రోహిత్ శర్మ 17,000 పరుగులు

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక రికార్డుసచిన్ మరియు గంగూలీల ఎలైట్ క్లబ్‌లో చేరిక భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో నాలుగో మరియు చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో రోహిత్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతను […]

Share:

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక రికార్డు
సచిన్ మరియు గంగూలీల ఎలైట్ క్లబ్‌లో చేరిక

భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో నాలుగో మరియు చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో రోహిత్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతను అహ్మదాబాద్ టెస్టులో 17,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన భారత కెప్టెన్ రోహిత్..  అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు. మూడో రోజు ఉదయం సెషన్‌లో మరో నాలుగు పరుగులు చేసి 17 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లో 35 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. ఇందులో ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 17,000 పరుగులు చేసిన ఈ లెజెండ్.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ మరియు మహేంద్ర సింగ్ ధోనీల సరసన చేరాడు.

జూన్ 2007లో ఐర్లాండ్‌పై రోహిత్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి అతను 48 టెస్టులు (ప్రస్తుతం అహ్మదాబాద్ టెస్ట్ ఆడుతున్నాడు), 241 ODIలు మరియు 148 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు, అందులో అతను వరుసగా 3,348, 9,782 మరియు 3,853 పరుగులు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్.

కాగా.. అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ డ్రా అయింది. టెస్టు మ్యాచ్‌లో చివరి రోజు ఆస్ట్రేలియా 2 వికెట్లకు 175 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత భారత జట్టు బ్యాటింగ్‌కు దిగలేదు. అంతకుముందు భారత్..  తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. కాగా కంగారూ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటైంది. ఐదో రోజు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఎలాంటి అవకాశాలను తీసుకోకుండా రోజంతా భారత బౌలర్లను సురక్షితంగా ఆడారు. ఇక మ్యాచ్ గెలిచే అవకాశం లేకపోవడంతో..  ఇద్దరు కెప్టెన్లు  డ్రాకు అంగీకరించారు. దీంతో భారత్ ఈ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో చాలా ఏళ్లుగా జరుగుతున్న చివరి మ్యాచ్ ఇదే. ఇప్పుడు దీని తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిర్వహించబడదు. రానున్న కాలంలో యాషెస్ సిరీస్ తరహాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనుంది. 

1996లో తొలిసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ మొదటిసారిగా 1996లో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఇది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలన్ బోర్డర్ మరియు భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఆడబడింది. దాదాపు 27 ఏళ్లుగా ఈ పేరుతో ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ నిర్వహించారు. రెండు దేశాల మధ్య బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 16 సార్లు జరిగింది. ఈ సమయంలో భారత్ 10 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా 2003-4 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య జరిగిన సిరీస్ డ్రాగా ముగిసింది.