India Pakistan Match: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్.. ఆటలోనే కాదు వీక్షణలోనూ ఆల్‌టైమ్ రికార్డులు!

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌లో పీక్ టైమ్‌లో అత్యధికంగా 3.5 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారు. దీంతో ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా నమోదైన రికార్డు బద్ధలైంది. (India Pakistan Match) భారతదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్  (World Cup) అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లనైతే అభిమానులు కన్నార్పకుండా చూస్తున్నారు. వేలాది మంది స్టేడియంలో, కోట్లాది మంది టీవీల్లో, ఇంకెంతో మంది ఓటీటీ వేదికల్లో మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. మునుపెన్నడూ చూడనంత మంది చూస్తున్నారు. […]

Share:

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌లో పీక్ టైమ్‌లో అత్యధికంగా 3.5 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారు. దీంతో ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా నమోదైన రికార్డు బద్ధలైంది. (India Pakistan Match)

భారతదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్  (World Cup) అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లనైతే అభిమానులు కన్నార్పకుండా చూస్తున్నారు. వేలాది మంది స్టేడియంలో, కోట్లాది మంది టీవీల్లో, ఇంకెంతో మంది ఓటీటీ వేదికల్లో మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. మునుపెన్నడూ చూడనంత మంది చూస్తున్నారు. ఆటగాళ్లు పరుగులతో రికార్డులు సృష్టిస్తుంటే.. ప్రేక్షకులు వీక్షణలతో రికార్డులు సృష్టిస్తున్నారు.

క్రికెట్ అంటే ఇంకెక్కడైనా క్రీడ కావచ్చు కానీ.. భారతదేశంలో మాత్రం ఓ మతం. అంతలా అభిమానిస్తారు ఆటను. తమ అభిమాన ఆటగాళ్లను దేవుళ్లలా చూస్తారు. టీమిండియా (Team India) ఆడుతున్న మ్యాచ్ అయితే టీవీలకు అతక్కపోతారు. అదే పాకిస్తాన్ మ్యాచ్‌ అంటే.. భావోద్వేగాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఒక్క బంతిని కూడా మిస్ కాకుండా చూస్తారు. అలా మొన్న జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ (India Pakistan Match)

ను రికార్డు స్థాయిలో వీక్షించారు ప్రేక్షకులు గత రికార్డులను బద్ధలు కొట్టారు. ఒక్క డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌లోనే ఏకంగా 3.5 కోట్ల మంది వీక్షించారు. ఇక టీవీలు, ఇతర ఓటీటీ వేదికల్లో చూసిన వాళ్లు అదనం. ‘‘పీట్‌ టైమ్‌లో ఇంత మంది చూడటం అన్ని ఫార్మాట్లలోనూ ఇదే తొలిసారి. డిజిటిల్ స్పోర్ట్స్‌ వ్యూయర్‌‌షిప్ ప్లాట్‌ఫామ్‌కు ఇదో గొప్ప సందర్భం” అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. 

గతంలో 3.2 కోట్లు

కొన్ని నెలల కిందట ముగిసిన ఐపీఎల్‌లో నమోదైన రికార్డును తాజాగా ఇండియా, పాక్ మ్యాచ్‌ తిరగరాసింది. ఐపీఎల్ 2023 (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ను ఏకంగా 3.2 కోట్ల మంది హాట్‌స్టార్‌‌లో చూశారు. ఈ సారి దాయాదితో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను చూసేందుకు జనం పోటీ పడ్డారు. ఏకంగా 3.5 కోట్ల మంది వీక్షించారు. అంటే గత రికార్డుతో పోలిస్తే 30 లక్షల మంది ఎక్కువగా చూశారన్నమాట. ‘‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఆటను ప్రేమించినందు వల్లే గత రికార్డులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రేక్ చేయగలిగింది. 3.5 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు” అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇండియా హెడ్ సజిత్ శివనందన్ చెప్పారు. 

వార్ వన్ సైడ్.. 

గత శనివారం జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. తొలుత టాస్‌ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రారంభంలో బాగానే ఆడిన పాక్ బ్యాటర్లు తర్వాత చేతులెత్తేశారు. తొలి నలుగురు బ్యాటర్లు 150 వరకు పరుగులు చేయగా.. తర్వాత వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో 155–2గా ఉన్న పాక్ స్కోరు.. 191కి ఆలౌట్‌ అయింది. మన బౌలర్లలో ఐదుగురు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. బూమ్రా, కుల్దీప్, సిరాజ్, పాండ్యా.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా.. పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ ఝులిపించాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఉన్న రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటిదాకా పాక్‌పై ప్రపంచకప్‌లో 8 సార్లు ఇండియా గెలిచింది. ఒక్కసారి కూడా పాక్ గెలవలేదు. ఇక ఈ మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టీమిండియా తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 17న జరగనుంది. బంగ్లాదేశ్‌తో రోహిత్ టీమ్ తలపడనుంది.