ఆర్ శ్రీధర్ పుస్తకం: ధోనికి కూడా కోపం వచ్చిన వేళ!

ఎలాంటి పరిస్థితులలోనైనా గ్రౌండ్ లో ధోనీకి కోపం రావడం అసాధ్యం. ధోనీలోని ఈ స్టయిల్ వల్లే ఇంతలా సక్సెస్ అయ్యి కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు.  భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కెప్టెన్ కూల్ అని పిలవడానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులలోనైనా గ్రౌండ్ లో ధోనీకి కోపం రావడం అసాధ్యం. ధోనీలోని ఈ స్టయిల్ వల్లే ఇంతలా సక్సెస్ అయ్యి కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. అయితే ధోనీకి […]

Share:

ఎలాంటి పరిస్థితులలోనైనా గ్రౌండ్ లో ధోనీకి కోపం రావడం అసాధ్యం. ధోనీలోని ఈ స్టయిల్ వల్లే ఇంతలా సక్సెస్ అయ్యి కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. 

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కెప్టెన్ కూల్ అని పిలవడానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులలోనైనా గ్రౌండ్ లో ధోనీకి కోపం రావడం అసాధ్యం. ధోనీలోని ఈ స్టయిల్ వల్లే ఇంతలా సక్సెస్ అయ్యి కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. అయితే ధోనీకి కూడా ఓసారి కోపం వచ్చిందని తనతో పాటు డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా బయటపెట్టాడు. ఆర్ శ్రీధర్ తన పుస్తకం ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’లో ధోనీకి కోపం వచ్చి ఆటగాళ్లకు అల్టిమేటం ఎలా ఇచ్చాడో వెల్లడించాడు. 2015 ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లపై ధోని విరుచుకుపడిన ఓ సంఘటనను వెల్లడించారు. 

“మేం ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ప్లాన్లను అమలు చేస్తున్నాం. అది అక్టోబర్ 2014లో ఫిరోజ్ షా కోట్లాలో వెస్టిండీస్‌తో సిరీస్ గెలిచిన సమయం. అయితే సిరీస్ గెలిచినా ఫీల్డ్‌లో చాలామంది ఆటగాళ్లు ఘోరంగా తప్పులు చేశారు. ప్లేయర్లు ఎక్కువగా కష్టపడకపోవడం, ఫిట్‌నెస్ ను పట్టించుకోకపోవడంపై ధోనీకి చాలా కోపం వచ్చింది.” అని శ్రీధర్ రాశాడు.

“ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ధోని అల్టిమేటం జారీ చేశాడు. ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌లో ప్రమాణాలను అందుకోకపోతే ప్రపంచకప్‌ లో ఆడటం గురించి మర్చిపోవాలని స్పష్టం చేశాడు. అతను వైట్-బాల్ క్రికెట్‌లో ఏ విధమైన ఫీల్డింగ్ని నెలకొల్పాలనుకుంటున్నాడో, ఆ ఘటన నాకు చూపించింది” అని పుస్తకంలో పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌లో భారత్ తమ గ్రూప్ గేమ్‌ మ్యాచ్‌‌‌లు అన్ని గెలిచి క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. అయితే సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఓటమితో టోర్నీ నుంచి వెనుదిరిగింది. 2017లో బీసీసీఐ ఆటగాళ్లందరూ యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తరువాత ఈ నిబంధనను తొలిగించింది. కానీ.. BCCI 2023లో ఈ టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. టీమ్ ఇండియా ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఫిట్‌టెస్ట్ జట్లలో ఒకటిగా ఉంది. ఈ టెస్ట్ ఎంపికకు ముందు ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిట్​నెస్ కోసం బీసీసీఐ నిర్వహించే యో–యో టెస్టులో విఫలమైన ఆటగాళ్లను మరో మాట లేకుండా పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని ఆటగాళ్లలో ఫిట్​నెస్ అంటే ఇండియన్ ప్లేయర్సే గుర్తుకు వచ్చేలా తయారయింది. ఇది కేవలం ఊరికే గాలి వాటంగా వచ్చింది కాదు. దీని వెనుక ఎంతో మంది శ్రమ దాగుంది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫిట్​నెస్ విషయంలో ఆటగాళ్ల మీద కోప్పడ్డాడంటేనే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఎం.ఎస్ ధోనీ చురుకైన కీపర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ధోనీ వికెట్ల వెనుక ఉన్నాడంటే.. ఏ బ్యాటర్ అయినా సరే మరింత జాగ్రత్తగా ఆడుతారు. లేకపోతే రెప్పపాటులో ధోనీ వికెట్లను గిరాటేస్తాడు.