జట్టులో చోటుపై పృథ్వీ షా

మొదటిసారిగా పృథ్వీ షా నుంచి ప్రకటన భారత యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. 537 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు-మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో పృథ్వీ షాకు చోటు లభించింది. కానీ ఆ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా పృథ్వీ షా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో శుభ్ మాన్ గిల్ […]

Share:

మొదటిసారిగా పృథ్వీ షా నుంచి ప్రకటన

భారత యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. 537 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు-మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో పృథ్వీ షాకు చోటు లభించింది. కానీ ఆ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా పృథ్వీ షా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో శుభ్ మాన్ గిల్ చాలా కష్టపడ్డాడు. ముందు జరిగిన రెండు మ్యాచ్ ల్లో 6 మరియు 11 పరుగులు మాత్రమే శుబ్ మాన్ గిల్ చేశాడు. అయితే అహ్మదాబాద్‌లో జరిగిన చివరి మ్యాచ్ లో 126* పరుగులతో నిలిచాడు. పృథ్వీ షా ఫామ్ లో ఉన్నప్పటికీ శుభ్ మాన్ గిల్ బాగా ఆడుతుండటంతో షా బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

పృథ్వీ షా ప్రకటన

పృథ్వీ షా చివరిసారిగా జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భారత్ తరపున ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని తీసుకున్నారు. ఆ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు సిరీస్ ముగిసి నెల రోజులు అయిన తరువాత న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడే అవకాశం రాకపోవడంపై తన స్పందనను వ్యక్తం చేశాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం కంటే భారత జట్టులోకి పునరాగమనమే తనకు ఎక్కువని పృథ్వీ షా అంటున్నాడు. 

పృథ్వీ షా మాట్లాడుతూ, “నేను T20 జట్టులోకి తిరిగి రావడం, ఆటగాళ్లను కలవడం మరియు వారితో శిక్షణ పొందడం నాకు చాలా ఇష్టం. నేను ఆ విషయాన్ని ఆస్వాదించాను. అవును, నాకు అవకాశం రాలేదు కానీ..  తిరిగి వచ్చే అవకాశం వచ్చింది.” అది ముఖ్యం అని పృథ్వీ షా అన్నాడు. ఎప్పుడు ఆడించాలి లేదా ఆడించకూడదు అనేది వాళ్ల ఇష్టం. కానీ నేను దానిని గౌరవించాను. ఎందుకంటే వాళ్లు నా ముందు ఉన్న ఆటగాడికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలనుకున్నారు. కానీ.. మళ్ళీ, నేను చింతించను, నేను అవకాశం కోసం వేచి ఉంటాను. నేను భారత జట్టు సాధించాలనుకుంటున్న లక్ష్యాల జాబితాను కలిగి ఉన్నందున  నాకు అవకాశాలు ఉన్నాయి  అని పృథ్వీ షా అన్నాడు.

రంజీ ట్రోఫీలో పృథ్వీ షా ప్రదర్శన

అతను ఇంకా ఇలా అన్నాడు, “నేను పరుగులు చేస్తూనే ఉన్నాను. ఇది సరిపోకపోతే నేను మరింత స్కోర్ చేయాలని భావించాను, అందుకే నేను 379 పరుగులు చేసాను. ఇది కేవలం నా రోజు, మరియు నేను ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావించాను.” కొన్నిసార్లు ఇలా అవకాశం వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నేను చాలా కాలంగా భారత జట్టులో ఎందుకు లేను అని మీ మనసులో ఉంది. 

రంజీ ట్రోఫీ గేమ్‌లో మాస్టర్‌ ఫుల్ 379 పరుగులు పృథ్వీ షా, అంతకు ముందు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2022లో 363 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో షా ఆకట్టుకునే పరుగులతో భారత జట్టుకు తిరిగి వచ్చాడు. అయితే భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గిల్‌కు మద్దతు ఇచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీ తర్వాత మేనేజ్‌మెంట్ మద్దతు గిల్ కే ఎక్కువగా ఉంది.