వాళ్లిద్దరూ ఉంటే 18వ ఓవర్లోనే మ్యాచ్ ముగిసేది: ధోనీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 226 పరుగుల భారీ స్కోరు చేసింది. అయినప్పటికీ కేవలం ఎనిమిది పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది.  దీంతో రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరహో అనిపించింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ 62 పరుగులు చేయగా, మాక్స్‌వెల్ ఏకంగా 76 పరుగులు చేశారు. దీంతో వీరు దూకుడుగా ఆడుతున్న సమయంలో ఒక దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతుందనుకున్నారు  చెన్నై అభిమానులు. అయితే కీలక […]

Share:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 226 పరుగుల భారీ స్కోరు చేసింది. అయినప్పటికీ కేవలం ఎనిమిది పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది.  దీంతో రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరహో అనిపించింది.

ఫాఫ్‌ డుప్లెసిస్‌ 62 పరుగులు చేయగా, మాక్స్‌వెల్ ఏకంగా 76 పరుగులు చేశారు. దీంతో వీరు దూకుడుగా ఆడుతున్న సమయంలో ఒక దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతుందనుకున్నారు  చెన్నై అభిమానులు. అయితే కీలక సమయంలో విజృంభించిన చెన్నై బౌలర్లు.. వారి వికెట్లను పడగొట్టారు. దీంతో  రేసులోకి వచ్చిన చెన్నై.. విజయం సాధించింది. చిన్న స్వామి స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ లు ఇద్దరు కలిసి 12 సిక్సర్లు, 8 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపించారు. 

దీంతో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని ఇదే విషయం గురించి మాట్లాడాడు. వీరిద్దరూ ఇంకాసేపు క్రీజ్‌లో ఉండి ఉంటే, మ్యాచ్‌ను 2 ఓవర్లు మిగిలి ఉండగానే ముగించేవారని ధోనీ పేర్కొన్నాడు. అయితే, తమ బౌలర్లు సరైన సమయంలో పుంజుకొని డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారని  రాణించారని అభినందించాడు. 16 ఓవర్ల నుండి 20 ఓవర్ల మధ్య బౌలింగ్‌ చేయాలంటే యువ బౌలర్లకు పెద్ద సవాలేనని వ్యాఖ్యానించాడు.

‘‘డెత్‌ (చివరి) ఓవర్లలో బౌలింగ్‌ చేయాలంటే కుర్రాళ్లకు పెద్ద సవాల్‌తో కూడుకున్నదే అనేది నా అభిప్రాయం. వారు ఆ సమయంలో ఎంతో కష్టపడ్డారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో మార్గదర్శకంలో బాగా రాణిస్తున్నారు.

మా యువ బౌలర్లకు బ్రేవో బాగా దిశానిర్దేశం చేస్తున్నాడు. వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. మెయిన్ కోచ్‌, బౌలింగ్‌ కోచ్, సీనియర్ ఆటగాళ్లు కూడా వారికి ఏంతో బాసటగా నిలవాలని అన్నాడు. 

ఇక యువ బ్యాటర్ శివమ్‌ దూబే బాగా హిట్టింగ్‌ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్పిన్‌ బౌలింగ్‌లో బాగా దూకుడుగా ఆడుతాడు ఆడేస్తాడు అని ప్రశంసించాడు. అయితే, ఫాస్ట్‌ బౌలర్లతో మాత్రం ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. ఆ ఇబ్బందిని అధిగమిస్తే తప్పకుండా కీలక ఆటగాడిగా మారతాడని ధోని సూచించాడు. దూబే, డేవన్‌ కాన్వే ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లతో రాయల్ ఛాలెంజర్స్ ముందు భారీ స్కోరు ఉంచగలిగాం. కానీ, ధాటిగా ఆడిన మాక్స్‌వెల్‌, ఫాఫ్ డుప్లెసిస్ మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చేశారని అన్నారు. ఒకవేళ వీరిద్దరూ ఇలానే కొనసాగి ఉంటే ఈ మ్యాచ్‌ను కేవలం 18 ఓవర్‌లలోనే ముగించేవారు. వికెట్ల వెనకాల ఉండి వారి ఆటను గమనిస్తూనే ఉన్నానన్న ధోని.. అందుకే, మ్యాచ్ ఫలితం కన్నా వారిని అవుట్ చెయ్యడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సి వచ్చిందని తెలిపాడు. చివరికి నేను అనుకున్నట్టు ఫలితం మాకు అనుకూలంగా రావడం అంతొషంగా ఉంది’’ అని ధోనీ తెలిపాడు. 

మేం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు సరైన పద్ధతిలోనే ఆడామని ఆర్‌సీబీ సారథి డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. కానీ, చివరి 5 ఓవర్లలో కాస్త ఇబ్బంది పడ్డాం. అయితే దినేశ్‌ కార్తిక్‌ మాత్రం ఫినిషింగ్‌ చేస్తాడని మేం భావించాం. అతడూ కూడా అదే దూకుడు ప్రయత్నించాడు. కానీ, చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మాకు గెలుపు సాధ్యపడలేదని అన్నాడు. కాగా.. చెన్నైను మేము 200 పరుగులకే కట్టడి చేసి ఉండాల్సింది. అప్పుడు మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉండేది’’ అని రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.