ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్: ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమి..

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మూడోసారి మ్యాచ్ లోను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. గౌహతి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలింగ్ ఆ తరువాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ సునయాసంగా విజయకేతనం ఎగురవేసింది. మూడో మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది రెండోసారి గెలుపు కావడం విశేషం.. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. […]

Share:

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మూడోసారి మ్యాచ్ లోను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. గౌహతి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలింగ్ ఆ తరువాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ సునయాసంగా విజయకేతనం ఎగురవేసింది. మూడో మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది రెండోసారి గెలుపు కావడం విశేషం..

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ టీంలో ఓపెనర్లు యశస్వి జేశ్వాల్, జోస్ బట్లర్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. ఫస్ట్ వికెట్‌కే 98 పరుగుల భాగస్వామ్యం కలిపిన ఈ ఓపెనింగ్ జోడి, భారీ స్కోరుకి పవర్ ప్లే లోనే బాటలు వేసేసింది. ఇక చివరిగా సిమ్రాన్ హెట్ మేయర్ భారీ సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్ మంచి స్కోరును అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ రెండు, కుల్‌దీప్, రోవ్ మెన్ పోవేల్ చెరో వికెట్ తీశారు. 

200 రన్స్ లక్ష్యంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కి ముందు నుంచి  వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఓపెనర్ పృథ్విషా డక్ అవుట్ అయ్యాడు.  తరువాత వచ్చిన మనీష్ పాండే గోల్డెన్ డక్ గా వెను తిరగాడు. ఈ ఇద్దరినీ ట్రెండ్ బౌల్ట్ ఔట్ చేశాడు. ఆ తరువాత వచ్చిన రిలీ రోసో తేలిపోయినా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ పట్టుదలతో గ్రీజులో నిలిచాడు. లలిత్ యాదవ్ కాస్త సహకారాన్ని అందించాడు. స్లాగ్ ఓవర్ల ముందు అక్షర పటేల్ కూడా ఔట్ అయిపోవడంతో ఢిల్లీ ఓటమి ఖాయం అయిపోయింది.. బాల్స్, రన్స్ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవడంతో వార్నర్ దూకుడు పెంచుతూ టీం స్కోర్ 139 వద్దకు తీసుకెళ్లాడు, కానీ 8 వ వికెట్‌గా అవుట్ అయిపోయాడు. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 142/9 కే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో రెంట్ బౌల్డ్, చాహల్ మూడేసి వికెట్లు, అశ్విన్ 2 , సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.

మూడో మ్యాచ్‌లోను ఓడిన ఢిల్లీ.. రెండోసారి గెలిచిన రాజస్థాన్..

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో పర్యాటక వార్నర్ సేన మరో ఓటమిని మూటగట్టుకుంది.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేక పోవడంతో హ్యాట్రిక్ ఓటమిని ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది.. 57 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం అందుకుంది. 200 పరుగుల భారీ లక్ష్య చేదనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్ మినహా మిగతా వాళ్ళు ఎవరు రాణించలేకపోవడంతో.. ఢిల్లీ ఓటమిపాలవ్వక తప్పలేదు. ఇక రాజస్థాన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఢిల్లీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. ట్రెంట్ బోల్డ్, యజువేంద్ర చాహల్ చెరో మూడు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ రెండు, సందీప్ శర్మ ఒక్కొక్క వికెట్ చొప్పున తీసి టీంకి సపోర్టుగా నిలిచారు. 

టార్గెట్ ఛేదించడంలో ఒకవైపు వికెట్లు పడుతున్న వార్నర్ మాత్రం క్రీజులో ఎక్కువసేపు కొనసాగాడు. కానీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమిపాలయ్యి ఓటమిలో హ్యాట్రిక్ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ మూడింట్లో రెండుసార్లు గెలుపొందింది.