రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు 12 లక్షల జరిమానా

బుధవారం రాత్రి మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సమయంలో కెప్టెన్ సంజూ శాంసన్‌ పొరపాటు చేశారు. ఈ తప్పు కారణంగా సంజూకి 12 లక్షల జరిమానా కూడా విధించారు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు CSK  నిర్ణీత సమయంలో 20 ఓవర్లకోట ను పూర్తి చేయలేకపోయింది.  అందువలన స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ కు జరిమానా విధించారు. ఇది […]

Share:

బుధవారం రాత్రి మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సమయంలో కెప్టెన్ సంజూ శాంసన్‌ పొరపాటు చేశారు. ఈ తప్పు కారణంగా సంజూకి 12 లక్షల జరిమానా కూడా విధించారు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు CSK  నిర్ణీత సమయంలో 20 ఓవర్లకోట ను పూర్తి చేయలేకపోయింది.  అందువలన స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ కు జరిమానా విధించారు. ఇది జట్టు చేసిన మొదటి తప్పు. దీని కారణంగా కెప్టెన్ కు జరిమానా విధించారు. రాజస్థాన్ రెండోసారి అలాంటి తప్పు చేస్తే ఇతర ఆటగాళ్లకు కూడా నష్టాన్ని భరించవలసి ఉంటుంది. ఐపీఎల్ తన పత్రికా ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చింది. 

టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2003లో చెన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన 17వ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ తో కొనసాగించినందుకు రాజస్థాన్ రాయల్స్ కు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఈ సీజన్లో జట్టు చేసిన మొదటి నేరం కావడంతో కెప్టెన్ సంజూ శాంసన్‌ ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ జరిమానా విధించిన రెండో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లేసిస్ కు కూడా రూ.12 లక్షల జరిమానా విధించారు. లక్నో సూపర్ జాయింట్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి స్లో ఓవర్ రేట్ కు పాల్పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

 జోష్ బట్లర్ హాఫ్ సెంచరీ ఆధారంగా ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ స్కోరు ముందు చెన్నై 20 ఓవర్ల లో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని, రవీంద్ర జడేజా జోడి చివరికి జట్టును గెలిపించేందుకు శాయశక్తుల ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ 3 పరుగులు తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ చేయగా, చివర్లో సిమ్రాన్ హెట్‌మెయర్ (30 నాటౌట్),   చెన్నై ఓపెనర్ కాన్వే హాఫ్ సెంచరీ చేశాడు. కానీ, రుతురాజ్ గైక్వాడ్ (8), శివమ్ దూబె (8), మొయిన్ అలీ (7), అంబటి రాయుడు (1) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. దాంతో చివర్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (32 నాటౌట్), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (25 నాటౌట్) దూకుడుగా ఆడి గెలిపించేందుకు ప్రయత్నించారు. కానీ లాస్ట్ ఓవర్‌ని అద్భుతంగా వేసిన సందీప్ శర్మ వరుసగా యార్కర్లు విసిరి, రాజస్థాన్ టీమ్‌ని 3 పరుగుల తేడాతో గెలిపించాడు.

మ్యాచ్‌లో కేటాయించిన టైమ్‌లోపు వేయాల్సిన ఓవర్ల కంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఒక ఓవర్‌ని తక్కువగా వేసింది. దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ నివేదిక మేరకు ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం.. కెప్టెన్ సంజు శాంసన్‌కి రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ టీమ్‌కి ఇది మొదటి స్లో ఓవర్ రేట్ తప్పిదం