హైదరాబాద్‌‌లోనే వీడ్కోలు

టెన్నిస్ ఆటకు వన్నె తెచ్చిన సానియా మీర్జా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మరలా ఈ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్టార్ మువ్వన్నెలా జెండా కీర్తి ప్రతిష్టలను ఎంతో పెంచింది. ఈ స్టార్ మన తెలుగు అమ్మాయి కావడం..  తెలుగు వారిగా ప్రతి ఒక్కరికీ గర్వకారణం. తన కెరియర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసిన ఈ ముద్దుగుమ్మ.. మార్చి 5 న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో తన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు […]

Share:

టెన్నిస్ ఆటకు వన్నె తెచ్చిన సానియా మీర్జా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మరలా ఈ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్టార్ మువ్వన్నెలా జెండా కీర్తి ప్రతిష్టలను ఎంతో పెంచింది. ఈ స్టార్ మన తెలుగు అమ్మాయి కావడం..  తెలుగు వారిగా ప్రతి ఒక్కరికీ గర్వకారణం. తన కెరియర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసిన ఈ ముద్దుగుమ్మ.. మార్చి 5 న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో తన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తన ప్రొఫెషనల్ ఆటకు వీడ్కోలు పలికిన సానియా.. మార్చి 5 న జరగనున్న చివరి మ్యాచ్‌తో వీడ్కోలు పలకనుంది. ఈ మ్యాచ్ మన తెలుగు ప్రేక్షకుల మధ్య జరగనుంది.

ఎన్నో టైటిల్స్.. ఎంతో పేరు కానీ చివరికి!

సానియా మీర్జాను ఎన్నో టైటిల్స్ వరించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తన ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ముద్దు గుమ్మను అభిమానులు ముద్దుగా భారత టెన్నిస్ క్వీన్ అని పిల్చుకుంటూ ఉంటారు. అటువంటి పేరున్న సానియా మీర్జా.. తన వీడ్కోలు మ్యాచ్‌ను స్వస్థలమైన హైదరాబాద్‌లో సొంత మనుషుల మధ్య ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఈ వీడ్కోలు మ్యాచ్‌కు మార్చి 5న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం వేదిక కానుంది. టోర్నీలో భాగంగా సానియా మీర్జా కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో పాల్గొననుంది. ఈ మ్యాచ్‌కు ముందు సానియా మాట్లాడుతూ.. నేను నా చివరి టెన్నిస్ మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాను, సరిగ్గా 18-20 సంవత్సరాల క్రితం.. నా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో.. అక్కడే నా చివరి మ్యాచ్ జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. నా సన్నిహితులు, నా కుటుంబం, నా భాగస్వామి అందరి మధ్య చివరి మ్యాచ్ ఆడడం మధురానుభూతి అని పేర్కొంది.

అభిమానుల ప్రేమ మర్చిపోలేనిది

ఈ ప్రయాణంలో నా స్నేహితులు, నా కుటుంబం, అన్నింటికంటే ముఖ్యమైనదని ఇక నాకు అత్యంత నమ్మకమైన నా అభిమానులు.. తన మీద ఎంతో ప్రేమ చూపించారని సానియా చెప్పుకొచ్చింది. ఈ ప్రయాణంలో నాతో కలిసి ఉన్న అనుచరుల ముందు ఈ ప్రయాణాన్ని అందంగా ముగించడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా.. తన వీడ్కో మ్యాచ్‌లో భాగంగా రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి ఈవెంట్ నటులు, క్రికెటర్లు మరియు టెన్నిస్ ఆటగాళ్లతో కూడిన రెండు జట్ల మధ్య రౌండర్స్ గేమ్. ఈ రెండు జట్లలో ఒక జట్టుకు సానియా నాయకత్వం వహిస్తుండగా, మరొక జట్టుకు భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న నాయకత్వం వహిస్తున్నాడు. ఇక రెండోది సానియా మీర్జా, రోహన్ బోపన్న, ఇవాన్ డోడిగ్, బెథానీ మాటెక్-సాండ్స్ మధ్య మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ మ్యాచ్. బోపన్న, డోడిగ్, సాండ్స్ గతంలో సానియా మీర్జాతో కలిసి ఎన్నో టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్ ఆడారు. సానియా మీర్జా, రోహన్ బోపన్న చాలా కాలం పాటు సహచరులుగా ఉన్నారు. వీరు రియో 2016 ఒలింపిక్స్‌లో కూడా మిక్స్‌డ్ డబుల్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం ప్రారంభంలో.. ఈ జంట ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది.

కీర్తిని పెంచిదనడంలో సందేహం లేదు

సానీయా మీర్జా భారతదేశ కీర్తిని పెంపొందించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్టార్ ఎన్నో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను మన దేశానికి అందించింది. అసలు సానియా కంటే ముందు ఇండియా నుంచి టెన్నిస్‌లో ప్రాతినిధ్యం వహించనవారే కరువు. సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు. సానియా మీర్జా నిస్సందేహంగా భారతదేశపు అత్యంత నిష్ణాతులైన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన తన అద్భుతమైన కెరీర్‌లో ఆమె 44 WTA ఛాంపియన్‌షిప్‌లను (డబుల్స్‌లో 43, సింగిల్స్‌లో ఒకటి) గెలుచుకుంది. ఆ సమయంలో మహిళల డబుల్స్ WTA ర్యాంకింగ్స్‌లో ఆమె ప్రపంచ నం. 1 కూడా. సానియా మీర్జా వీడ్కోలు వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్‌తో సహా చాలా మంది ప్రముఖులు అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.