శుభ్‌మ‌న్ గిల్ కి అనారోగ్యం.. 

నేడు జరగబోయే వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలబడనున్న వేళ, భారత్ క్రికెట్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్ డెంగ్యూతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నేడు మ్యాచ్ లో మరి ఆయన ఆడతాడా.. లేదా.. అనే దీని గురించి ప్రత్యేకమైన సమాచారం బీసీసీఐ ఇంకా కన్ఫామ్ చేయలేనప్పటికీ, రాహుల్ ద్రావిడ్ కూడా దీని గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.  శుభ్‌మ‌న్ గిల్ కి అనారోగ్యం:  భారత్ ఆస్ట్రేలియా తలపడునున్న వేళ శుభ్‌మ‌న్ గిల్ […]

Share:

నేడు జరగబోయే వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలబడనున్న వేళ, భారత్ క్రికెట్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్ డెంగ్యూతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నేడు మ్యాచ్ లో మరి ఆయన ఆడతాడా.. లేదా.. అనే దీని గురించి ప్రత్యేకమైన సమాచారం బీసీసీఐ ఇంకా కన్ఫామ్ చేయలేనప్పటికీ, రాహుల్ ద్రావిడ్ కూడా దీని గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. 

శుభ్‌మ‌న్ గిల్ కి అనారోగ్యం: 

భారత్ ఆస్ట్రేలియా తలపడునున్న వేళ శుభ్‌మ‌న్ గిల్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది అతను డెంగ్యూకి గురైనట్లు సమాచారం. అయితే మెడికల్ టీం ఆయనకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు, మునపటిమీద కాస్త మెరుగుగా ఉన్నట్లు ద్రావిడ్ వెల్లడించాడు. అయితే జరగనున్న మ్యాచ్ లో శుభ్‌మ‌న్ గిల్ ఆడుతున్నాడా లేదా అనే దాని గురించి నిర్ణయం వెల్లడించినప్పటికీ, ఒకవేళ ఆయన ఆడలేని పరిస్థితుల్లో, ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఆడతాడని సమాచారం అందుతోంది. 

శుభ్‌మ‌న్ గిల్ అభిమానులు ఎంతోమంది: 

శుభ్‌మ‌న్ గిల్ ఆట తీరుకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. నిజానికి డెంగ్యూ నుంచి సగటు మనిషి కోలుకోవడానికి సుమారు 7 నుంచి పది రోజుల టైం అయితే పడుతుంది. కానీ ఇలాంటి సమయంలో మరి వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆయన పాలు పంచుకుంటున్నాడా.. లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అతను అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 14న పాకిస్తాన్ లతో ఆడకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టినట్లయితే భారత జట్టుకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఈ సీజన్‌లో 1,200 పరుగులు చేసిన గిల్, చివర్లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విజయవంతమైన ఓపెనింగ్ స్టాండ్‌ను నెలకొల్పాడు.

వరల్డ్ కప్ సంగతులు: 

గురువారం ప్రారంభమైన టోర్నమెంట్ 45 రోజుల పాటు అంటే ఈ నెలలో అక్టోబర్ 5 నుండి మొదలైన వరల్డ్ కప్, నవంబర్ 19 వరకు జరగనుండగా అందులో, దేశవ్యాప్తంగా 10 వేదికలలో జరిగే 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌లను చూసేందుకు కనీసం 25 లక్షల మంది అభిమానుల రాక కనిపిస్తుంది. ఓపెనింగ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ ఆదిపత్యం ఇవ్వగా, ఫైనల్ మ్యాచ్‌లకు కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. TV, OTT వంటి మాధ్యమాల ద్వారా 2019 ప్రపంచ కప్ చూసిన 552 మిలియన్ల మంది భారతీయ వ్యూయర్స్ కంటే ఈ సంవత్సరం మొత్తం వీక్షకుల సంఖ్య చాలా  ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది

గ్రూప్ దశలో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి, ఒక్కో జట్టు మిగతా అందరితో ఒకసారి తలపడాల్సి ఉంది. ఈ ఏడాది టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు మరియు ఒక కప్ ఫైనల్‌నాకౌట్ దశకు కేవలం నాలుగు జట్లు మాత్రమే చేరుకుంటాయి.

ఇదిలా ఉండగా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, లక్నో, ధర్మశాల మరియు పూణెతో సహా వివిధ నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తుంది. అక్టోబరు 5న ICC క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభమైన రోజు నుంచి మోటేరా ప్రాంతంలోని నరేంద్ర మోదీ స్టేడియం, అదేవిధంగా అహ్మదాబాద్‌లోని ఇతర ప్రాంతాలలో సుమారు 3,500 మంది పోలీసులను మోహరించారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సెక్టార్ 1, చిరాగ్ కొరాడియా ప్రాంతంలో భద్రత మరింత పెంచుతున్నట్లు తెలపడం జరిగింది.