గంభీర్​పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

వరల్డ్‌ కప్‌ సన్నాహకాల్లో టీమ్‌ఇండియా బిజీగా ఉంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గంభీర్ అద్భుతమైన టీమ్ మేన్ అని, దురదృష్టవశాత్తూ అందరికంటే ఎక్కువగా అపార్థం చేసుకున్న ఆటగాడు కూడా గౌతం గంభీరేనన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అశ్విన్ గంభీర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ‘నాకు తెలిసి టీమిండియా క్రికెటర్లందరిలో గంభీరే […]

Share:

వరల్డ్‌ కప్‌ సన్నాహకాల్లో టీమ్‌ఇండియా బిజీగా ఉంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గంభీర్ అద్భుతమైన టీమ్ మేన్ అని, దురదృష్టవశాత్తూ అందరికంటే ఎక్కువగా అపార్థం చేసుకున్న ఆటగాడు కూడా గౌతం గంభీరేనన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అశ్విన్ గంభీర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ‘నాకు తెలిసి టీమిండియా క్రికెటర్లందరిలో గంభీరే ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ ప్లేయర్. అయితే అందరి కంటే అపార్థానికి గురైన ఆటగాడు కూడా గంభీరే.

చాలామంది గంభీర్‌కి పొగరు ఎక్కువని, అందరితో గొడవ పడతాడని, కోపరి అనుకుంటారు. కానీ నిజానికి గంభీర్ చాలా మంచి మనిషి.. అతను టీమ్ మ్యాన్. టీమ్ కోసం ఏం చేయడానికైనా ముందుండే వ్యక్తి.  అలాగే ముక్కుసూటి మనిషి. ఏం చెప్పాలనుకున్నా, ముఖం మీదే చెప్పేస్తాడు. నిజానికి గంభీర్ చాలా రిజర్వు పర్సన్..అందరితో అన్నీ పంచుకోలేడు. అయితే మ్యాచ్‌ విషయానికి వస్తే ఫైటర్‌గా మారిపోతాడు. యుద్ధాన్ని కోరుకుంటాడు. గంభీర్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు. అంతే కాకుండా మ్యాచ్‌ని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు.

అలాంటి మ్యాచ్‌లలో 2011 ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్, టీమ్‌కి టర్నింగ్ పాయింట్. ఆ టోర్నీలో భారత్ ఫైనల్‌ దాకా వెళ్లడంలోనూ గంభీర్ పాత్ర చాలా ఉంది. ఫైనల్‌లో 2 కీలక వికెట్లు పడిన తర్వాత గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో అమూల్యమైనది.. విరాట్ కోహ్లీ, దిల్షాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాక గంభీర్ ప్రెషర్ తీసుకోలేదు. చూడచక్కని షాట్స్‌తో వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తాడు. అదే మ్యాచ్ ఫైనల్‌లో అతను 120-130 చేసి ఉంటే, ఇప్పుడు వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం అతనికే దక్కేది.

 జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌లో గంభీర్ 75 రన్స్ బాది టీమిండియాకి ఫైటింగ్‌ టోటల్ అందించాడు. సెంచరీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ గంభీర్, అలా ఆలోచించే మనిషి కాదు. తన వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ గురించి ఆలోచించాడు. జనాలు మాత్రం గంభీర్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. గౌతీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..

ఇదిలా ఉంటే గంభీర్ క్రికెట్ కెరీర్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అశ్విన్ కామెంట్స్ నిజమే అనిపిస్తుంది. 12 ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో భారత క్రికెట్‌పై గంభీర్ తనదైన ముద్ర వేశాడు. కెరీర్‌లో మొత్తం 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన గంభీర్ 4,154 రన్స్ చేశాడు. అలాగే 147 వన్‌డే మ్యాచ్‌ల్లో 5,238 రన్స్, 37 టీ20 మ్యాచ్‌ల్లో 932 రన్స్ చేశాడు. అయితే గంభీర్‌ కెరీర్లో కేవలం వ్యక్తిగత రికార్డులే కాదు ఎన్నో మ్యాచ్‌లలో టీమిండియాని ముందుండి నడిపించి విజయాలనందించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్‌ టోర్నీలో కూడా గంభీర్ తనదైన ముద్ర వేశాడు. గంభీర్ కెప్టెన్సీలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014 టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. అందుకే ఐపీఎల్‌లో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అండ్ ప్లేయర్స్ లిస్ట్‌లో గంభీర్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

ఇక, దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన అశ్విన్.. అనుకోకుండా వరల్డ్‌ కప్‌ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయపడటంతో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది.