ర్యాంక్ టర్నర్‌ పిచ్ పై ప్రజ్ఞాన్ ఓజా స్పందన

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే, ‘పిచ్ టాక్’ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఆస్ట్రేలియాలోని పలువురు మాజీ ఆటగాళ్ళు మరియు మీడియా సంస్థలు భారత జట్టు పిచ్‌లను ‘డాక్టరింగ్’ చేస్తున్నాయని ఆరోపించాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకునే ప్రయత్నంలో భారతదేశం మొదటి మూడు టెస్టుల్లో ‘ర్యాంక్ టర్నర్‌ల’ను సిద్ధం చేయడం నిరాశాజనక చర్య అని కూడా కొందరు భావిస్తున్నారు. దీని గురించి భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను అడిగినప్పుడు, అతను దానిని అపహాస్యం చేశాడు […]

Share:

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే, ‘పిచ్ టాక్’ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఆస్ట్రేలియాలోని పలువురు మాజీ ఆటగాళ్ళు మరియు మీడియా సంస్థలు భారత జట్టు పిచ్‌లను ‘డాక్టరింగ్’ చేస్తున్నాయని ఆరోపించాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకునే ప్రయత్నంలో భారతదేశం మొదటి మూడు టెస్టుల్లో ‘ర్యాంక్ టర్నర్‌ల’ను సిద్ధం చేయడం నిరాశాజనక చర్య అని కూడా కొందరు భావిస్తున్నారు. దీని గురించి భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను అడిగినప్పుడు, అతను దానిని అపహాస్యం చేశాడు మరియు భారత్ కేవలం ‘ఫలితం’ కోసం ప్రయత్నిస్తోందని కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించాడు.

“టెస్ట్ క్రికెట్ నిర్వచనం ఏమిటి.. ఇది మీ నైపుణ్యానికి మరియు మీ మానసిక మరియు శారీరక బలానికి పరీక్ష. హోమ్ మరియు అవే సిరీస్‌ల అందం ఏమిటంటే, మీరు ఒకరి దేశానికి వెళ్ళినప్పుడు, మీరు ఎదుర్కోనే విభిన్నమైన సవాలును మీరు ఎదుర్కొంటారు. మేము వివిధ  దేశాలకు వెళ్ళినప్పుడు.. సవాళ్లు మాక్కూడా భిన్నంగా ఉంటాయి, అదే విధంగా వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆ జట్లకు కూడా అలాగే ఉంటాయి. ప్రత్యర్థి దేశాలలో వికెట్ కొద్దిగా పచ్చగా ఉంటుంది, కొంత పార్శ్వ కదలిక ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే కాస్త బూమ్ ఉంది. ఉప ఖండంలో ట్రాక్ స్పిన్నర్లకు సహాయపడుతుంది. కాబట్టి ఆ అంశంలో భారతదేశం నిరాశాజనకంగా ఉందని అనడం, ప్రతి ఒక్కరికి, వారి బలానికి అనుగుణంగా ఆడే అవకాశం ఉన్నందున..  నేను దానితో ఏకీభవించను” అని ఓజా హిందుస్థాన్ టైమ్స్‌తో అన్నారు.

భారతదేశం తాము సిద్ధం చేసిన పిచ్‌లతో ఆటను ‘మరింత ఉత్తేజకరంగా’ చేయడానికి మాత్రమే ప్రయత్నించిందని మాజీ స్పిన్నర్ ఓజా అభిప్రాయపడ్డాడు.

“ఇది కేవలం ఒక వ్యూహం మరియు ఇది గేమ్‌ను మరింత ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. రోహిత్ శర్మ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది, మీరు పూర్తి ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, వికెట్లు బాగా లేవని చాలా మంది అన్నారు. కాబట్టి మీరు ఫలితాలను పొందినప్పుడు, ఆటలో కొంత ఉత్సాహాన్ని చూసినప్పుడు, మీరు ఇక్కడ చేయవలసింది కూడా అదే” అని అతను చెప్పాడు.

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగియడంతో.. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ తొలిసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ సమస్యపై బహిరంగంగా మాట్లాడాడు. ఇండోర్ పిచ్‌పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న మాజీ క్రికెటర్లపై కూడా రోహిత్ విరుచుకుపడ్డాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మాథ్యూ హేడెన్, మార్క్ వా మరియు మైఖేల్ క్లార్క్ ఇండోర్ పిచ్‌ను చూసి ఏమాత్రం సంతోషించలేదు మరియు ఇది టెస్టులు ఆడేందుకు అనుకూలమైన పిచ్ కాదని పేర్కొన్నారు.

రోహిత్ మాట్లాడుతూ, “మాజీ క్రికెటర్లు ఈ పిచ్‌లపై ఆడాల్సిన అవసరం లేదు. ఇది మేము ఆడాలనుకున్న పిచ్ మరియు ఇది మా బలం. మీరు హోమ్‌గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు, మీరు మీ బలానికి అనుగుణంగా ఆడాలని కోరుకుంటారు మరియు బయట వ్యక్తులు ఏమి చెప్పినా పర్వాలేదు. ఇంకా ఫలితాలు రాకుంటే మరోలా ఆలోచించి ఉండేవాళ్ళం.. అని రోహిత్‌  అన్నాడు.  ఇంకా మాట్లాడుతూ.. పిచ్‌పై ఇంత చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. భారత్‌లో ఎప్పుడు ఆడినా.. పిచ్‌పైనే దృష్టి ఉంటుంది. నాథన్ లియాన్ ఎలా బౌలింగ్ చేశాడు వంటి ప్రశ్నలు నన్ను ఎందుకు అడగడం లేదు, ఛతేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో ఇంత అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు లేదా ఉస్మాన్ ఖవాజా మొదటి ఇన్నింగ్స్‌లో ఎలా బ్యాటింగ్ చేశాడు.. ఈ ప్రశ్నలపై నేను మీకు వివరంగా సమాధానం చెప్పగలను, పిచ్ గురించి కాదు, ఎందుకంటే నా ప్రకారం పిచ్ పై చర్చించాల్సిన అవసరం లేదు” అని రోహిత్ అన్నారు.