ఎంఎస్ ధోనీని మించిపోయిన రోహిత్ శ‌ర్మ‌

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సైతం అధిగమించి, ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద మైలురాయిని సాధించాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్-టొబాగో)లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ నుండి అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ పరుగులు:  MS ధోని తన కెరీర్‌లో 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు 17266 పరుగులు చేశాడు. మాజీ […]

Share:

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సైతం అధిగమించి, ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద మైలురాయిని సాధించాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్-టొబాగో)లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ నుండి అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ పరుగులు: 

MS ధోని తన కెరీర్‌లో 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు 17266 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్, దిగ్గజ వికెట్ కీపర్-బ్యాటర్‌ అయినా ఎంఎస్ ధోనీని సైతం అధిగమించాడు.

రోహిత్ 17281 పరుగులు చేసి, అంతకుముందు టెస్టులో 17092 పరుగులు చేసిన ధోనిను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ జార్ఖండ్ క్రికెటర్ కొన్ని ICC మ్యాచ్‌లు కూడా ఆడాడు, అందుకే అతను 538 మ్యాచ్‌లలో (భారతదేశం & ICC)లో  17266 పరుగులు తీసి ఇప్పుడు ఎంఎస్ ధోని కంటే ముందున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, రోహిత్ భారత్ తరఫున ఓపెనర్‌గా 2000 టెస్టు పరుగులు కూడా పూర్తి చేశాడు.  WIకి వ్యతిరేకంగా ఆడగా ఫైన్ ఫిఫ్టీని సాధించాడు. 2013లో టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన రోహిత్ అత్యధిక పరుగులు చేసి కొత్త మైలురాయి అధిగమించాడు.

భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగుల లిస్ట్ చూద్దాం: 

1. సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు – 34357 పరుగులు

2. విరాట్ కోహ్లీ – 500 మ్యాచ్‌లు – 25461 పరుగులు

3. రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్‌లు – 24064 పరుగులు

4. సౌరవ్ గంగూలీ – 421 మ్యాచ్‌లు – 18433 పరుగులు

5. రోహిత్ శర్మ – 443 మ్యాచ్‌లు – 17281* పరుగులు

6. ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు – 17266 పరుగులు

భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్టులో, 141 పరుగుల తేడాతో విజయం సాధించారు. రోహిత్ 103 పరుగులతో అతని టెస్ట్ కెరీర్‌లో పదవ సెంచరీని నమోదు చేశాడు. ఇది సీనియర్ భారత బ్యాట్స్ మాన్కి ఒక సత్కారం లాంటిది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో, యువ యశస్వి జైస్వాల్‌తో కలిసి మరో సెంచరీ ఓపెనింగ్ స్టాండ్‌ను పంచుకున్నాడు. తను జోమెల్ వారికన్ చేతిలో 80 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఎడమచేతి వాటంగల స్పిన్నర్ చేతిలో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ప్రశంసలు: 

డొమినికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించి ఎట్టకేలకు రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు ముగింపు పలికాడు. గత కొంతకాలంగా భారీ స్కోరు చేసేందుకు ఇబ్బంది పడుతున్న భారత కెప్టెన్‌ ఇప్పుడు సెంచరీ చూసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. రోహిత్ సెంచరీకి స్పందిస్తూ, భారత గ్రేట్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు, ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా రోహిత్ సరిగ్గా లేని ఫామ్‌ ఇప్పుడు మళ్లీ గాడిలో పడినందుకు అనిల్ మెచ్చుకున్నాడు. 

అంతేకాకుండా తను ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాడు అని, ఈ మధ్యకాలంలో ఆడిన కొన్ని మ్యాచెస్ లో మాత్రమే కాస్త అటు ఇటు అయినప్పటికీ, ఇప్పుడు రోహిత్ శర్మ తన సత్తా మళ్ళీ చాటుతున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనిల్ కుంబ్లే.