ధోని పుట్టినరోజు సందర్భంగా రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్

క్రికెట్ రంగం లో దిగ్గజ స్థానం లో ఉన్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని నిన్నటితో 42 వ ఏటలోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. దేశం మొత్తం గర్వించే విధంగా మూడు సార్లు ప్రపంచ కప్ ని అందుకొని మన ఇండియన్ క్రికెట్ టీం కి మునుపెన్నడూ లేని వన్నె తెచ్చాడు ధోని. ఎలాంటి కష్టతరమైన సందర్భం వచ్చినా కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ప్రత్యర్థులను తన ఎత్తులతో కూల్ గా ఎలా ఎదురుకోవాలి […]

Share:

క్రికెట్ రంగం లో దిగ్గజ స్థానం లో ఉన్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని నిన్నటితో 42 వ ఏటలోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. దేశం మొత్తం గర్వించే విధంగా మూడు సార్లు ప్రపంచ కప్ ని అందుకొని మన ఇండియన్ క్రికెట్ టీం కి మునుపెన్నడూ లేని వన్నె తెచ్చాడు ధోని. ఎలాంటి కష్టతరమైన సందర్భం వచ్చినా కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ప్రత్యర్థులను తన ఎత్తులతో కూల్ గా ఎలా ఎదురుకోవాలి అనేది ఈయనని చూసి నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ మినహా క్రికెట్ లోనే అన్నీ ఫార్మట్స్ కి గుడ్ బాయ్ చెప్పేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఇండియన్ టీం లో లేని లోటు స్పష్టం గా కనిపిస్తుంది. మరొక్కసారి ఆయన  టీం లోకి వచ్చి జట్టుకి సారథ్యం వహిస్తే చూడాలని కోట్లాది మంది అభిమానులతో పాటు ఇండియన్ క్రికెట్ టీం కూడా కోరుకుంటుంది, కానీ అది అసాధ్యం అనే విషయం అందరికీ తెలిసిందే.

విన్నింగ్ షాట్ తో ఐపీఎల్ ట్రోఫీ :

ఇక రీసెంట్ గానే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ టోర్నమెంట్ లో తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వచించి 5 వ సారి తన టీం కి కప్పు గెలిపించి ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా క్రికెట్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ధోని కి ప్రియా శిష్యుడిగా కొనసాగుతూ వచ్చాడు మన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ బాండ్ ఏ ఇద్దరి క్రికెటర్స్ మధ్యలో కూడా ఉండదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. జడేజా మీద ధోని కి ఉన్నంత నమ్మకం ఎవరి మీద ఉండదు. చెన్నై సూపర్ కింగ్స్ లో మొట్టమొదట రెటైన్ చేసుకునే ఛాయస్ ని ధోని కి యాజమాన్యం కలిపించినా, ధోని మాత్రం ఆ స్థానాన్ని జడేజా కి ఇవ్వాల్సిందిగా జట్టు యాజమాన్యం ని కోరాడు. అంతే కాకుండా ఒక సీజన్ లో తన కెప్టెన్సీ ని వదులుకొని జడేజా కి ఇచ్చాడు. కానీ కెప్టెన్సీ లో అనుభవం లేని జడేజా కారణం గా 2021 వ సంవత్సరం లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. దీనితో మళ్ళీ ధోని కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.

2009 నుండి నాకు అన్నీ ఆయనే :

ఇక ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో లాస్ట్ లో ఒక బౌండరీని కొట్టి టీం ని గెలిపించి కప్పు గెలుచుకునేలా చేసాడు రవీంద్ర జడేజా. ఈ సన్బర్భాన్ని గుర్తు చేసుకుంటేనే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇక గ్రౌండ్ నుండి విజయోత్సాహం తో రాగానే జడేజా ని పైకి ఎత్తుకొని ధోని ఎమోషనల్ అయిన సందర్భాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇది ఇలా ఉండగా నిన్న ధోని పుట్టిన రోజు సందర్భం గా , జడేజా వేసిన ఒక ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘2009 వ సంవత్సరం నుండి నేటి వరకు నాకు ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి సమస్య ఎదురైనా నేను ధోని దగ్గరకి వెళ్తాను, ఆయన సలహాలు తీసుకుంటాను. ఈ సందర్భంగా మహీ భాయ్ కి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. త్వరలోనే మరో యెల్లో జెర్సీ లో కనిపించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.