టీమిండియా పాక్‌కు రావాలన్న షాహిద్ ఆఫ్రిది..

ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేస్తానన్న పాక్ మాజీ కెప్టెన్.. ఆసియా కప్ ఆడడానికి టీమిండియా పాకిస్థాన్‍‍‌‌‌‌‌‌కి రావాలని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అన్నారు. భారత్ పాక్ ద్వైపాక్షిక సంబంధాలు బలపడడానికి మొదటి అడుగు వేయాలని ఆయన కోరారు.  ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి టీమిండియా వెళ్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.. ఇప్పటికే బీసీసీ కార్యదర్శి జై షా స్పందించారు.  ఈ టోర్నమెంట్ […]

Share:

ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేస్తానన్న పాక్ మాజీ కెప్టెన్..

ఆసియా కప్ ఆడడానికి టీమిండియా పాకిస్థాన్‍‍‌‌‌‌‌‌కి రావాలని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అన్నారు. భారత్ పాక్ ద్వైపాక్షిక సంబంధాలు బలపడడానికి మొదటి అడుగు వేయాలని ఆయన కోరారు.  ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి టీమిండియా వెళ్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.. ఇప్పటికే బీసీసీ కార్యదర్శి జై షా స్పందించారు.  ఈ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్‍‍‌‌‌‌‌‌కి భారత్ వెళ్లదని గతంలోనే క్లారిటీ ఇచ్చారు..

ఇది యుద్ధాలు చేసుకునే సమయం కాదు.. 

ఆసియా కప్ 2023 పై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ స్పందించారు. షాహిద్ ఆఫ్రిది దోహలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  భారత్ తమ దేశానికి వస్తే బాగుంటుందని తెలిపారు. ఇది యుద్ధాలు, పోరాటం చేసుకునే తరం కాదని.. తత్సంబంధాలు మెరుగుపడాలని తాను కోరుకుంటున్నట్లు షాహిద్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. క్రికెట్ ఈ రెండు దేశాల మధ్య ఉత్తమ దౌత్యంగా పనిచేస్తుందని చెప్పారు. ఇరుజట్లు పరస్పరం సహకారం అందించుకోవాలని తెలిపారు. 

మేం వచ్చాం.. మీరు రండి..

ఆసియా కప్ 2008లో ఆడటానికి పాక్‌కు టీమిండియా వెళ్ళిందని గుర్తు చేశారు. ఈరోజు పాక్‌‌లో ద్వైపాక్షిక సిరీస్ 2006లో జరిగింది t20 ప్రపంచ కప్ 2016 లో ఆడటానికి చివరిసారి భారత్‌‌కి పాకిస్తాన్ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు పాకిస్తాన్లో జరగబోయే ఆసియా కప్ మ్యాచ్‌కి భారతదేశం కూడా పాకిస్తాన్‌కి రావాలని ఆఫ్రీదీ కోరారు. 

ప్రధాని మోదీ తోనే.. 

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షాహిద్ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుపడాలంటే క్రికెట్ ఒకటే మార్గమని.. ఈ విషయంలో తాను త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థిస్తానని అన్నాడు.  లెజెండ్స్ క్రికెట్ లో ట్రోఫీ గెలిచినా అనంతరం ఆఫ్రిది ఈ కామెంట్స్ చేశారు. ఎల్‌ఎల్‌సి గెలిచిన తర్వాత ఆఫ్రిది ఈ కామెంట్స్ చేశారు.  భారత్ పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు, ఇతర టోర్నమెంట్లు జరగాలి. ఈ మేరకు నేను ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్‌కు పంపాలని త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరుతాను అని చెప్పారు.

 ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇంతవరకు ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి చర్చించుకోలేదని.. చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆఫ్రిది అన్నారు. అసలు వాస్తవం ఏంటంటే.. ఇంతవరకు అసలు బీసీసీఐ గాని ఇటు పిసిబి గాని తమ సమస్యల గురించి చర్చించుకోలేదు. కూర్చుని పరిష్కరించుకుంటే తప్ప సమస్యలకు సమాధానం దొరకదని.. ఇరు బోర్డుల మధ్య కమ్యూనికేషన్ చాలా ప్రధానమని ఆఫ్రిది అన్నారు.  “నాకు ఇప్పటికీ టీం ఇండియాలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎల్ఎల్సి లో భాగంగా టీం ఇండియాతో మ్యాచ్ ఆడినప్పుడు నేను సురేష్ రైనా దగ్గరికి వెళ్లి బ్యాట్ అడిగా.. నేను అడగగానే రైనా బ్యాట్ ఇచ్చాడు” అని తెలిపారు. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్టు కూడా పాకిస్తాన్‌కు వచ్చి క్రికెట్ ఆడుతున్నాయని గుర్తు చేశారు.  భారత్ భద్రతా సమస్యల గురించి ఆందోళన చెందితే తాము కూడా భారత్‌కి వచ్చినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఆఫ్రిది తెలిపారు. మరి ఈ కామెంట్స్ పై కేంద్ర ప్రభుత్వం బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..