ఇషాన్ కిషన్ ప్లేస్ లో రాహుల్.. వద్దు అంటున్న గవాస్కర్

రాహుల్ కు ఐపీఎల్‌లో తొడకు గాయమైనట్టు అందరికీ తెలిసిందే. అయితే తాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ, ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో సూపర్ 4 ఎన్‌కౌంటర్‌కు ముందు, భారత జట్టుతో కలిసి శ్రీలంకకు బయలుదేరాడు. అయితే ఇప్పుడు వచ్చేనెల జరగబోయే వరల్డ్ కప్ టీంలో మరొకసారి రాహుల్ అడుగుపెట్టే అవకాశం ఉంది కాబట్టి. ఏ ఆటగాడి బదులు రాహుల్ ఆడతాడు అనే దానిమీద, ప్రస్తుతం చర్చి నడుస్తోంది. […]

Share:

రాహుల్ కు ఐపీఎల్‌లో తొడకు గాయమైనట్టు అందరికీ తెలిసిందే. అయితే తాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ, ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో సూపర్ 4 ఎన్‌కౌంటర్‌కు ముందు, భారత జట్టుతో కలిసి శ్రీలంకకు బయలుదేరాడు. అయితే ఇప్పుడు వచ్చేనెల జరగబోయే వరల్డ్ కప్ టీంలో మరొకసారి రాహుల్ అడుగుపెట్టే అవకాశం ఉంది కాబట్టి. ఏ ఆటగాడి బదులు రాహుల్ ఆడతాడు అనే దానిమీద, ప్రస్తుతం చర్చి నడుస్తోంది. అయితే నివేదికలో పేర్కొన్న విధంగా, తాను ఇషాన్ కిషన్ ప్లేస్ లో ఆడే అవకాశం ఉంది అంటున్నారు.

బహుశా తన బదులు ఆడితే బాగుంటుంది అంటున్న గవస్కర్: 

ఇటీవల జరిగిన సెలక్షన్స్ లో, జట్టులో రాహుల్‌తో, సంజు శాంసన్ తప్పుకున్నాడు; తిలక్ వర్మ, ప్రముఖ్ కృష్ణలను మినహాయించారు. ODI ప్రపంచ కప్‌లో రాహుల్ భారత జట్టులో తనదైన శైలిలో ముఖ్య పాత్ర పోషించాలని భావిస్తున్నందున, జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇది చాలా ముఖ్యం. అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అతను జట్టులో ఏ ఆటగాడిని భర్తీ చేస్తాడు? ఇషాన్ కిషన్ పేరు వినిపిస్తోంది. కాకపోతే ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ముఖ్యంగా పాకిస్తాన్‌పై అద్భుతమైన ఆట తీరును చూపించిన ఇషాన్ కిషన్ ప్లేస్ లో, రాహుల్ జట్టులోకి రావడం అన్యాయమని, దిగ్గజ భారత ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 

గవాస్కర్, కిషన్, ఎడమచేతి ఆట శైలికి ఒక పెద్ద అభిమాని అని చెప్పుకోవాలి, ఇది భారతదేశ బ్యాటింగ్ టాప్ ఆర్డర్‌కు వైవిధ్యాన్ని జోడిస్తుందని గవాస్కర్ మరోసారి అభిప్రాయపడ్డారు. 

అయితే మరోపక్క, శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా వినిపిస్తోంది. నేపాల్‌తో జరగనున్న లిట్మస్ టెస్ట్‌లో అయ్యర్ ఎలా రాణిస్తాడో, ఒకసారి గవాస్కర్ పరిశీలించాలనుకుంటునట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో అయ్యర్ ఔట్ చేయకపోతే, బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సిన అవసరం ఉంటుందని గవాస్కర్ భావిస్తున్నాడు. ఇదంతా దృష్టలో పెట్టుకొని, రాహుల్ మరియు కిషన్ నాలుగు మరియు ఐదవ స్లాట్‌లలో ఆడితే బాగుంటుందని మరొకసారి గుర్తు చేశారు గవాస్కర్

తిలక్ వర్మ వరల్డ్ కప్ ఎంట్రీ గురించి ప్రస్తావన: 

హైదరాబాద్ కుర్రోడు, యువ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. తనదైన శైలిలో తిలక్ వర్మ ప్రతిభను ఘనపరచాడని చెప్పాలి. ముందు జరిగిన రెండు సిరీస్ మ్యాచ్లలో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి గురైన టీం రేటును పెంచేందుకు కృషి చేశాడు తిలక్ వర్మ. ప్రస్తుతం జరిగిన T20I మ్యాచ్లలో కూడా అతని స్కోర్ బోర్డు 39, 51, 49 నాట్ అవుట్ గా స్కోర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు తిలక్ వర్మ. ఇప్పుడు తాను సాధించిన విజయాలకు ప్రతిఫలంగా ఏషియా కప్ ఆటలో చోటు దక్కించుకుని తనదైన ఆట తీరు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. 

మరోపక్క, 1983 వరల్డ్ కప్ భారతదేశానికి దక్కేలా చేసిన క్రిస్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ Cheeky Cheeka ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన క్రికెటర్ తిలక్ వర్మ ముందు ఆడిన సీరియస్ లో బాగా ఘనపరిచినప్పటికీ, ఇంత పెద్ద వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంటులలో అప్పుడే అవకాశం ఇవ్వకపోవడం మంచిది అని శ్రీకాంత్ తన భావనను వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా వరల్డ్ కప్ ఆటగాళ్లలో తిలక్ వర్మ పేరు చూసిన తర్వాత ఒకింత సంతోషం వ్యక్తపరచినప్పటికీ, తన గొప్ప ఆటగాడు కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చింది అంటూ తను భావించినప్పటి,కీ వరల్డ్ కప్ ఆడే ముందు తను కచ్చితంగా వండే సిరీస్ లో పాల్గొనడం మంచిదని క్రిస్ శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.