రవీంద్ర జడేజా సాధించిన అరుదైన రికార్డ్ 

అక్టోబర్ 8 ఆదివారం చెన్నైలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా పతనానికి తన వైపు నుంచి సహాయం చేశాడు. మొత్తం 10 ఓవర్లలో 28 పరుగులు తీయగా, మరోవైపు ఆస్ట్రేలియా మూడు వికెట్లు తీసి తనదైన ఆట ప్రదర్శించాడు. ఇప్పుడు మరొక ఘనత సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు.  హరి భజన్ సింగ్ తర్వాత జడేజా:  ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం అక్టోబర్ 8 జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో జడేజా […]

Share:

అక్టోబర్ 8 ఆదివారం చెన్నైలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా పతనానికి తన వైపు నుంచి సహాయం చేశాడు. మొత్తం 10 ఓవర్లలో 28 పరుగులు తీయగా, మరోవైపు ఆస్ట్రేలియా మూడు వికెట్లు తీసి తనదైన ఆట ప్రదర్శించాడు. ఇప్పుడు మరొక ఘనత సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. 

హరి భజన్ సింగ్ తర్వాత జడేజా: 

ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం అక్టోబర్ 8 జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో జడేజా తన ఆట తీరని మరొకసారి చూపించడం జరిగింది. తన మాయాజాలాన్ని ప్రదర్శించి తన క్రికెట్ టీంమేట్స్ కి సహకారిగా నిలిచాడు జడేజా. ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించి కీలకమైన వికెట్లు తీసి సత్తా చాటాడు జడేజా. జడేజా చెన్నయ్‌లోని పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు, ఎందుకంటే అతను బంతితో మెస్మరైస్ చేసి దుమ్ము దులిపేస్తుంది. జడేజా ప్రయత్నంలో భాగంగా పెద్ద వికెట్ అయినా మర్నస్ లాబుస్‌చాగ్నే టికెట్ పడగొట్టి ఆస్ట్రేలియా పతనానికి కారణమయ్యాడు. అలెక్స్ కారీని ఎల్‌బీడబ్ల్యూని మిడిల్ ఓవర్లలోనే ఎటువంటి పరుగులు తీయకుండా, జడేజా తన ఆటతీరుతో పంపించేయడంతో ఆస్ట్రేలియా తడబడింది. 3 వికెట్లతో, ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ క్రికెట్‌లో 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన క్రీడా చరిత్రలో, జడేజా 3వ బౌలర్‌గా నిలిచాడు. 

హర్భజన్ సింగ్ – 37 మ్యాచ్‌ల్లో 105. 7 5 వికెట్లు

రవీంద్ర జడేజా – 40 మ్యాచ్‌ల్లో 102. 5 వికెట్లు

2011 ఛాంపియన్లు మిగతా జట్లకు హెచ్చరిక నోటీసు పంపడంతో భారత్ స్పిన్నర్లు ఫైర్ అయ్యారు. బౌలర్లలో జడేజా ఎంపిక కాగా, కుల్దీప్ యాదవ్ మరియు ఆర్ అశ్విన్ 3 వికెట్లతో పార్టీలో చేరారు. కుల్దీప్ గ్లెన్ మాక్స్‌వెల్  కీలక వికెట్‌ పడగొట్టాడు, ఈ లిస్టులో నెక్స్ట్, మిచెల్ మార్ష్‌ వికెట్ తీసి జస్ప్రీత్ బుమ్రా కూడా చోటు సంపాదించుకున్నాడు. 

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ విశేషాలు: 

2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడంలో విరాట్ కోహ్లీ మరియు కెఎల్ రాహుల్ ప్రత్యేకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా వంటి భారత బౌలర్లు, ఆస్ట్రేలియాను 199 పరుగులకే వెనుతిరిగేలా చేశారు.

అక్టోబర్ 8, ఆదివారం చెన్నైలో జరిగిన, 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో వారి ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌కు సంచలన విజయాన్ని అందించారు..విరాట్ కోహ్లీ మరియు KL రాహుల్. కెఎల్ రాహుల్ 97, విరాట్ కోహ్లీ 85 పరుగులు చేయడంతో భారత్ 41.2 ఓవర్లలో 200 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. 

200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 2 వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ డెంగ్యూ కారణంగా ఆట ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఆస్ట్రేలియన్ పేసర్లతో తమదైన శైలిలో ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం భారతదేశంపై నాలుగు వికెట్లు తీసిన గ్లెన్ మాక్స్‌వెల్‌పై కూడా జాగ్రత్త వహించారు. కొన్ని విచిత్రమైన కారణాల వల్ల, పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా తరఫున ఏకైక లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను మ్యాచ్లో ఆలస్యంగా  పంపించినట్లు కనిపించింది. 18వ ఓవర్‌లో జంపా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు, కోహ్లీ, రాహుల్ తమ అత్యుత్తమ ఆట తీరుని చాలా బాగా ప్రదర్శించారు. తక్కువ ఓవర్ లోనే ఇద్దరు అర్థసంచరీలు చేసి అదరగొట్టారు. చివరి దశలో హార్దిక్ పాండ్యా మరియు మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసి ఆస్ట్రేలియాను 199 పరుగులకు ఆలౌట్ చేశారు, ఇది ప్రపంచ కప్ చరిత్రలో భారతదేశంతో ఆడి ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండవ అత్యల్ప స్కోరు. ఇలాగే భారత్ తన ఆట తీరును కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు.