హర్మన్‌ప్రీత్ ప్రవర్తనపై షాహిద్ అఫ్రిది అసంతృప్తి

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో అంపైర్స్‌ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీమ్ ఇండియా ఉమెన్స్ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్.ఢాకా  వేదికగా భార‌త్, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య శనివారం జ‌రిగిన నిర్ణయాత్మక మూడో వ‌న్డే టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో భారత్ సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. విజయానికి ఒక పరుగు అవసరం కాగా.. హర్మన్‌ప్రీత్‌ సేన చివరి వికెట్ కోల్పోయింది. […]

Share:

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో అంపైర్స్‌ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీమ్ ఇండియా ఉమెన్స్ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్.ఢాకా  వేదికగా భార‌త్, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య శనివారం జ‌రిగిన నిర్ణయాత్మక మూడో వ‌న్డే టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో భారత్ సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. విజయానికి ఒక పరుగు అవసరం కాగా.. హర్మన్‌ప్రీత్‌ సేన చివరి వికెట్ కోల్పోయింది. అంపైర్లు ‘సూపర్ ఓవర్’ నిర్వహించకుండానే ఇరు జట్లను సంయుక్త విజేత‌లుగా (1-1) ప్ర‌క‌టించారు

ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ ఔట్ విష‌యంలో అంపైర్స్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ ఔట్ విష‌యంలో బంగ్లా ప్లేయ‌ర్స్ అప్పీల్ చేయ‌డానికంటే ముందే అంపైర్ ఆమెను ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

. ఆ ఓవర్‌‌లోని మూడో బంతిని హర్మన్‌ప్రీత్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ప్లేయర్స్ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయగా.. అంపైర్‌ వెంటనే ఔట్‌ అంటూ వేలు ఎత్తేశాడు. హర్మన్‌ ఔటే కానీ.. బౌలర్‌ అప్పీల్‌ చేయడమే ఆలస్యం ఔట్‌ ఇచ్చేందుకు అంపైర్ సిద్ధంగా ఉన్నట్లు వ్యవహరించడం హర్మన్‌కు కోపాన్ని తెప్పించింది. దీంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టి.. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారిపై నోరు పారేసుకోవడంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.8 ఆర్టికల్ ప్రకారం మరో తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ సీరియస్ అయింది. 

హర్మన్‌ప్రీత్ కౌర్‌ మైదానం వీడుతూ అంపైర్‌‌ను బండ బూతులు తిట్టినట్లు పలు వీడియోల్లో కనిపిస్తోంది. అంతేకాదు ఆమె పెవిలియన్‌‌కు వెళ్తున్న సమయంలో బంగ్లా అభిమానులు రెచ్చగొట్టగా.. వారికి అసభ్యకరంగా బొటన వేలు చూపించింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యాస్తిక ఎల్బీ, మేఘన క్యాచ్‌ విషయంలోనూ అంపైర్ల తీరు బాగాలేదని హర్మన్‌ప్రీత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్‌ ముగిశాక అంపైర్ల తీరుపై హర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంపైరింగ్‌ పేలవంగా ఉందని, మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చేముందే ఇలాంటి అంపైరింగ్‌కు సన్నద్ధమయ్యే వస్తామని పేర్కొంది. ట్రోఫీ ప్రదానోత్సవం తర్వాత రెండు జట్ల ఉమ్మడి ఫొటో సమయంలోనూ బంగ్లా క్రికెటర్లను అవమానపరిచేలా మాట్లాడినట్లు వెల్లడైంది.

అంతర్జాతీయ మ్యాచ్ లో హద్దు దాటి విమర్శ చేయడంతో లెవల్ 1 తప్పిదం కింద మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అవార్డు ప్రదానం చేసే సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపట్టడంతో పాటు కౌర్ విమర్శలు చేసి మూల్యం చెల్లించుకుంది. దీంతో ఐసీసీ ఆమెపై కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమైంది. 

హర్మన్‌ప్రీత్ ప్రవర్తన గురించి మాట్లాడిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్….

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది హర్మన్‌ప్రీత్ ప్రవర్తనపై తన నిరాశను వ్యక్తం చేశాడు,అయితే  క్రికెట్‌లో ఇలాంటి ప్రవర్తన సర్వసాధారణం కాదని ఆఫ్రిది పేర్కొన్నాడు.

ఇది భారతదేశం ఆటగాళ్లలో మాత్రమే కాదు చాలా సార్లు మనం గతంలో కూడా చూశాం. అయినప్పటికీ, మహిళల క్రికెట్‌లో ఇది తరచుగా కనిపించదు. ఇది ఐసిసి ఆధ్వర్యంలో పెద్ద ఈవెంట్. మీరు భవిష్యత్తు కోసం ఒక ఉదాహరణను సెట్ చేస్తారు అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి  మీరు క్రికెట్‌పై దూకుడు పెంచుకోవచ్చుకానీ ఇది కొంచెం ఎక్కువ అయితే అది మంచిది కాదు అని అఫ్రిది అన్నారు.

భారత కెప్టెన్ నాలుగు డీమెరిట్ పాయింట్లను తెచ్చుకుంది ..అది ఇప్పుడు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నుండి సస్పెన్షన్‌కు సమానం. ప్రస్తుతం, సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడలకు ముందు ఏ సిరీస్ షెడ్యూల్ చేయబడలేదు, అంటే హర్మన్‌ప్రీత్ హాంగ్‌జౌలో జరిగే మార్క్యూ ఈవెంట్‌లో ప్రారంభ రెండు గేమ్‌లను కోల్పోవచ్చు.