ముంబైలో ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లోకి రావడం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం, జట్టులో డబుల్ జోష్ నింపారు.  ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తనదైన స్టైల్‌లో షాట్లు వేశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. అనంతరం తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తొలి […]

Share:

రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లోకి రావడం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం, జట్టులో డబుల్ జోష్ నింపారు.  ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తనదైన స్టైల్‌లో షాట్లు వేశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. అనంతరం తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయకేతనం ఎగురవేసింది. అంతేకాకుండా ఈ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మొదటి మ్యాచ్‌లో ముంబై‌పై గెలిచిన ఆర్‌సి‌బి, ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ముంబై మూడో మ్యాచ్ లో విజయం సాధించింది. సుమారు రెండేళ్ల తర్వాత రోహిత్ చేసిన హాఫ్ సెంచరీ ఇది కావడంతో విశేషం సంతరించుకుంది.  అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం రోహిత్ కు ఇది 11వసారి.  ఐపీఎల్ చరిత్రలో ఎన్నిసార్లు ఆ అవార్డు మరే ఇతర ఆటగాడికి దక్కలేదు.  ఢిల్లీ క్యాపిటల్స్ పై రోహిత్ శర్మ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల తో మొత్తం 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తరువాత రోహిత్ శర్మ  మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. 

రోహిత్ ముంబైలో ఉన్నప్పుడు తను ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే ఎలాంటి ప్రదేశాలను ఇష్టపడతాడో కూడా చెప్పాడు. తను బోరివలిలో ఒక ప్రదేశంలో స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతానని చెప్పాడు. ఆ ప్లేస్ గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ నాకైతే మాత్రం చాలా ఇష్టమని తెలిపాడు. క్రాస్ మైదాన్ ఆజాద్ మైదాన్ మధ్యన ఉన్న ఖౌ గల్లీ. చిన్నప్పుడు నేనెప్పుడూ ఈ గల్లీలోనే ఎక్కువ సమయం ఆడుకుంటూ గడిపానని తెలిపాడు. ఇక్కడ దొరికే ప్రతి ఫుడ్ ను తినటానికి ఇష్టపడతానని తెలిపాడు.  రోహిత్ ముంబైలో తనకు చాలా బాగా నచ్చిన వాటిపై కూడా మాట్లాడాడు. ముంబైలో మాన్‌సున్  చాలా ఇష్టపడతానని, ఆ సీజన్ చాలా సంతోషాన్ని కలిగిస్తుందని, గత కొన్ని సంవత్సరాలుగా నేను ముంబైకి వెళ్లలేకపోయానని, కానీ నేను నా బాల్యం మొత్తాన్ని ముంబైలో గడిపానని, “ఇక్కడ రుతుపవనాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు.  అవంటే నాకు చాలా ఇష్టం” అని కూడా తెలిపాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడు సారధిగా జట్టును ముందుండి నడిపించాడు. తనదైన స్టైల్ లో షార్ట్స్ వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ గెలుపు సంతోషాన్ని రోహిత్ శర్మ తన భార్య రితిక సచ్దేతో పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే రితికాకు వీడియో కాల్ చేశాడు ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు ఈ. వీడియో క్లిప్‌ను ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు రోహిత్ శర్మ, ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని కామెంట్ చేశాడు.