Rohit Sharma: హిట్ మ్యాన్‌కి చలానా .. ఎందుకంటే?

వరల్డ్ కప్​(World cup) మ్యాచ్‌ ముంగిట క్రికెటర్‌  టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) కు పూణె ట్రాఫిక్‌ పోలీసులు(Pune traffic Police) ఝలక్‌ ఇచ్చారు. ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో మెరుపు వేగంతో డ్రైవ్‌ చేసినందుకు గాను రోహిత్‌కు మూడు చలాన్లు(Three challans) విధించినట్లు సమచారం. 2023 వన్డే ప్రపంచ కప్(World Cup 2023)​లో అంచనాలకు మించి దూసుకుపోతోంది. టైటిల్ ఫేవరెట్లకు పసికూనలు మైండ్ బ్లాక్ షాక్​లు ఇస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్​ను అప్గానిస్థాన్​, దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ […]

Share:

వరల్డ్ కప్​(World cup) మ్యాచ్‌ ముంగిట క్రికెటర్‌  టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) కు పూణె ట్రాఫిక్‌ పోలీసులు(Pune traffic Police) ఝలక్‌ ఇచ్చారు. ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో మెరుపు వేగంతో డ్రైవ్‌ చేసినందుకు గాను రోహిత్‌కు మూడు చలాన్లు(Three challans) విధించినట్లు సమచారం.

2023 వన్డే ప్రపంచ కప్(World Cup 2023)​లో అంచనాలకు మించి దూసుకుపోతోంది. టైటిల్ ఫేవరెట్లకు పసికూనలు మైండ్ బ్లాక్ షాక్​లు ఇస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్​ను అప్గానిస్థాన్​, దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇకపోతే టీమ్​ ఇండియా(Team India) అయితే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇలాంటి సంచలనాలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత జట్టు.. మరో పోరుకు సిద్దమైంది. న్యూజిలాండ్​(New Zealand)తో తలపడనుంది. ధర్మశాల(Dharamshala) వేదికగా జరగనుందీ మ్యాచ్​. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం కోసం రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంది. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత జట్టు, అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడింది. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత 5 రోజుల బ్రేక్ రావడంతో కొందరు ముంబై ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది టీమిండియా(Team india) మేనేజ్‌మెంట్. ముంబైలో ఉండే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ కో… ఇళ్లకు వెళ్లారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో మ్యాచ్ ముగించుకున్న రోహిత్ శర్మ(Rohit sharma), కుటుంబంతో కలిసి పవన్ హన్స్ హెలికాఫ్టర్‌లో ముంబైకి వచ్చాడు. రెండు రోజుల పాటు కుటుంబంతో కలిసి గడిపిన రోహిత్ శర్మ, పూణే(Pune)లో ఉన్న టీమిండియాని కలిసేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రయాణమే అతడిని ఇబ్బందుల్లో పడేసినట్టైంది. 

బ్యాటింగ్ లో ఎప్పుడు ఏ గేరు మార్చి ఎలా దూసుకుపోవాలో తెలిసిన టీమిండియా సారథి రోహిత్ శర్మ హైవే పైనా అదే విధంగా దూసుకెళ్లి చిక్కుల్లో పడ్డాడు. ముంబై నుంచి తన బ్లూ కలర్ లంబోర్ఘిని(Lamborghini) కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పూణే వచ్చాడు రోహిత్ శర్మ. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వేలో రోహిత్ శర్మ ఏకంగా గంటకు 200 కి.మీ.ల వేగంతో కారుని నడిపినట్టు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) గుర్తించారు. ఒకానొక దశలో రోహిత్ కారు స్పీడ్ 215 కి.మీ.లకు చేరింది. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు… యజమాని అయిన హిట్​మ్యాన్​(Hitman)కు అధికారులు చలానాలు వేశారు. అయితే, రోహిత్ శర్మ డ్రైవింగ్ పై ట్రాఫిక్ విభాగం స్పందించింది. ఇలా హై స్పీడ్ లో వెళ్లేకంటే, టీమ్ బస్ లో పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లి ఉంటే బాగుండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

గత ఏడాది డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ హైవేలో ఇదే విధంగా బుల్లెట్ వేగంతో కారు నడిపిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కావడం వల్లే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023(ICC World Test Championship 2023) ఫైనల్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది భారత జట్టు.

 వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ రిషబ్ పంత్ లేని లోటు క్లియర్‌గా తెలుస్తోంది.  ఈ విషయం తెలిసి కూడా రోహిత్ శర్మ ఇంత స్పీడ్‌గా కారు డ్రైవింగ్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే రోహిత్ శర్మ శరీరం చాలా సున్నితమైనది. గట్టిగా ఓ సిరీస్ ఆడితే, తర్వాతి సిరీస్‌ నుంచి రెస్ట్ తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి, ఇలాంటి రాష్ డ్రైవింగ్(Rash driving) చేయడం అతనికి, టీమ్‌కి ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..