ప్ర‌పంచ ఆర్చ‌రీ ఛాంపియ‌న్‌షిప్‌లో మ‌హిళ‌ల స‌త్తా

క్రీడలలో మన భారతదేశం ఎన్నో పథకాలు సాధించింది. కానీ, ఆర్చరీ పోటీలలో బంగారు పథకం రావడం మాత్రం ఇదే మొదటిసారి. బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో మన భారతదేశం అదరగొట్టింది. చరిత్ర సృష్టించి బంగారు పథకాన్ని భారతదేశానికి అందించింది. మామూలు విషయం కాదు: పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించొచ్చు అని భారతదేశ ఆర్చరీ టీం చాటి చెప్పింది. టీం లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ చేసి, మిగిలిన దేశాలతో […]

Share:

క్రీడలలో మన భారతదేశం ఎన్నో పథకాలు సాధించింది. కానీ, ఆర్చరీ పోటీలలో బంగారు పథకం రావడం మాత్రం ఇదే మొదటిసారి. బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో మన భారతదేశం అదరగొట్టింది. చరిత్ర సృష్టించి బంగారు పథకాన్ని భారతదేశానికి అందించింది.

మామూలు విషయం కాదు:

పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించొచ్చు అని భారతదేశ ఆర్చరీ టీం చాటి చెప్పింది. టీం లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ చేసి, మిగిలిన దేశాలతో పోటీపడి, ఎవరు ఊహించని విధంగా అన్ని దేశాల కన్నా మంచి పాయింట్స్ సాధించి, బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని తీసుకువచ్చారు ఆర్చరి టీం.

ఇంతకుముందు భారతదేశం తరఫున ఎంతోమంది ఎన్నోసార్లు ఆడినప్పటికీ కాంస్యం, రజిత పథకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ఈసారి తప్పకుండా భారతదేశానికి బంగారు పథకాన్ని తీసుకురావాలని పట్టుదలతో ఆర్చరీ టీం ముందుకు దూసుకు వెళ్ళింది. విల్లు ప్రతిభను చాలా బాగా ఘనపరిచింది. 

భారతదేశం తరపున ఆడిన ఆర్చరీ టీం లో ముఖ్యమైన సభ్యులు, జ్యోతి సురేఖ వేనం, అదితి స్వామి ఇంకా ప్రణీత్ కౌర్ లు ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడం జరిగింది. ప్రతి రౌండ్ లో కూడా అబ్బురుపరిచే విధంగా వారు తమ విల్లు ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే గట్టి పోటీ దారులైన దేశాలతో పోటీపడి అత్యధిక పాయింట్లతో బంగారు పథకాన్ని తీసుకువచ్చారు ఆర్చురి టీం.

ప్రశంసల వర్షం: 

భారతదేశానికి ఆర్చరీ విభాగంలో బంగారు బతకాన్ని తీసుకువచ్చిన టీమ్ మెంబర్స్ కి అభినందనలు తెలియచేస్తున్నారు భారతదేశ పౌరులు. ప్రతి ఒక్కరు కూడా తమని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. మన భారత దేశ రాష్ట్రప్రతి, ప్రధాన మంత్రులతో సహా అందరూ కూడా ఆర్చరీ టీం వారికి అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

మన భారత్ మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశానికి బంగారు పథకాన్ని అందించిన మొట్టమొదట ఉమెన్ టీం కి అభినందనలు తెలియజేశారు. వారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా మారెందుకు చాలా శ్రమించారు అని, ప్రపంచంలో భారతదేశాన్ని గర్వ కారణంగా నిలబెట్టారని కొనిఆడారు.

మరో పక్క కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ కార్ గే కూడా ట్విట్టర్ ద్వారా ఆశ్చర్య చాంపియన్షిప్లో మొదటి స్థానాన్ని సంపాదించి భారతదేశానికి బంగారు పథకాన్ని అందించిన టీమ్ మెంబర్స్ ని అభినందించారు. వారు ఇదే విధంగా భారతదేశ పౌరులుగా మరెన్నో విజయాలు సాధించాలని, బంగారు భవిష్యత్తును చూడాలని ఆశించారు.

మెక్సికో టీం ని వెనక్కి నెట్టి:

అయితే ఫైనల్స్ లో మెక్సికో టీం మెంబర్స్ అయినా డెఫ్ని క్వరింటారో, ఆనా సోఫా, ఆండ్రియా 229 పాయింట్లు సాధించగా, మన భారత జట్టు 6 పాయింట్లు అదనంగా సాధించి 235 పాయింట్లతో మొదటి స్థానమైన బంగారు పథకాన్ని సొంతం చేసుకున్నారు. మన భారత టీం కేవలం మెక్సికో టీంనే కాదు, సెమీ ఫైనల్స్ లో కొలంబియా టీం ని, చైనా టీం ని వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని తగ్గించుకున్నారు. భారతదేశ ప్రతిభను మరొకసారి చాటి చెప్పారు.

అయితే భారతదేశం 1981 సంవత్సరం నుంచి ఆర్చరీ పోటీలలో పోటీ పడుతున్నప్పటికీ మొదటి స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. చాలాసార్లు ఫైనల్స్ వరకు వచ్చి వెనుతిరిగింది ఆర్చురి టీం. ఇప్పటికీ ఆ కల నెరవేరింది.