గిల్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిన్న చెపాక్ లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర వరల్డ్ కప్ పోరు సాగింది. ఈ పోరులో ఇండియా గెలిచి వరల్డ్ కప్ జర్నీని ఘనంగా మొదలు పెట్టింది. ఒకానొక దశలో ఇండియా గెలుస్తుందా? అని అనుమానపడిన ప్రేక్షకులకు రాహుల్, కోహ్లీ అదిరిపోయే థ్రిల్ అందించారు. వారు ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా గేమ్ ను గెలిపించారు. ఆస్ట్రేలియా చేతిలో ఉన్న గేమ్ ను మన చేతిలోకి తీసుకుని విజయతీరాలకు చేర్చారు. రాహుల్ తృటిలో సెంచరీని కోల్పోయినా కానీ […]

Share:

నిన్న చెపాక్ లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర వరల్డ్ కప్ పోరు సాగింది. ఈ పోరులో ఇండియా గెలిచి వరల్డ్ కప్ జర్నీని ఘనంగా మొదలు పెట్టింది. ఒకానొక దశలో ఇండియా గెలుస్తుందా? అని అనుమానపడిన ప్రేక్షకులకు రాహుల్, కోహ్లీ అదిరిపోయే థ్రిల్ అందించారు. వారు ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా గేమ్ ను గెలిపించారు. ఆస్ట్రేలియా చేతిలో ఉన్న గేమ్ ను మన చేతిలోకి తీసుకుని విజయతీరాలకు చేర్చారు. రాహుల్ తృటిలో సెంచరీని కోల్పోయినా కానీ మ్యాచ్ ను చివరి వరకూ ఉండి ఫినిష్ చేశాడు. రాహుల్ మ్యాచ్ మొత్తం ఆడింది ఒక ఎత్తు.. మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టింది ఒక ఎత్తు అన్నట్లు మారిపోయింది. అతడు విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత హావభావాలు చూసి అందరూ ఫుల్ ఖుష్ అయ్యారు. ఒకానొక సమయంలో అనవసరంగా చాన్స్ లు ఇస్తున్నారని అన్నవారే నేడు రాహుల్ ను కీర్తిస్తున్నారు. అదలా ఉంటే ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్‌ బరిలోకి దిగలేదు. అతడు జ్వరం వల్లే ఆడడం లేదని కెప్టెన్ శర్మ కూడా తెలిపాడు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు చాన్స్ ఇచ్చారు. కానీ ఆ చాన్స్ ను ఇషాన్ సరిగ్గా వాడుకోలేదు. పరుగులేమీ చేయకుండానే స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యి తీవ్రంగా నిరాశపర్చాడు. 

ఉదయం వరకు వేచి చూశాం కానీ.. 

ఓపెనర్ గిల్‌ ఆడకపోవడంపై కెప్టెన్ రోహిత్ స్పందించాడు. అతడి కోసం ఉదయం వరకు వేచి చూశామని తెలిపాడు. అతడు కోలుకుంటాడని మేనేజ్ మెంట్ మొత్తం ఆశతో ఎదురుచూసిందని కానీ అతడు కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. ఇక మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన కమిన్స్ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 25 ఏళ్ల యువ ఓపెనర్ గిల్ డెంగీ బారిన పడ్డాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గిల్‌ ఆరోగ్యం మీద అనేక వార్తలు వచ్చినప్పటికీ అతడు మ్యాచ్ సమయం వరకు ఫిట్ అవుతాడని అంతా భావించారు. ఆస్ర్టేలియాతో తొలి పోరుకు అందుబాటులో ఉంటాడని అనుకున్నారు. టీం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇవే సంకేతాలిచ్చాడు. అతడు మీడియాతో మాట్లాడుతూ… గిల్ మెరుగవుతున్నాడని, అతను ఇంకా ఔట్  కాలేదని (జట్టులో స్థానం గురించి) పేర్కొన్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా గిల్ మొదటి మ్యాచ్ ఆడతాడని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ టాస్ పడిన తర్వాత రోహిత్ ప్రకటనతో అందరు అభిమానులు ఊసురుమన్నారు. దానికి తగ్గట్టుగానే అతడి స్థానంలో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరడంతో అరే గిల్‌ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదే అని అంతా అనుకున్నారు. వన్డేల్లో ఓపెనర్‌ గా గిల్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 

అశ్విన్ 11 సంవత్సరాల తర్వాత… 

ఇక టీమిండియా ఫ్యాన్స్ కు మరో కిక్కిచ్చే విషయం ఏమిటంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి మ్యాచ్ ఆడడం. చెన్నైలోని చెపాక్ స్టేడియం స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని అంతా అంటారు. అందుకోసమే ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని ముందుగానే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రోహిత్ శర్మ ముగ్గురు స్పిన్నర్లతో కూడిన జట్టును ప్రకటించాడు. అక్షర్ పటేల్ గైర్హాజరీలో జట్టులో స్థానం సంపాధించిన అశ్విన్ మొదటి మ్యాచ్ ఆడాడు. అంతే కాదు అతడు 11 సంవత్సరాల తర్వాత తన సొంత మైదానం చెపాక్‌లో తన మొదటి వన్డేను ఆడాడు. చెన్నైలో అశ్విన్‌ కి ఇది రెండో ప్రపంచ కప్ మ్యాచ్. అతడు 2011 వరల్డ్ కప్ లో  విండీస్ తో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో అతడు 2/41 గణాంకాలు నమోదు చేశాడు. చెపాక్‌ పిచ్ లో అశ్విన్ కు అంత మంచి రికార్డేం లేదు. అతడు ఇక్కడ ఆడిన 3 వన్డేల్లో కలిపి కేవలం 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ గణాంకాలు అంతగా ఇంప్రెస్ చేయకపోయినా కానీ పాత అశ్విన్ కు ఇప్పటి అశ్విన్ కు అనేక మార్పులున్నాయి. అంతే కాకుండా అతడు 11 సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో ఆడడంతో ఫ్యాన్స్ అశ్విన్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బౌలింగ్ లో సర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో కంగారూల నడ్డి విరిస్తే బ్యాటింగ్ లో కోహ్లీ, రాహుల్ ఆసీస్ కు విజయాన్ని దూరం చేశారు. ఈ విజయంతో టైటిల్ ఫేవరేట్ టీమిండియా తన వరల్డ్ కప్ జర్నీని ఘనంగా ఆరంభించింది. విజయాన్ని నమోదు చేసి తర్వాతి మ్యాచ్ కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం అవుతోంది.