టీమిండియాకి వార్నింగ్ ఇచ్చిన షోయ‌బ్ అక్త‌ర్

పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా 80+ స్కోర్లతో రాణించినా మిగిలిన ప్లేయర్లు అందరూ బ్యాటింగ్‌లో మూకుమ్మడిగా ఫెయిల్ అవ్వడంతో టీమిండియా 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ […]

Share:

పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా 80+ స్కోర్లతో రాణించినా మిగిలిన ప్లేయర్లు అందరూ బ్యాటింగ్‌లో మూకుమ్మడిగా ఫెయిల్ అవ్వడంతో టీమిండియా 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను షాహీన్ ఆఫ్రిదీ అవుట్ చేస్తే, హారీస్ రౌఫ్, నసీం షా కూడా మూడేసి వికెట్లతో మెరిశారు. టీమిండియా బ్యాటర్లు అందరూ పాక్ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు. 

 ఇప్పటి వరకు కొలంబోలో మూడు సార్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడ్డాయి 1997లో ఇక్కడ జరగాల్సిన రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. 2004 ఆసియా కప్‌లో భాగంగా కొలంబోలో ఇండియా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఓడింది.  షోయబ్ మాలిక్ బ్యాటింగ్‌లో 143 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు.  తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 300 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 78 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 38, సౌరవ్ గంగూలీ 39 పరుగులు, యువరాజ్ సింగ్ 28 పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో భారత జట్టుకి 38 పరుగులు అదనంగా వచ్చాయి. అయితే మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. దీంతో 241 పరుగులకే పరిమితమైన భారత జట్టు, 59 పరుగుల తేడాతో ఓడింది.

‘కొలంబోలో చాలా ఏళ్ల తర్వాత ఆడబోతున్నారు. చాలా ఏళ్లకు అయినా మంచిదే. గొప్ప దేశం, గొప్ప మనుషులు. వాతావరణం కూడా బాగుంది. మా వాళ్లతో జాగ్రత్తగా ఆడండి… ’ అంటూ చెబుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు షోయబ్ అక్తర్.. ‘‘పాకిస్థాన్ స్పిన్‌ విభాగం బలహీనంగా ఉంది. షాదాబ్ ఖాన్ మంచి బౌలరే. కానీ, జట్టులో స్పిన్‌ బౌలింగ్‌ చేయగలిగిన ఆల్‌రౌండర్ లేడు. రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో పాక్‌ ఒకటి. ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌ ఫేవరెటే. నిజాయితీగా చెప్పాలంటే.. భారత్‌ను భారత్‌లో ఓడించడం దాదాపు అసాధ్యం. అయితే, భారత్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం కూడా అంతే. ఎందుకంటే రెండు జట్లలో మంచి పేస్ బౌలర్లు ఉన్నారు. టీమ్‌ఇండియా స్పిన్‌ విభాగం కూడా బలంగా ఉంది. ఇరుజట్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. పాకిస్థాన్‌ బ్యాటింగ్ గతంలో బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఆ జట్టు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పటిష్టంగా ఉంది. వారిని ఔట్ చేయడం అంత తేలికైన విషయం కాదు’’ అని షోయబ్‌ అక్తర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో అన్నాడు.

 గత రెండేళ్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 4 మ్యాచులు జరగగా రెండింట్లో పాకిస్తాన్, మరో రెండింట్లో భారత జట్టు గెలిచింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో టీమిండియా పరాజయం తర్వాత ప్రతీ పాక్ మాజీ క్రికెటర్ నోటికి వచ్చినట్టు వాగుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు భారత జట్టు అభిమానులు. ఆసియాకప్ 2023 టోర్నీలో మరోసారి దయాదుల పోరుకు అంతా సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భారత్, పాకిస్థాన్ మధ్య నేడు (సెప్టెంబర్ 10) మ్యాచ్ జరగనుంది. శ్రీలంక కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానం వేదికగా భారత్, పాక్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‍ను కూడా వర్షం భయపెడుతోంది. ఇప్పటికే గ్రూప్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దవగా.. నేడు జరగనున్న సూపర్-4 మ్యాచ్‍కు కూడా వాన ముప్పు ఉంది. అయితే, రిజర్వ్ డే ఉండడం ఉపశమనంగా ఉంది.