పాక్ క్రికెట్ అలానే డెవలప్ అయింది

పాకిస్తాన్ క్రికెట్ అంటే ఇండియన్లు చాలా మందికి నచ్చదు. అందుకు కారణం మన జట్టుతో ఆ దేశ క్రికెట్ జట్టుకు ఉన్న రైవల్రీ. మన ఇండియా పసికూనల మీద ఓడిపోయినా కానీ మన దేశ ఫ్యాన్స్ ఒప్పుకుంటారేమో కానీ పాకిస్తాన్ మీద ఓడిపోయిందటే మాత్రం అస్సలు సహించరు. అంతలా మన దేశ ఫ్యాన్స్ పాక్ ను అసహ్యించుకుంటారు. మరి వాళ్లేమైనా తక్కువ తిన్నారా?? అంటే అదీ లేదు. వారు కూడా మన జట్టుకు ధీటుగా పోటీ ఇస్తారు. […]

Share:

పాకిస్తాన్ క్రికెట్ అంటే ఇండియన్లు చాలా మందికి నచ్చదు. అందుకు కారణం మన జట్టుతో ఆ దేశ క్రికెట్ జట్టుకు ఉన్న రైవల్రీ. మన ఇండియా పసికూనల మీద ఓడిపోయినా కానీ మన దేశ ఫ్యాన్స్ ఒప్పుకుంటారేమో కానీ పాకిస్తాన్ మీద ఓడిపోయిందటే మాత్రం అస్సలు సహించరు. అంతలా మన దేశ ఫ్యాన్స్ పాక్ ను అసహ్యించుకుంటారు. మరి వాళ్లేమైనా తక్కువ తిన్నారా?? అంటే అదీ లేదు. వారు కూడా మన జట్టుకు ధీటుగా పోటీ ఇస్తారు. అంతే కాకుండా పాక్ ఫ్యాన్స్ కూడా ఇండియా ఎప్పుడూ ఓడిపోవాలని కోరుకుంటారు. అందుకోసమే ఇండియా, పాక్ పోరంటే క్రికెట్లో అదో మూడో

ప్రపంచ యుద్ధం మాదిరి. ఆనాడు ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు అతుక్కుపోతారు. ఎవరు గెలుస్తారా? అని నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచెస్ చూస్తారు. ఇండియా- పాక్ మ్యాచ్ లు కూడా అలాగే టెన్షన్ గా సాగుతాయి. 

ఇప్పటిది కాదు… 

ఇండియా- పాక్ జట్ల మధ్య ఉన్న క్రికెట్ వైరం ఇప్పటిది కాదు. ఎన్నో రోజుల నుంచి ఈ వైరం కంటిన్యూ అవుతుంది. ఈ క్లాష్ ను క్యాచ్ చేసుకోవాలని వరల్డ్ లో ఉన్న చాలా సంస్థలు చూస్తుంటాయి. చివరికి ఐసీసీ కూడా ఈ క్లాష్ ను క్యాచ్ చేసుకుంటుంది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం లేదు. దీంతో ఇండియా- పాక్ పోరు చూడాలనుకున్న క్రికెట్ లవర్స్ ఈ వార్త తెలిసి ఘోరంగా ఫీలయ్యారు. ఈ విషయాన్ని గ్రహించిన ఐసీసీ వరల్డ్ టోర్నీల్లో ఇండియా- పాక్ మ్యాచెస్ ఉండేలా చూసుకుంటుంది. కేవలం ఈ మ్యాచెస్ ఉండడం మాత్రమే కాదు. వీటిని సండే రోజు ఆడించేలా ప్లాన్ చేస్తోంది. దీంతో చాలా మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూస్తారని ఐసీసీ ప్లాన్. ఇలా ఎక్కువ మంది మ్యాచ్ చూడడం వల్ల టీఆర్పీలు పెరిగి మ్యాచ్ కు వచ్చే యాడ్ ఇన్ కం పెరుగుతుందని చూస్తోంది. అందుకు తగిన విధంగానే ఇండియా- పాక్ మ్యాచ్ అంటే చాలు క్రేజ్ ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. ఆ మ్యాచ్ వస్తుందంటే చాలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మోతెక్కిపోతూ ఉంటుంది. ఇక యాడ్ రెవెన్యూ అనేది ఆకాశానికంటుతుంది. 

