దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన గొప్ప రన్నర్ శర్వాన్ సింగ్ జీవిత కథ

1954 ఆసియా క్రీడలలో 110 మీటర్ల రేస్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు అందరూ అతనిని గొప్ప అథ్లెట్‌గా ఎదుగుతాడని అనుకున్నారు. అయితే విధి మరోలా భావించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కష్టపడి పారిపోయే వారికి ఎప్పుడూ విజయం లభించదు. కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా కొందరు అనుకున్నది సాధించలేరు. అలాంటి వారిలో శర్వాన్ సింగ్ పేరు కూడా వస్తుంది. ఆయన 1954 ఆసియా క్రీడలలో 110 మీటర్ల రేస్ లో బంగారు పతకాన్ని […]

Share:

1954 ఆసియా క్రీడలలో 110 మీటర్ల రేస్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు అందరూ అతనిని గొప్ప అథ్లెట్‌గా ఎదుగుతాడని అనుకున్నారు. అయితే విధి మరోలా భావించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

కష్టపడి పారిపోయే వారికి ఎప్పుడూ విజయం లభించదు. కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా కొందరు అనుకున్నది సాధించలేరు. అలాంటి వారిలో శర్వాన్ సింగ్ పేరు కూడా వస్తుంది. ఆయన 1954 ఆసియా క్రీడలలో 110 మీటర్ల రేస్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు అందరూ అతనిని గొప్ప అథ్లెట్‌గా ఎదుగుతాడని అనుకున్నారు. అయితే విధి మరోలా భావించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

1954లో ఆసియా క్రీడల్లో 110 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం శర్వాన్ సింగ్ కు వచ్చింది. శర్వాన్ సింగ్ తొలిసారిగా లక్షల మంది జనం ముందు పరుగెత్తబోతున్నాడు. అలాంటి సందర్బంలో చాలామంది ఉద్విగ్నతకు లోనవుతారు. కానీ శర్వాన్‌ లో అవేమి కనిపించలేదు. విజయం సాధించి దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా కనిపించాడు. 1954లో మనీలాలో జరిగిన ఆ ఆసియా క్రీడల్లో 110 మీటర్ల హర్డిల్స్‌ను 14.7 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించడం అద్భుతమైన అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇక ఆ పోటీ తర్వాత సర్వాన్ సింగ్ లైఫ్ మొత్తం మారిపోతుందని.. అతడు ఒక సూపర్​స్టార్​లా వెలుగొందుతాడని అనుకున్నారు. 

కానీ.. ఇది అతని మొదటి అంతర్జాతీయ పోటీ. అతను అందులో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎంట్రీ చూసిన తర్వాత అందరూ అతనికి గొప్ప కెరీర్ ఉందని అనుకున్నారు. కాని అదృష్టం వేరేలా ఆలోచించింది. దేశానికి బంగారు పతకం సాధించిన రన్నర్‌ శర్వాన్‌కు దక్కాల్సినవన్నీ దక్కలేదు. శర్వాన్ 1970లో బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్ నుండి రిటైర్ అయిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. 1970 ప్రాంతంలో సైన్యం నుండి పదవీ విరమణ చేసినప్పుడు, అతనికి ప్రభుత్వం నుండి వచ్చిన పింఛను చాలా తక్కువ. దీంతో 20 ఏళ్లుగా అంబాలాలో టాక్సీ నడుపుతూ కుటుంబానికి, స్నేహితులకు దూరంగా జీవించాడు.

టాక్సీ నడిపాడు, పొలాల్లో పనిచేశాడు సుమారు ఆరేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో శర్వాన్ సింగ్ తన పరిస్థితి గురించి చెబుతూ బంగారు పతకం గెలిచినప్పటికీ ఎవరూ తనను పట్టించుకోలేదని చెప్పాడు. గోల్డ్ మెడలిస్ట్ అయిన అతను భిక్షాటన కంటే ట్యాక్సీ నడపడం మంచిదని భావించానని అన్నాడు. తనకు 70 ఏళ్లు వచ్చేసరికి ట్యాక్సీ డ్రైవింగ్ చేసే ఉద్యోగాన్ని కోల్పోయానని శర్వాన్ సింగ్ చెప్పాడు. అటువంటి పరిస్థితిలో పొలాల్లో కూడా పనికి వెళ్ళవలసి వచ్చిందని అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి దేశానికి బంగారు పతకం తెస్తే వారి జీవితమే మారిపోతుంది. కానీ ఆ రోజుల్లో బంగారు పతకం తెచ్చిన సర్వాన్ సింగ్​కు అవేమీ దక్కలేదు. పైగా అతడికి అదృష్టం కూడా కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఇప్పటి క్రీడాకారులకు కోట్లలో యాడ్స్, ఇతర సన్మానాలు, పారితోషకాలు లభిస్తున్నాయి. కానీ శర్వాణ్ సింగ్ మాత్రం జీవితం మొత్తం కష్టపడుతూనే ఉన్నాడు. అతడు ఎవర్ని కూడా చేయి చాచి ఒక్క రూపాయి అడగకపోవడం గమనార్హం. దేశం తరఫున ఎన్నో సాధించిన శర్వాణ్​ సింగ్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు.