రింకూ సింగ్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన షారుఖ్ కూతురు సుహానా ఖాన్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఉత్కంఠభరితమైన ఐపిఎల్ 2023 మ్యాచ్ చివరి ఓవర్‌లో రింకూ సింగ్ అద్భుతమైన ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ గెలిపించిందందుకు షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ప్రశంసించారు. ఆనందాన్ని ఆపుకోలేని సుహానా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో కూడిన పోస్ట్ చేసింది.  దానికి ” నేను ఇంకా నమ్మలేకపోతున్నాను” అని రాసుకొచ్చింది. నటి అనన్య పాండే కూడా తనపోస్ట్ పై ఒక ఫోటోని కూడా షేర్ చేసింది.  ఆమె ఎమోటికాన్‌లను కూడా […]

Share:

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఉత్కంఠభరితమైన ఐపిఎల్ 2023 మ్యాచ్ చివరి ఓవర్‌లో రింకూ సింగ్ అద్భుతమైన ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ గెలిపించిందందుకు షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ప్రశంసించారు.

ఆనందాన్ని ఆపుకోలేని సుహానా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో కూడిన పోస్ట్ చేసింది.  దానికి ” నేను ఇంకా నమ్మలేకపోతున్నాను” అని రాసుకొచ్చింది.

నటి అనన్య పాండే కూడా తనపోస్ట్ పై ఒక ఫోటోని కూడా షేర్ చేసింది.  ఆమె ఎమోటికాన్‌లను కూడా ఉపయోగించి ఈ పోస్ట్ చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. విజయ్ శంకర్ 24 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా 38 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ కూడా 31 బంతుల్లో ఐదు ఫోర్లతో సహా 39 పరుగులు చేశాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన సునీల్ నరైన్ KKR టీంలో టాప్ బౌలర్. ఈ మ్యాచులో అతను నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు మ్యాచ్‌లో RCBతో జరిగిన మూడు మ్యాచ్‌ల తర్వాత సుయాష్ శర్మ కూడా తన నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి 35 పరుగులు ఇచ్చాడు.

205 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ ఓపెనర్ రహమణుల్లా గురుబాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుటవగా,  జగదీషన్ (6) రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయాడు. ఇక కెప్టెన్ నితీష్ రాణా (29 బంతుల్లో 45 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు ) మరియు వెంకటేష్ అయ్యర్ (40 బంతుల్లో83 పరుగులు, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

చివరి ఓవర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 29 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటింగ్‌లో ఉమేష్ యాదవ్ మరియు రింకూ సింగ్ ఉన్నారు. ఆఖరి ఓవర్‌లో ఉమేష్ యాదవ్ మొదటి బంతికి ఒక పరుగు చేసి.. రింకూకి స్ట్రైక్ ఇచ్చాడు. ఇక అక్కడి ఉంది మొదలయింది రింకూ సుడిగాలి ఇన్నింగ్స్.  వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు కొట్టి అసాధ్యమనుకున్న KKR విజయాన్ని సుసాధ్యం చేశాడు. కాగా రింకూ కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్లతో 48 పరుగులు చేసి ఔరా అనిపించాడు. చివరి ఓవర్ వేసిన యష్ దయాల్ ఏకంగా 31 పరుగులిచ్చాడు.

ఇక గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు, అజారి జోసెఫ్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ, జాషువా లిట్టిల్ చెరో వికెట్ పడగొట్టారు.  

గేమ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

KKR రెండు మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోవడంతో నాలుగు పాయింట్లు సాధించింది. GT ఒక మ్యాచ్ గెలిచి, రెండు ఓడిపోయింది, కాబట్టి వారికి రెండు పాయింట్లు ఉన్నాయి. GT కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్నందున KKR పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది.