Pakistan: పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రణాళిక

ఇప్పటికే పాకిస్తాన్ (Pakistan) సెమీ ఫైనల్స్ దరిదాపుల్లో కనిపించలేని దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఇంకా తన ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోలేనట్లు కనిపిస్తోంది పాకిస్తాన్ (Pakistan) కచ్చితంగా సెమీఫైనల్స్ (Semis) లో చోటు దక్కించుకోవడం కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది.  పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రణాళిక:  వారి పరిస్థితిని మరింత దిగజార్చడానికి, చెన్నైలో జరిగిన వన్డేల్లో పాకిస్తాన్ (Pakistan)‌పై ఆఫ్ఘనిస్తాన్ తన మొదటి విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘన్ 283 పరుగుల సవాలు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. […]

Share:

ఇప్పటికే పాకిస్తాన్ (Pakistan) సెమీ ఫైనల్స్ దరిదాపుల్లో కనిపించలేని దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఇంకా తన ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోలేనట్లు కనిపిస్తోంది పాకిస్తాన్ (Pakistan) కచ్చితంగా సెమీఫైనల్స్ (Semis) లో చోటు దక్కించుకోవడం కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రణాళిక: 

వారి పరిస్థితిని మరింత దిగజార్చడానికి, చెన్నైలో జరిగిన వన్డేల్లో పాకిస్తాన్ (Pakistan)‌పై ఆఫ్ఘనిస్తాన్ తన మొదటి విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘన్ 283 పరుగుల సవాలు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి పాకిస్తాన్ (Pakistan)‌ను, సెమీఫైనల్స్ (Semis) లిస్టులో ఉన్న మొదటి నాలుగు దేశాల నుండి బయటకు నెట్టింది.

ఆ తర్వాత చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ (Match)లో 271 పరుగుల ఛేదనలో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. నాలుగు వరుస పరాజయాలు ఉన్నప్పటికీ వారి నెట్ రన్ రేట్ పెద్దగా దెబ్బతినకపోవడమే వారికి ప్లస్ పాయింట్ అవ్వనుంది. మూడు మ్యాచ్‌ (Match)లు మిగిలి ఉన్నందున, వారికి సెమీ-ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది, అయితే వారికి ఇతర జట్ల నుండి కొంత సహాయం అవసరం. తర్వాత కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ (Pakistan), ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో తలపడనుంది.

మొత్తం ఆరు మ్యాచ్‌ (Match)లు గెలిచిన భారత్, అద్భుత ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా.. ఇంకా చాలా అంచలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ రెండు జట్లూ సెమీఫైనల్స్ (Semis)లో ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాయి, ప్రస్తుతం న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా ఆక్రమించుకున్న మూడు, నాల్గవ స్థానాలు వేరే దేశాలు దక్కించుకోవలసి ఉంది. అదే సమయంలో శ్రీలంక నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది, అదే పాకిస్తాన్ (Pakistan)‌తో సమానం. 

Read More: Jasprit Bumrah: నేను జట్టులోకి ఇక తిరిగి రాలేనని అన్నారు- బుమ్రా

పాకిస్తాన్ టీం అంచనాలు: 

పాకిస్తాన్ (Pakistan), ఆస్ట్రేలియా తమ అన్ని మ్యాచ్‌ (Match)లను గెలిస్తే, న్యూజిలాండ్‌ మూడు స్థానాల కిందకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ (Pakistan) మరియు ఆస్ట్రేలియా రెండూ ఇంకా వాటిని ఎదుర్కోవాల్సి ఉంది. అదే సమయంలో, పాకిస్తాన్ (Pakistan) మరియు ఆస్ట్రేలియా తమ మిగిలిన మ్యాచ్‌ (Match)లను పెద్ద తేడాతో గెలిస్తే, న్యూజిలాండ్ మరియు శ్రీలంక మిగిలిన అన్ని ఆటలను ఓడిపోతే, వారు కివీస్ మరియు లంకలను పడగొట్టి మూడు, నాల్గవ స్థానాలను సంపాదించుకునే అవకాశం ఉంది. 

పాకిస్తాన్ (Pakistan) వారి మిగిలిన నాలుగు మ్యాచ్‌ (Match)లలో రెండింటిని గెలవగలిగితే పోటీలో ఉంటుంది. ఈ విధంగా అంచనా వేసుకుంటే..ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ (Match)లన్నింటినీ ఓడిపోవాల్సి ఉంటుంది, అయితే శ్రీలంక తమ రాబోయే నాలుగు మ్యాచ్‌ (Match)లలో రెండింటినీ ఓడిపోవాల్సి ఉంటుంది. . పాకిస్తాన్ (Pakistan) కూడా వారి రెండు విజయాలతో మంచి ర్యాంక్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అంచనాల ప్రకారం వెళ్లకపోతే పాకిస్తాన్ (Pakistan) వెంటనే ప్రపంచ కప్ (World Cup) నుండి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

హోరాహోరీగా దేశాల మధ్య వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్ (Match) లు జరుగుతున్న సందర్భంలో, మాజీ పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు ఉమర్ గుల్ (Umar Gul), ప్రస్తుత  వరల్డ్ కప్ (World Cup) పాకిస్తాన్ (Pakistan) ఆటగాడి మీద విమర్శలు కురిపించాడు. సౌత్ ఆఫ్రికా (South Africa) తో  పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ (Match) జరుగుతున్న సందర్భంలో, షాదాబ్ ఖాన్ (Shadab Khan) తల మీద గాయం (injury) పేరు చెప్పి తప్పుకున్నాడు గాని, తాను 24 కోట్ల పాకిస్తాన్ (Pakistan) ప్రజలతో ఆడుకుంటున్నాడని గుర్తుపెట్టుకోలేదని, మాజీ క్రికెట్ ఆటగాడు వాక్యానించాడు. అంతేకాకుండా చాలామంది పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్సీ మీద కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీటి మధ్య, ప్రపంచ కప్ (World Cup) లో పాకిస్తాన్ (Pakistan) సెమీఫైనల్స్ (Semis) లో నిలుస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.