అందుకే కోహ్లీ, రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చాం: ద్రావిడ్

వచ్చే వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని కోహ్లీ, రోహిత్ శర్మ లకు రెస్ట్ ఇచ్చామని ద్రావిడ్ తెలిపాడు. వివరాలు కూడా తెలిపాడు. వచ్చే వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఫ్రెష్ గా ఉండడానికే కోహ్లీ, రోహిత్ శర్మ లకు రెస్ట్ ఇచ్చామని ద్రావిడ్ తెలిపాడు. వచ్చే ప్రపంచ కప్ లో వాళ్లు భారత్ కి చాలా కీలకం అందుకే వాళ్లకు రెస్ట్ ఇచ్చాం అని తను తెలిపాడు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ […]

Share:

వచ్చే వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని కోహ్లీ, రోహిత్ శర్మ లకు రెస్ట్ ఇచ్చామని ద్రావిడ్ తెలిపాడు. వివరాలు కూడా తెలిపాడు. వచ్చే వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఫ్రెష్ గా ఉండడానికే కోహ్లీ, రోహిత్ శర్మ లకు రెస్ట్ ఇచ్చామని ద్రావిడ్ తెలిపాడు. వచ్చే ప్రపంచ కప్ లో వాళ్లు భారత్ కి చాలా కీలకం అందుకే వాళ్లకు రెస్ట్ ఇచ్చాం అని తను తెలిపాడు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ శుక్రవారం మొదలవుతుంది. ఈ సిరీస్ లో కోహ్లీ, రోహిత్ శర్మ తప్ప మిగతా వాళ్లంతా వరల్డ్ కప్ లో ఆడే జట్టే. అదేవిధంగా అశ్విన్ గురించి మాట్లాడుతూ  అశ్విన్ తమ వరల్డ్ కప్  ప్లాన్ లో ఉన్నాడని చెప్పాడు. ఎవరికైనా గాయమైతే తప్పకుండా అశ్విన్ ని టీంలో ఆడిస్తామని చెప్పాడు. అంతేకాకుండా వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ కోసమే అశ్విన్ ని ఆస్ట్రేలియా తో సీరియస్ కి ఎంపిక చేసామని తెలియజేశాడు.

ఆస్ట్రేలియా తో మొదటి రెండు వన్డేలకు భారత జట్టు:

కేఎల్ రాహుల్( కెప్టెన్), రవీంద్ర జడేజా( వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, బుమ్రా, షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఆఖరి వన్డే కు రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు, విరాట్ కోహ్లీ ఆఖరి వన్డే ఆడతాడు అని చెప్పారు.

ఇండియా వరల్డ్ కప్ కొట్టేనా?:

వచ్చే ప్రపంచ కప్ భారత్ కి చాలా కీలకం, చివరిసారిగా ఇండియా 2011లో ప్రపంచ కప్ గెలిచింది, ఆ జట్టులో, ప్రస్తుత జట్టులో ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ కోహ్లీ. కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండడం ఇండియాకు ప్రపంచ కప్ మీద ఆశలు రేకెత్తిస్తుంది. ఇండియా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్లో డీలాపడుతుంది. ఈసారి అలా కాకూడదని ఆశిద్దాం. ఈసారి భారత్ కి బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుబ్మన్గిల్ ఉన్నారు. వన్ డౌన్ లో కోహ్లీ ఉన్నాడు. సెకండ్ డౌన్ లో ఎవరిని ఆడిస్తారనే దానిమీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇండియాకి ఆల్ రౌండర్లు కూడా బలంగానే ఉన్నారు. రవీంద్ర జడేజా మంచి ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్లో, బౌలింగ్లో రాణిస్తున్నాడు. 

శార్దూల్ ఠాకూర్ రూపంలో అదరపు ఆల్రౌండర్ కూడా అందుబాటులో ఉన్నాడు. భారత స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక భారత పేస్ విభాగం గురించి మాట్లాడితే, బుమ్రాస త్తా చూపాడు. తను ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ కూడా శ్రీలంక మీద 6 వికెట్లు తీసి తను ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో చాటి చెప్పాడు. ఇంకా మహమ్మద్ షమీ అనుభవం కూడా ఇండియాకు బాగా ఉపయోగపడుతుంది. ఇండియా బౌలింగ్ బ్యాటింగ్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ మన బౌలర్లు సరిగ్గా బ్యాటింగ్ చేయలేరు అదే పెద్ద బలహీనత. మనవాళ్లు దాన్ని అధిగమిస్తే ఇండియా ప్రపంచ కప్ సాధిస్తుంది.  ఈసారి ఇండియా అన్ని విభాగాల మీద ఫోకస్ చేసి ప్రపంచ కప్ కొట్టాలని కోరుకుందాం.