Quinton de Kock: ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్న క్వింటన్ డికాక్

సఫారీ బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ వల్ల ఇతడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు సుపరిచితుడు. ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో క్వింటన్ డికాక్ (Quinton de Kock) రెచ్చిపోతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎదురుగా ఉన్న టీం ఏదైనా కానీ బౌలర్లను మాత్రం ఉతికారేస్తున్నాడు. వరుస సెంచరీలు చేస్తూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్నాడు. సఫారీ […]

Share:

సఫారీ బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ వల్ల ఇతడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు సుపరిచితుడు. ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో క్వింటన్ డికాక్ (Quinton de Kock) రెచ్చిపోతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎదురుగా ఉన్న టీం ఏదైనా కానీ బౌలర్లను మాత్రం ఉతికారేస్తున్నాడు. వరుస సెంచరీలు చేస్తూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్నాడు. సఫారీ జట్టులో ఏ బ్యాటర్లు ఎలా ఆడినా కానీ క్వింటన్ డికాక్ (Quinton de Kock)  మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే వరల్డ్ కప్ హయ్యెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో క్వింటన్ డికాక్ (Quinton de Kock)  చోటు సంపాదించాడు. 

ముచ్చటగా మూడు సెంచరీలు 

క్వింటన్ డికాక్ (Quinton de Kock)  ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో మూడు సెంచరీలు చేశాడు. ప్రత్యర్థి టీమ్స్ ఎవరైనా సరే డికాక్ (Quinton de Kock)  మాత్రం తన ఆటతీరును మార్చుకోవడం లేదు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీల మీద సెంచరీలు నమోదు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన పేర ఎన్నో రికార్డులను లిఖించుకుంటున్నాడు. ప్రపంచ కప్ క్రికెట్‌ లో దక్షిణాఫ్రికా తరఫున రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ ను నమోదు చేశాడు. ప్రపంచ కప్‌ లో నిర్దేశించిన వికెట్‌కీపర్‌ ల అత్యధిక స్కోర్లు విషయానికి వస్తే, భారత మాజీ కెప్టెన్ MS ధోనీని కలిగి ఉన్న ఎలైట్ జాబితాలో డి కాక్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇండియన్ టీం మాజీ కెప్టెన్ ధోనీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (183*) వికెట్ కీపర్‌ గా రికార్డు సృష్టించాడు. డి కాక్ (Quinton de Kock)  కూడా వికెట్ కీపర్ గా ఉండి వన్డేల్లో అత్యధిక స్కోర్ ను నమోదు చేశాడు. వన్డేల్లో నిర్ణీత వికెట్ కీపర్‌ గా ఇది అతని మూడవ 150-ప్లస్ స్కోరు. 50 ఓవర్ల ఫార్మాట్‌ లో ఏ వికెట్ కీపర్ బ్యాటర్ కూడా డి కాక్ (Quinton de Kock)  కంటే ఎక్కువ 150-ప్లస్ స్కోర్లు నమోదు చేయలేదు. దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ యొక్క ఒకే ఎడిషన్‌లో మూడు 350-ప్లస్ స్కోర్‌లను నమోదు చేసిన మొదటి జట్టుగా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే సఫారీలు తమ దైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను తమ పేర లిఖించుకుంటున్నారు. 

Also Read: PCB: కొట్టుకున్న పాకిస్థాన్ ప్లేయర్స్.. పీసీబీ రియాక్షన్ ఇదీ

రోహిత్, కోహ్లీలను దాటేసిన డికాక్

క్వింటన్ డికాక్ (Quinton de Kock)  ఈ ప్రపంచకప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో డి కాక్ (Quinton de Kock)  ఏడు సిక్సర్లు మరియు 15 ఫోర్లతో 174 పరుగులు చేశాడు. డి కాక్ 124.29 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేశాడు. ఈ స్టార్ ఓపెనర్ 50 ఓవర్ల పోటీలో స్టాండ్-ఇన్ కెప్టెన్ మార్క్రమ్ (60) మరియు హెన్రిచ్ క్లాసెన్ (90)తో విలువైన భాగస్వామ్యాలను అందించాడు. దీంతో దక్షిణాఫ్రికా మరో మారు 350+ స్కోరును అవలీలగా సాధించింది. ఈ స్కోరును చూసే సరికే బంగ్లా బ్యాటర్లు ఢీలా పడ్డారు. వారు 149 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్ కూడా ఓడిపోవడంతో బంగ్లాకు సెమీస్ క్లిష్టంగా మారింది. ఇప్పటికే మ్యాచెస్ ఓడిపోయిన బంగ్లా ఈ మ్యాచ్ లో అయినా సత్తా చాటుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అలా మాత్రం జరగలేదు. దీంతో బంగ్లా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సౌతాఫ్రికా అవతరించిన విషయం తెలిసిందే. 2023 ప్రపంచకప్‌ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ (311), విరాట్ కోహ్లీ (354)లను కూడా డి కాక్ (Quinton de Kock)  అధిగమించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ 5 మ్యాచ్‌ల్లో 407 పరుగులు చేశాడు.