భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డేకు బుమ్రా దూరం

 భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డేకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. తన కుటుంబుబాన్ని కలవడానికి అతను వెళ్లిపోవడంతో ఈ మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో ప్రసిద్ధ్‌ను తీసుకున్నామని చెప్పింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. ఇండోర్‌‌లోని హోల్కర్‌‌ స్టేడియంలో జరిగే మ్యాచ్లో టాస్‌ వేయడానికి కొద్ది నిమిషాల మందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఈ మేరకు ప్రకటించింది. […]

Share:

 భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డేకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. తన కుటుంబుబాన్ని కలవడానికి అతను వెళ్లిపోవడంతో ఈ మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో ప్రసిద్ధ్‌ను తీసుకున్నామని చెప్పింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. ఇండోర్‌‌లోని హోల్కర్‌‌ స్టేడియంలో జరిగే మ్యాచ్లో టాస్‌ వేయడానికి కొద్ది నిమిషాల మందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఈ మేరకు ప్రకటించింది. ఈ ప్రకటన విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుంచి బుమ్రా.. తన ఫామ్‌ను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. వివిధ దశల్లో బుమ్రా బాగా రాణిస్తున్నప్పటికీ, అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదోనని పలువురు అనుకుంటున్నారు. వన్డే ప్రపంచ కప్‌ కోసం భారత జట్టు ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. మరోవైపు, ఈ సమయంలో బుమ్రాను పక్కనబెట్టడం కొంత ఆందోళన కలిగించే విషయం.  

కానీ, ఆస్ట్రేలియాతో జరగిన తొలి వన్డేలో భారత్‌ అద్భుతంగా గెలిచిన తర్వాత కూడా బుమ్రా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, గాయం కారణంగా అతను రెండో వన్డేకు దూరంగా కాలేదని, బుమ్రా తన ఫ్యామిలీని కలవాల్సి ఉన్నందున ఇండోర్‌ మ్యాచ్‌కు దూరం అయ్యాడని బీసీసీఐ ధ్రువీకరించింది. మూడో వడ్డేకు బుమ్రా కచ్చితంగా తిరిగి వస్తాడని బోర్డు తెలిపింది. 

కాగా, ‘‘జస్ర్పీత్ బుమ్రా తన ఫ్యామిలీని కలవడానికి వెళ్లాడు. అందుకే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేకు విరామం ఇచ్చాం. బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ముఖేశ్ కుమార్ను తీసుకున్నాం. రాజ్‌కోట్‌లో జరిగే ఆఖరి వన్డేలో బుమ్రా జట్టులోకి వస్తాడు” అని రెండో వన్డే టాస్‌కు ముందు బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు ఎలెవన్లో కృష్ణ ప్లేయింగ్‌ చోటు దక్కించుకున్నాడు. 

ఆస్ట్రేలియా బౌలింగ్..

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. ముందుగా బౌలింగ్‌ను ఎంచుకున్నాడు ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌. ‘‘మేము బౌలింగ్‌ చేస్తాం. ఎందుకంటే వెదర్‌ కొంచెం వెచ్చగా ఉంది. ఇది మంచి వికెట్‌ అవుతుందని భావిస్తున్నాం. ఫాన్సీ ఛేజింగ్‌గా ఉంది. మంచు పడితే, మాకు ఛేసింగ్‌లో సహాయం చేస్తుంది. కచ్చితంగా ఈ మ్యాచ్‌ మేము గెలవాలనుకుంటున్నాం. కానీ మేము కూడా విభిన్న కలయికలను ప్రయత్నించాలనుకుంటున్నాం. అందులో భాగంగానే కొన్ని మార్పులు వచ్చాయి” లని స్టీవ్ స్మిత్ తెలిపాడు. 

బౌలింగ్ చేయాలనుకుంటున్నాం..

భారత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ, ‘‘టాస్ గెలిస్తే ఈ సీరిస్‌లో బౌలింగ్‌ను చేయాలని అనుకున్నాం. గ్రౌండ్ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని, మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్. అందుకే పరుగులు తీయడం అనేది సవాలుగా ఉంటుంది. చివరి గేమ్‌లో మాకు ఒకే ఒక మార్పు ఉంది. రెండో వన్డేకు బుమ్రా రెస్ట్‌ తీసుకుంటున్నాడు. అతని స్థానంలో ప్రసిద్ధ్‌ వచ్చాడు” అని రాహుల్ టాస్‌ సమయంలో చెప్పాడు. 

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌‌, మాథ్యూ షార్ట్, స్టీవెన్‌ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వైస్ కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్, స్పెన్సర్ జాన్సన్

ఇండియా జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వైస్ కెప్టెన్), ఇషాన్ 

కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