రోహిత్ శ‌ర్మ గురించి చెప్పిన తిలక్ వ‌ర్మ‌

ఆగస్టు 30 వ తేదీ నుండి శ్రీలంక వేదికగా వన్డే ఆసియా కప్ ప్రారంభం కానున్నది. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ 2023 కు కూడా ఎక్కువ సమయం లేదు. ఇలాంటి సమయంలో భారత జట్టు ఆటగాళ్ళు గాయాలతో జట్టుకు దూరం అవ్వడం తీరని లోటు, శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి నమ్మకమైన ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరం అయ్యారు. మళ్ళీ వారు ఎప్పుడు జట్టులోకి వస్తారో కూడా తెలియదు. ఇలాంటి […]

Share:

ఆగస్టు 30 వ తేదీ నుండి శ్రీలంక వేదికగా వన్డే ఆసియా కప్ ప్రారంభం కానున్నది. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ 2023 కు కూడా ఎక్కువ సమయం లేదు. ఇలాంటి సమయంలో భారత జట్టు ఆటగాళ్ళు గాయాలతో జట్టుకు దూరం అవ్వడం తీరని లోటు, శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి నమ్మకమైన ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరం అయ్యారు. మళ్ళీ వారు ఎప్పుడు జట్టులోకి వస్తారో కూడా తెలియదు. ఇలాంటి సందర్భంలో వరల్డ్ కప్ ఆడడం అంటే భారత్ జట్టుకు కత్తి మీద సాము లాంటిది. నాలుగవ నెంబర్ పొజిషన్ లో ఎంత మంది ఆటగాళ్లను మార్చినా భారత్ కు చెప్పదగిన ప్లేయర్ దొరకలేదు అనే అనుకోవాలి. టాప్ ఆర్డర్ లో శుభమాన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్నా కూడా మిడిల్ ఆర్డర్ మాత్రం ఆందోళన కలిగిస్తునే ఉంది. కొన్నాళ్ళు ఆ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను ఆడించినా వన్డే ఫార్మాట్ లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. 

అనూహ్యంగా జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ

జూలై , ఆగస్టు నెలల్లో వెస్ట్ ఇండీస్ టూర్ కు వెళ్లిన భారత్ జట్టుకు టీ 20 సిరీస్ లో తిలక్ వర్మ కు స్థానం దొరికింది. తన ఆట తీరుతో వచ్చిన అవకాశాన్ని తిలక్ వర్మ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐదు  టీ 20 మ్యాచ్ లలో 174 పరుగులు సాధించి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. భారత్ 3-2 తో ఈ సిరీస్ ఓడిపోయినా కూడా తిలక్ వర్మ ప్రదర్శన సెలక్టర్ల ఎంపిక కు న్యాయం చేసింది. వెంటనే జరుగుతున్న ఐర్లాండ్ సిరీస్ లో కూడా అతనికి చోటు దక్కింది. ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో విఫలం అయినా కూడా సెలక్టర్లు అతని పై మరోసారి నమ్మకం ఉంచి ఆసియా కప్ కు సెలక్ట్ చేశారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సపోర్ట్ చేశాడు : తిలక్ వర్మ

తిలక్ వర్మ భారత జట్టు కు సెలక్ట్ కాకముందు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. అయితే జట్టులో చేరిన మొదట్లో చాలా ఆందోళన గా ఉండే వాడిని అని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ స్వేచ్ఛ గా ఆడమని ప్రోత్సహించాడు అని అలాగే ఏ సమయంలో అయినా తనకు కాల్ చేయవచ్చు అని చెప్పి ప్రతీ విషయంలోనూ అండగా నిలిచాడు అని బీసీసీఐ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తిలక్ వర్మ వెల్లడించాడు. రోహిత్ శర్మ ప్రోత్సాహం తో స్వేచ్చగా ఆడగలిగాను అని, ఇకపై కూడా అలాగే ఆడతాను అని అన్నాడు. ఆసియా కప్ కు సెలక్ట్ అవ్వడం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, భారత్ జట్టుకు ఆడడం నా కల అని, ఒకే ఏడాది లో రెండు ఫార్మాట్ లలో అరంగేట్రం చేస్తాను అని ఊహించలేదు అని తిలక్ వర్మ అన్నాడు. 

ఈరోజు ఐర్లాండ్ లో జరిగే చివరి టీ 20 మ్యాచ్ తర్వాత భారత్ జట్టు శ్రీలంక కు పయనం అవ్వనుంది. మొదటి రెండు మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే పరిమితం అయిన తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడు అని వేచి చూడాలి.