ఐపీఎల్-2023లో ఆరెంజ్ క్యాప్‌ ఆ నలుగురిలో ఒకరికి రావచ్చు: సెహ్వాగ్

ఆ నలుగురు క్రికెటర్ల జాబితాలో.. ICC T20I నంబర్ 1 ర్యాంకింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. మరోవైపు గత సంవత్సరం ప్రధాన రన్ స్కోరర్ జోస్ బట్లర్‌ పేరును కూడా చేర్చలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ శుక్రవారం (మార్చి 31) నుండి ప్రారంభమైంది.  ఈ T20 కార్నివాల్ వచ్చే రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది టాప్ ప్రైజ్ కోసం మొత్తం 10 టీమ్‌లు ఒకరితో మరొక టీమ్ పోటీపడుతున్నాయి.  […]

Share:

ఆ నలుగురు క్రికెటర్ల జాబితాలో.. ICC T20I నంబర్ 1 ర్యాంకింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. మరోవైపు గత సంవత్సరం ప్రధాన రన్ స్కోరర్ జోస్ బట్లర్‌ పేరును కూడా చేర్చలేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ శుక్రవారం (మార్చి 31) నుండి ప్రారంభమైంది.  ఈ T20 కార్నివాల్ వచ్చే రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది టాప్ ప్రైజ్ కోసం మొత్తం 10 టీమ్‌లు ఒకరితో మరొక టీమ్ పోటీపడుతున్నాయి. 

ఇక స్టార్ స్పోర్ట్స్‌తో పరస్పర చర్చ సందర్భంగా.. భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ సంవత్సరం ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకునే వారి గురించి జోస్యం చెప్పాడు. ఆరెంజ్ క్యాప్‌ సీజన్‌లో అత్యధిక రన్ చేసిన బ్యాటర్ కి ఇవ్వబడుతుంది. అయితే ఈ దిగ్గజ క్రికెటర్ నలుగురు భారతీయ బ్యాటర్‌లను ఎంచుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే..  ఆ నలుగురు క్రికెటర్ల జాబితాలో.. ICC T20I నంబర్ 1 ర్యాంకింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. మరోవైపు గత సంవత్సరం ప్రధాన రన్ స్కోరర్ జోస్ బట్లర్‌ పేరును కూడా చేర్చలేదు.

సెహ్వాగ్ ప్రకారం.. IPL 2021 ఆరెంజ్ క్యాప్ విజేత, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ సంవత్సరం మరోసారి క్యాప్ గెలుచుకునే రేసులో ఉన్నాడు.  ఇక అతనితో పాటు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ KL రాహుల్, బ్యాటింగ్ సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కూడా పోటీలో ఉంటారని సెహ్వాగ్ తెలిపాడు.

ఐపీఎల్ 2023లో శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 

179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టుకు ఓపెనర్లు శుభమ్ గిల్, సాహా శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంపాక్ట్ ప్లేయర్ సుదర్శన్ 3వ స్థానంలో వచ్చి దూకుడుగా ఆడాడు. అయితే కీలక సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ దీపక్ చాహర్ బౌలింగ్‌ చేశాడు. ఈ ఓవర్లో రషీద్ ఖాన్ ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో 19వ ఓవర్ తర్వాత 6 బంతుల్లో 6 పరుగులు జోడించిన గుజరాత్ జట్టుకు 15 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తుషార్ దేశ్‌పాండే వేసిన చివరి ఓవర్‌లో రాహుల్ తెవాటియా రెండు బంతుల్లో 6,4 పరుగులు చేసి విజయోత్సవాన్ని పూర్తి చేశాడు.

ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 4×4, 9×6లతో 92 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు, అతనితో కలిసి ఆరంభంలో మొయిన్ అలీ (23: 17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడాడు. చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (14 నాటౌట్: 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) కూడా ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదడంతో ఇన్నింగ్స్ 178 పరుగుల వద్ద ముగిసింది. అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు. జాషువా లిటిల్‌కి ఒక వికెట్ దక్కింది.