పాక్ అలాగే ఎదిగింది: సీనియర్ స్పిన్నర్

కొద్ది రోజుల నుంచి విశ్వ వేదికలపై పాక్ క్రికెటర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇది శుభపరిణామం అని అంతా అంటున్నారు. ఇలా గత కొద్ది రోజులుగా పాక్ క్రికెటర్లు అంచనాలకు మించి రాణించడం మీద భారత సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్ కూడా స్పందించాడు. ఆసియా కప్ 2023లో ఇండియాతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఫేవరేట్ అని చెప్పారు. అంతే కాకుండా పోయినేడాది ఆసియా కప్ టైటిల్ గెల్చుకున్న శ్రీలంక (టీ20 ఫార్మాట్) కూడా ఫేవరేట్ యే అని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ ఏడు టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరుగుతుంది. ఇండియా అనేక సార్లు ఈ టోర్నీని గెల్చుకుంది. కానీ పాక్ జట్టు కొద్ది రోజులుగా ఫామ్ లో ఉందని అశ్విన్ తెలిపాడు. తన యూ ట్యూబ్ చానల్ లో ఆసియా కప్ ప్రివ్యూ గురించి యాష్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల నుంచి పాక్ జట్టు అంచనాలకు మించి రాణిస్తోందని తెలిపాడు. వారు ఆసియా కప్ మాత్రమే కాకుండా ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారని యాష్ కొనియాడాడు. పాక్ అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలో 1992 లో ప్రపంచ కప్ గెలిచారు. ప్రపంచ కప్ మరియు T20 ప్రపంచ కప్‌లో స్థిరమైన ప్రదర్శనను కనబరిచారు. దీంతో వారిని అందరూ పొగుడుతున్నారు. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి వారు అంచనాలకు మించి ప్రదర్శనను ఇచ్చారని ఆ ప్రదర్శనకు కారణం.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరియు వన్ డౌన్ బ్యాటర్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కారణం అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 

అన్ని రకాలలో ఆరితేరారు..

పాక్ జట్టు ఈ మధ్య టెస్ట్ క్రికెట్, వన్డే, టీ20లతో పాటు సొంత దేశంలో జరిగే టీ20 లీగ్‌లు కూడా ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మన దేశంతో ఉన్న ద్వైపాక్షిక సంబధాల కారణంగా వారు ఇండియాలో జరిగే ఐపీఎల్ ఆడలేకపోతున్నారు కానీ మిగతా అన్ని టోర్నీలలో ఆడుతున్నారు. అందుకే గత 5-6 సంవత్సరాలలో, పాకిస్తాన్ ప్రపంచ స్థాయి క్రికెటర్లను తయారు చేస్తుందని అశ్విన్ తెలిపాడు. కేవలం వరల్డ్ లెవెల్ క్రికెటర్లను తయారు చేయడమే కాకుండా వారిని సక్సెస్ ఫుల్ గా లాంచ్ కూడా చేస్తున్నారని తెలిపాడు. ఈ ఆసియా కప్ లో కూడా బాబర్, రిజ్వాన్ తమ ఫామ్ ను కొనసాగిస్తే పాక్ ను ఆపడం కష్టం అవుతుందని అతడు ఎక్స్ పెక్ట్ చేశాడు. మిడిలార్డర్ తో పాటు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే రిజ్వాన్ తో పాటు డేంజరస్ బ్యాటర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టుకు పెద్ద ప్లస్. వారు కనుక చెలరేగితే ఆసియా కప్ మాత్రమే కాదు రాబోయే వరల్డ్ కప్ లో కూడా పాక్ ను అడ్డుకోవడం ఇంపాజిబుల్.