Pat Cummins: సిడ్నీ ఎయిర్‌పోర్టులో ప్యాట్ కమిన్స్ కు నిరాశ

మీడియా సిబ్బంది మినహా ఎవరూ రాని వైనం

Courtesy: Twitter

Share:

Pat Cummins: ఇండియాలో జరిగిన ప్రపంచకప్ను(World Cup) ఆస్ట్రేలియా(Australia) కైవసం చేసుకుంది. అద్భుతమైన ఆటతీరుపై ఫైనల్ చేరిన కంగారూలు తుదిసమరంలో ఇండియాను ఓడించి కప్ కైవసం చేసుకున్నారు. దీంతో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా ఆస్ట్రేలియా(Australia) నిలిచింది. అయితే కప్పుతో సిడ్నీ ఎయిర్పోర్టులో(Sidney Airport) ల్యాండైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఘనస్వాగతం లభించలేదు. వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్ను(ODI World Cup) కైవసం చేసుకుని.. ఆస్ట్రేలియాలో(Australia) అడుగుపెట్టిన కంగారూలకు పాపం నిరాశ ఎదురైంది. ఆరోసారి ఛాంపియన్లుగా నిలిచి స్వదేశంలో అడుగుపెట్టిన వారికి స్వాగతం పలికేందుకు ఎవరూ రాలేదు. ఎయిర్పోర్టు(Airport) మొత్తం బోసిపోయి కనిపించింది. దీంతో ఆసీస్ క్రికెటర్లు నిరాశకు (Disappointment) గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నవంబర్ 19 నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) ఘనవిజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన కంగారూలు టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేతుల మీదుగా ప్రపంచకప్ అందుకున్నారు. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇండియాతో టీ20 సిరీస్(T20 Series) కోసం కొంతమంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) సహా మరి కొంతమంది ఆసీస్ క్రికెటర్లు స్వదేశం చేరుకున్నారు.

అయితే ప్రపంచకప్(World Cup) గెలిచి స్వదేశానికి చేరుకున్న జట్టుకు ఎక్కడైనా ఘనస్వాగతం లభిస్తుంది. కానీ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాత్రం నిరాశే మిగిలింది. కప్పుతో సిడ్నీ ఎయిర్పోర్టులో(Sidney Airport) ల్యాండైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఘనస్వాగతం లభించలేదు. కేవలం మీడియా సిబ్బంది మాత్రమే ఫోటోలు తీసుకుంటూ కనిపించారు. స్వాగతం పలికేందుకు అక్కడికి ఎవరూ రాలేదు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతుండగా.. ఇండియన్ ఫ్యాన్స్ భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా(Australia) ప్రపంచకప్(World Cup) గెలిచిందని అక్కడి ప్రజలకు తెలుసా అంటూ నెటిజన్ కామెంట్ చేయగా.. అసలు ఆస్ట్రేలియాలో(Australia) ప్రపంచకప్(World Cup) ప్రసారం చేశారా అంటూ మరికొంతమంది సెటైర్లు వేశారు. ప్రపంచకప్ను ఆస్ట్రేలియన్లు సాధారణ ఈవెంట్లాగా చూస్తారన్న నెటిజన్.. అందుకే వారు ఒత్తిడి లేకుండా ఆడగలరని కామెంట్ చేశాడు.

ఇండియాలో(India) ప్రపంచకప్(World Cup) జరుగుతున్న సమయంలో ఆసీస్ క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఘనస్వాగతం లభించింది. స్థానిక సంప్రదాయ పద్ధతులతో క్రికెటర్లకు స్వాగతం పలికేలా బీసీసీఐ(BCCI) అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రపంచకప్ (World Cup)గెలిచి స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియాల క్రికెటర్లకు మాత్రం అలాంటి స్వాగతం లభించలేదు. ఆరోసారి ప్రపంచకప్ గెలుచుకుని వస్తున్న కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. దీంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) నిరాశగా ఎయిర్ పోర్టు(Airport) నుంచి బయటపడ్డాడు.

ఆదిలోనే రోహిత్ ర్మ‌(47)ను ఔట్ చేసిన మిన్స్.. ర్వాత విరాట్ కోహ్లీ(56) వికెట్ తీసి మైదానం మొత్తాన్ని నిశ్శబ్దంగా మార్చాడు. రిస్థితులకు గ్గట్టు బౌలింగ్లో మార్పులు చేసి.. భారత్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుపడ్డాడు. టీమిండియా నిర్దేశించిన‌ 240 రుగుల క్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో ఛేదించింది. ట్రావిస్ హెడ్‌(137) విధ్వంస కానికి తోడూ మార్నస్ బూషేన్(58 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్ ఆడి ట్టును గెలిపించారు.

ఏడాది జూన్లో ఆసీస్కు టెస్టు ను(TestMace) అందించిన మిన్స్ తాజాగా ల్డ్ ట్రోఫీని ట్టబెట్టాడు. దాంతో, ఒకే ఏడాది దేశానికి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఐదో ల్డ్ ప్ అందుకున్నఆసీస్ సారథిగా మిన్స్ గుర్తింపు సాధించాడు. మిన్స్ కంటే ముందు అలెన్ బోర్డర్(1987), స్టీవ్ వా(1999), రికీ పాంటింగ్‌(2003, 2007), మైఖేల్ క్లార్క్(2015) కంగారూ ట్టును విశ్వవిజేతగా నిలిపారు.