరంగ ఇంకా ఇతర బౌలర్లు రాణించడంతో 24 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది..

ఈ మేరకు మ్యాచ్ అనంతరం ఆసక్తికర విషయాలను సిరాజ్ మీడియాతో పంచుకున్నారు.. 

ఐపీఎల్ 2023 సీజన్ లో తన విజయ రహస్యం వెనుక కారణాలు వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. గత ఐపీఎల్ లో నా ఆట తీరు అనుకున్న విధంగా సాగలేదు. నేను ఇప్పుడు టీమిండియా జట్టులో భాగం. అన్ని ఫార్మాట్లలో ఆడాలని అనుకుంటున్నా. గతంలో ప్రణాళికలు సక్రమంగా అమలు చేయలేదు. ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే ఏం చేయాలో గ్రహిస్తున్నాను. అదే చేస్తున్నాను. నా వంతుగా ఏం చేయగలనో అది చేస్తున్నాను. మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి సారించాను.

అలాగే..IPL సమయంలో తన ప్రాక్టీస్ రొటీన్ గురించి సిరాజ్ మాట్లాడుతూ.. నేను గ్రౌండ్‌కి వచ్చినప్పుడు మొదట చేసే పని నా రొటీన్‌లు, వార్మప్‌లను సరిగ్గా చేయడం. వార్మప్‌లు అంత సులువు కాదు కానీ అవి నాకు మరింత దృఢమైన అనుభూతిని కలిగిస్తాయి. నేను నా బౌలింగ్ రిథమ్‌పై దృష్టి సారిస్తాను. బంతి నా చేతి నుండి చక్కగా వస్తుందా లేదా అనే దానిపై దృష్టి సారించాను.

పర్పుల్ క్యాప్ ధరించడంపై స్పందిన సిరాజ్.. నేను సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్నప్పుడు ఫైనల్‌లో భువీ భాయ్ పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఆ సమయంలో నేను అతని తరపున క్యాప్ అందుకోవడానికి వెళ్లాను. ఆ రోజునే నేను కూడా ఏదో ఒక రోజు పర్పుల్ క్యాప్ ధరించాలని అనుకున్నాను. ఇన్నాళ్లకు సాధించాను. ఇప్పుడు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.

ఫిట్ నెస్ పై మాట్లాడుతూ.. ఇప్పుడు ఆటల మధ్య తక్కువ సమయం ఉంది. అందుకే నేను ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి సారిస్తాను. నా రిథమ్ కూడా బాగుంది నేను జిమ్‌లో నా బలాన్ని పెంచుకుంటున్నాను. నా డైటీషియన్ కూడా నాకు చాలా సహాయం చేస్తున్నాడు. ఇది నాకు చాలా సహాయం చేస్తోంది.. ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని సిరాజ్ అన్నాడు.