దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే ప్రారంభమైన రోహిత్ శర్మ పుట్టినరోజు వేడుకలు.

ప్రస్తుతం ఉన్న క్రికెటర్స్ లో టీనేజీ కురాళ్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 క్రికెటర్స్ లో ఒకరు రోహిత్ శర్మ. ఈయన ప్రస్తుతం మన ఇండియన్ టీంకి కెప్టెన్,కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొని ఆయన నేడు ఈ స్థానం వరకు చేరుకున్నాడు. రేపటితో ఆయన 36 వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నాడు, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికే పుట్టిన రోజు వేడుకలు ప్రారంభించేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక […]

Share:

ప్రస్తుతం ఉన్న క్రికెటర్స్ లో టీనేజీ కురాళ్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 క్రికెటర్స్ లో ఒకరు రోహిత్ శర్మ. ఈయన ప్రస్తుతం మన ఇండియన్ టీంకి కెప్టెన్,కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొని ఆయన నేడు ఈ స్థానం వరకు చేరుకున్నాడు. రేపటితో ఆయన 36 వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నాడు, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికే పుట్టిన రోజు వేడుకలు ప్రారంభించేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక రోహిత్ అభిమాని పెట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఒక వీరాభిమాని రోహిత్ కటౌట్ కి దండ వేసి కుంకుమ పెట్టి, కొబ్బరి తో దిష్టి తీసి ఒక దేవుడిని ఎలా అయితే ఊరేగిస్తారో, అలా ఊరేగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోలకు ఇలాంటి సెలెబ్రేషన్స్ చేస్తుంటారు ఫ్యాన్స్, కానీ ఇప్పుడు జనాల్లో సినిమా హీరోల కంటే క్రికెట్ స్టార్స్ పై ఆరాధ్య భావం ఎక్కువైపోయింది.

పైగా నార్త్ ఇండియాలో హీరోలకు ఇలాంటివి జరగడం ఎప్పుడో ఆగిపోయింది. అక్కడ కేవలం సినిమాలు  బాగుంటే చూస్తారు, బాగా లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ ని అయినా పట్టించుకోవడం లేదు, కానీ క్రికెటర్స్ విషయం లో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయ్యింది అనే చెప్పాలి. పుట్టినరోజు ముందే ఇంత హంగామా చేస్తే, ఇక రేపు దేశ వ్యాప్తంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ తమ ఆరాధ్య దైవం పుట్టినరోజు వేడుకలను ఏ రేంజ్ లో జరుపుకుంటారో అర్థం చేసుకోవచ్చు. కేవలం నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియా లో కూడా రోహిత్ శర్మ పుట్టిన రోజు విడాకులు ఘనంగా జరగబోతున్నాయి.  హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ వద్ద, 60 ఫీట్లు ఉన్న రోహిత్ కటౌట్ ని సిద్ధం చేస్తున్నారు ఫ్యాన్స్, రేపు సాయంత్రం నుండి సంబరాలు ప్రారంభం కానున్నాయి.ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కి కూడా 60 ఫీట్ల ఎత్తుతో కటౌట్ ని ఏర్పాటు చెయ్యలేదు. గత ఏడాది విరాట్ కోహ్లీ పుట్టినరోజుకి కూడా ఇలాగే చేశారు కానీ, దాని పొడవు 50 ఫీట్లు మాత్రమే, ఇప్పుడు రోహిత్ ఫ్యాన్స్ ఆ రికార్డుని బద్దలు కొట్టారు.
ప్రస్తుతం IPL టోర్నమెంట్ ఆడుతున్న రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో ఈ సీజన్ లో రాణించలేకపోతున్నాడు. ఆయన సారథ్యంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ టీం ఇప్పటి వరకు IPL లో 5 ట్రోఫీలను గెల్చుకుంది. ఇంతవరకు ఏ టీంకీ కూడా ఇన్ని ట్రోఫీలు రాలేదు, ముంబై ఇండియన్స్ టీంని తిరుగులేని శక్తిగా మార్చాడు రోహిత్ శర్మ. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 7 మ్యాచులు ఆడితే అందులో కేవలం మూడు మ్యాచులు మాత్రమే గెలిచింది. ఇంకో 7 మ్యాచులు మిగిలి ఉన్నాయి, ఈ సీజన్ లో ఆ టీం ప్లే ఆప్స్ కి రావాలంటే కచ్చితంగా అన్నీ మ్యాచులు గెలవాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ ఒక్కడు బ్యాటింగ్ ఫామ్ లోకి వచ్చేస్తే , టీం ప్లే ఆఫ్స్ కి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు విశ్లేషకులు. పాయింట్స్ పట్టిక లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం 8 వ స్థానం లో ఉంది, ఇంత దిగువ స్థాయిలో ఇది వరకు ముంబై ఇండియన్స్ టీం ని ఎప్పుడూ చూడలేదు ఫ్యాన్స్,మరి రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ ఈ టీంని ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్తాడో లేదో చూడాలి.