ఇన్‌స్టాగ్రామ్ బ‌యో మార్చేసిన సానియా మీర్జా భ‌ర్త‌

సెలబ్రిటీ కపుల్  సానియా మీర్జా – షోయభ్ మాలిక్‌లు వివాహ బంధానికి వీడ్కోలు చెప్పబోతున్నారా..? విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ ఇద్దరూ విడిపోయినట్టేనా..?  సామాజిక మాధ్యమాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.  గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య  విభేదాలు వచ్చాయని,  వీరి సంసార జీవితం సాఫీగా సాగడం లేదని నెట్టింట చర్చ జరిగింది. ఇద్దరు కలిసి ఉండడం లేదని.. అందుకే విడాకులకు సిద్ధమయ్యారని రూమర్లు వచ్చాయి. ఇప్పటివరకు సానియా,ఇక రేపో మాపో విడిపోతారని […]

Share:

సెలబ్రిటీ కపుల్  సానియా మీర్జా – షోయభ్ మాలిక్‌లు వివాహ బంధానికి వీడ్కోలు చెప్పబోతున్నారా..? విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ ఇద్దరూ విడిపోయినట్టేనా..?  సామాజిక మాధ్యమాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.  గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య  విభేదాలు వచ్చాయని,  వీరి సంసార జీవితం సాఫీగా సాగడం లేదని నెట్టింట చర్చ జరిగింది. ఇద్దరు కలిసి ఉండడం లేదని.. అందుకే విడాకులకు సిద్ధమయ్యారని రూమర్లు వచ్చాయి. ఇప్పటివరకు సానియా,ఇక రేపో మాపో విడిపోతారని వస్తున్న పుకార్లను ఈ ఇద్దరూ నిజం చేస్తున్నారు అయితే ఏ విష్యం పై  అటు మాలిక్‌‌ కానీ సానియా కానీ ఇప్పటివరకు స్పందించని విషయం తెలిసిందే 

షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడంతో వీరద్దరి విడాకుల వార్త మరోసారి తెరమీదికి వచ్చింది. గతంలో తన బయోలో ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అని ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మార్చేశాడు మాలిక్.

ప్రో అథ్లెట్, లివ్ అన్‌బ్రోకెన్, ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్’ అని  మార్చాడు. ‘సానియా భర్త’ అన్న  పదాన్ని  తీసేయడంతో మాలిక్ తాను   ఇండియన్ టెన్నిస్ స్టార్‌తో విడిపోయానని చెప్పకనే చెప్పాడని అతడి ఫ్యాన్స్  చెప్పుకుంటున్నారు. 

ఇక సానియా మీర్జా కూడా  తన ఇన్‌స్టాగ్రామ్‌లో షోయభ్ మాలిక్‌తో కలిసిఉన్న ఫోటోలను డిలీట్ చేసేసింది. మాలిక్ తన ఇన్‌స్టా బయో మార్చినా ఫోటోలను మాత్రం అలాగే ఉంచాడు.  మీర్జా అయితే మొత్తం వాటిని డిలీట్  చేయడంతో ఈ ఇద్దరి విడాకులు రూమర్స్ కాదని తేలిపోయిందని నెటిజన్లు వాపోతున్నారు.

సానియా భర్తను అనే పదాలను ఇన్‍స్టా బయో నుంచి షోయబ్ మాలిక్ తొలగించడంతో విడాకుల రూమర్లు మళ్లీ గుప్పుమంటున్నాయి.

2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‍లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాహం ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అనంతరం వలీమా పాకిస్థాన్‍లోని సియాల్కోట్‍లో జరిగింది. 2018లో మగపిల్లాడు ఇజాన్‍కు జన్మనిచ్చింది సానియా. వీరిద్దరూ మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో వీరి విడాకుల ఊహాగానాలు తొలిసారి బయటికి వచ్చాయి. సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారని, కుమారుడిని ఇద్దరూ చూసుకునేలా న్యాయపరమైన అంశాలను సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. సానియా, షోయబ్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. అయితే, మీర్జా అండ్ మాలిక్ షోను కలిసి చేసి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ ఇద్దరూ ప్రయత్నించారు. అయితే, విడాకుల వార్తలను మాత్రం నేరుగా ఖండించలేదు.

షోయబ్ మాలిక్.. తన భార్య సానియా మీర్జాను మోసం చేశాడని గతంలో వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ మోడల్‌తో మాలిక్‌కు ఎఫైర్ ఉందని, ఈ విషయం తెలిసే సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందని సోషల్ మీడియా కోడై కూసింది. కొన్ని వ్యాపార సంబంధమైన కారణాల వల్ల విడాకుల విషయం ఆలస్యమైందని నెటిజన్లు చెప్పుకున్నారు.

సుమారు ఏడాదికాలంగా ఈ ఇద్దరి విడాకులకు సంబంధించిన వార్తలు మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.  అయితే కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరూ పాకిస్తాన్‌లో ఓ టీవీ నిర్వహించే ‘ది మీర్జా మాలిక్ షో’కు హాజరుకావడంతో  విడాకుల వ్యవహారం రూమర్సే అని అనుకున్నారు.  అదీగాక అటు మాలిక్ గానీ ఇటు మీర్జా గానీ దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో  వాళ్లు చేసిన చర్యలు విడాకుల గురించి కన్ఫర్మ్ చేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.  అయితే ఇదే విషయమై సానియా కుటుంబసభ్యులు స్పందిస్తూ.. ‘సానియా, షోయభ్‌లో తమ వ్యక్తిగత జీవితం గురించి విడివిడిగా లేదా ఉమ్మడిగా  ఎటువంటి అధికారిక ప్రకటన చేయకూడదని భావిస్తున్నారు.  వాళ్ల  ప్రైవసీని గౌరవిస్తే బాగుంటుంది’ అని  చెప్పడం గమనార్హం.