కబడ్డీ ఆటగాళ్లకు కోట్లలో అదృష్టం

2014లో పెద్ద ప్రయోగంగా ప్రారంభమైన PKL భారత క్రీడ కబడ్డీకి కొత్త జీవితాన్ని అందించింది. అప్పటి నుండి జగ్గర్‌నాట్ తనదైన ఆదర అభిమానాలను సంపాదించగలిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారతదేశం అత్యధికంగా తమ అభిమానాన్ని చూపిస్తూ వీక్షించిన ఆట అయితే, రెండవ అత్యధిక అభిమానాన్ని సంపాదించుకుంది ప్రో కబడ్డీ లీగ్. PKL కబడ్డీ పట్ల కొత్త అధ్యయనానికి తెర తీసింది. అనుప్ కుమార్, రాకేష్ కుమార్ మరియు మంజీత్ చిల్లార్ వంటి పేర్లు ఇంటి పేర్లుగా […]

Share:

2014లో పెద్ద ప్రయోగంగా ప్రారంభమైన PKL భారత క్రీడ కబడ్డీకి కొత్త జీవితాన్ని అందించింది. అప్పటి నుండి జగ్గర్‌నాట్ తనదైన ఆదర అభిమానాలను సంపాదించగలిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారతదేశం అత్యధికంగా తమ అభిమానాన్ని చూపిస్తూ వీక్షించిన ఆట అయితే, రెండవ అత్యధిక అభిమానాన్ని సంపాదించుకుంది ప్రో కబడ్డీ లీగ్. PKL కబడ్డీ పట్ల కొత్త అధ్యయనానికి తెర తీసింది. అనుప్ కుమార్, రాకేష్ కుమార్ మరియు మంజీత్ చిల్లార్ వంటి పేర్లు ఇంటి పేర్లుగా మారాయి. ఇప్పుడు ఈ సంవత్సరం చివర్లో సీజన్ 10 అందరి ముందుకు రాబోతోంది. కొత్త సీజన్ మొదలవుతున్న క్రమంలో, ఈ సందర్భంగా కబడ్డీ ఆటగాళ్ల వేలంపాట నిర్వహించడం జరిగింది అయితే మంది ఆటగలను అదృష్టం వరించింది అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఆటగాడు లక్షల నుంచి కోట్ల వరకు ఈ వేలంలో సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. 

కబడ్డీ ఆటగాళ్లకు కోట్లలో అదృష్టం: 

ప్రో కబడ్డీ లీగ్ (PKL) సీజన్ 10 ప్లేయర్ వేలాన్ని మషాల్ స్పోర్ట్స్ 9-10 అక్టోబర్ 2023న ముంబైలో విజయవంతంగా నిర్వహించింది. రెండు రోజుల ఈవెంట్‌లో తెలుగు టైటాన్స్ పెద్ద మొత్తంలో వేలంపాడి దక్కించుకున్న పవన్ సెహ్రావత్, అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచాడు. రెండు రోజుల పాటు జరిగిన ప్లేయర్ వేలంలో మొత్తం 118 మంది ఆటగాళ్లను 12 ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ప్లేయర్ వేలంలో స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ రూ.2.6 కోట్లకు తెలుగు టైటాన్స్‌ దక్కించుకోవడం జరిగింది. నిజంగా ఇది చరిత్రలోనే మొదటిసారి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

సి కేటగిరీలో ఇరానియన్లు:

అమీర్‌మహమ్మద్ జఫర్దానేష్ ఈ ఏడాది ప్లేయర్ వేలంలో C కేటగిరీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు, అతను U ముంబా రూ.68 లక్షలకు కొనుగోలు చేశాడు, అదే సమయంలో, జఫర్దానేష్ స్వదేశీయుడు అమీర్‌హోస్సేన్ బస్తామిని, తమిళ్ తలైవాస్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

వేలంలో కబడ్డీ ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల సత్తా:

నితిన్ కుమార్ డి కేటగిరీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. 32.2 లక్షలకు బెంగాల్ వారియర్స్ను కొనుగోలు చేసారు. ఇంకా, మసనముత్తు లక్ష్మణన్ తమిళ్ తలైవాస్ జట్టులో రూ. 31.6 లక్షలకు చోటు సంపాదించాడు. అంకిత్‌ను రూ.31.5 లక్షలకు పాట్నా పైరేట్స్ కొనుగోలు చేసింది. 

శ్రీ అనుపమ్ గోస్వామి, హెడ్ స్పోర్ట్స్ లీగ్స్, మషల్ స్పోర్ట్స్ మరియు లీగ్ కమీషనర్, ప్రో కబడ్డీ లీగ్ తరపున మాట్లాడుతూ, PKL ప్లేయర్ వేలం కోసం నేను అందరు PKL వాటాదారులను మరియు మషాల్ జట్టును అభినందించారు. ప్రారంభ రోజు A మరియు B కేటగిరీలకు స్టార్ ప్లేయర్‌లను ఎన్నుకోగా, 2వ రోజు కూడా కేటగిరీ D ఆటగాళ్ల కోసం చాలామంది తమ బిడ్ ద్వారా చూపించిన ఉత్సాహానికి మెచ్చుకున్నారు. అయితే తప్పకుండా ఈసారి కబడ్డీ జట్టులు మంచి విజయాన్ని దక్కించుకుంటారని, వారి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

మ‌హిళ‌ల PKL గురించి ఇటీవల స్పష్టం చేసిన చారు శర్మ: 

PKL ఒక దశాబ్దం సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది, News18.com.. లీగ్ వ్యవస్థాపకుడు అంతేకాకుండా సాంకేతిక కమిటీ సభ్యుడు చారు శర్మతో మాట్లాడటం జరిగింది. ప్రఖ్యాత వ్యాఖ్యాత 2006 ఆసియా క్రీడల వరకు వెళ్ళే సామర్ధ్యాన్ని ప్రో కబడ్డీ లీగ్ కోసం అందించడనే చెప్పాలి. చారుకు పికెఎల్‌ను అమలు చేయడానికి ఎనిమిదేళ్లు పట్టింది మరియు దారి పొడవునా ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ, సంవత్సరాలుగా కబడ్డీ అపారమైన విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ మరో కొత్త అడుగు వెయ్యబోతోందని ఆయన పేర్కొన్నారు.