కామెంట్స్ చేస్తున్న‌వారికి అశ్విన్ స్ట్రాంగ్ సెటైర్

టీమిండియా యువ జట్టు రీసెంట్ గా విండీస్ తో టీ 20 సిరీస్ ను కోల్పోయింది. విండీస్ మీద వన్డే, టెస్టు సిరీస్ లను గెలిచిన ఇండియా టీ20 సిరీస్ ను కోల్పోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా ఓడిపోవడం మీద సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శకులకు సమాధానం ఇచ్చారు. మరీ ఇంత ఘోరంగా ఆడతారా? అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా […]

Share:

టీమిండియా యువ జట్టు రీసెంట్ గా విండీస్ తో టీ 20 సిరీస్ ను కోల్పోయింది. విండీస్ మీద వన్డే, టెస్టు సిరీస్ లను గెలిచిన ఇండియా టీ20 సిరీస్ ను కోల్పోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా ఓడిపోవడం మీద సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శకులకు సమాధానం ఇచ్చారు. మరీ ఇంత ఘోరంగా ఆడతారా? అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోయిన పసికూన లాంటి విండీస్ మీద సిరీస్ కోల్పోవడం ఏంటని అంటున్నారు. 

మంచే జరిగిందిలే.. 

ఇలా చాలా మంది జట్టును విమర్శిస్తున్నారు. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. యాష్ తన యూ ట్యూబ్ చానల్ లో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు. విమర్శించడం ఎవరికైనా చాలా ఈజీ అని తెలిపాడు. విమర్శలు చేసే వారికి తాను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. విమర్శించడం చాలా తేలిక అని తెలిపాడు. ఎవరైనా సరే స్వదేశంలో ఆడుతున్నపుడు కొన్నిఅనుకూలతలు ఉంటాయని వివరించాడు. 

చివరి టీ20లో మరీ దారుణం… 

5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా ఓటమితోనే ఆరంభించింది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ పూర్తిగా యువకులతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యంగ్ ఇండియా భయంకర విండీస్ ను నిలువరించలేకపోయింది. వరుసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడి తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. కానీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లను నెగ్గి రేసులోకి వచ్చింది. అయితే చివరి టీ20లో మాత్రం అనూహ్య పరాజయం చవి చూసి సిరీస్ ను 2-3 తేడాతో విండీస్ కు అప్పగించింది. 

వన్డే వరల్డ్ కప్ కు క్వాలిఫై కాకపోయినా.. 

ఒకప్పుడు విండీస్ జట్టు అంటే అరవీర భయంకర బ్యాటర్లు, బౌలర్లు ఉండే వారు. మొదట వరల్డ్ కప్ జరుగుతోందంటే చాలు విండీస్ దే అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విండీస్ జట్టులోని స్టార్ సీనియర్ ప్లేయర్లంతా క్లబ్ క్రికెట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ జట్టు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎంత ఘోరం అంటే ఆ జట్టు కనీసం వరల్డ్ కప్ కు కూడా క్వాలిఫై కాలేకపోయింది. ఒకప్పుడు చాంపియన్లుగా ఒక వెలుగు వెలిగిన కరీబియన్లు ప్రస్తుతం వరల్డ్ కప్ కు కూడా క్వాలిఫై కాకపోవడం దారుణమనే చెప్పాలి. ఇక అటువంటి విండీస్ మీద మన యంగ్ ఇండియా జట్టు ఓడిపోయే సరికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమిండియా జట్టు సభ్యులను ఒక ఆట ఆడుకుంటున్నారు. 

అండగా నిలిచిన యాష్

ఇలా టీమిండియా ను ట్రోల్ చేయడంతో సీనియర్ స్పిన్నర్ యాష్ రంగంలోకి దిగాడు. అతడు యువ ఇండియా జట్టుకు మద్దతుగా నిలిచాడు. మీరు కేవలం సిరీస్ ఓడిపోయింది మాత్రమే చూస్తున్నారని, కానీ ఇందులో కూడా ఎన్నో సానుకూలతలు ఉన్నాయని తెలిపాడు. ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన ఏమీ కాదని అన్నాడు. ఏ దేశం వారికైనా హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఎంతో కొంత ఉంటుందని తెలిపాడు. మీరు బాధపడుతున్న విషయంలో న్యాయం ఉంది కానీ ఈ ఓటమిని రెండు కోణాల్లో చూడాలని విన్నవించాడు. ఈ సిరీస్ వల్ల యువకులకు చాలా అనుభవం వస్తోందని ఆయన తెలిపాడు. కేవలం ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏమీ లేదని పేర్కొన్నాడు. అనుభవం చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. ఈ సిరీస్ ద్వారా కుర్రాలకు ఎంతో అనుభవం వచ్చిందని పేర్కొన్నాడు. తదుపరి ఇండియా ఐర్లాండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత ఆసియా కప్-2023, వన్డే వరల్డ్ కప్ లలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.