పాకిస్తాన్ స్టార్ స్నూకర్ ఆటగాడు ఆత్మహత్య

కలపని కోసే యంత్రం తో  గాయం చేసుకొని చనిపోయాడు  స్నూకర్ గేమ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాకిస్థానీ ప్లేయర్ మాజిద్ అలీ గురువారం రోజున పంజాబ్ లోని ఫైసలాబాద్ సమీపం లోని తన స్వస్థలమైన సమండ్రి లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కలకలం సృష్టించింది. కలపల్ని కోసే యంత్రం తో గాయం చేసుకొని ఆయన చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. మాజిద్ అలీ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన స్నూకర్ గేమ్స్ లో పాకిస్థానీ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. […]

Share:

కలపని కోసే యంత్రం తో  గాయం చేసుకొని చనిపోయాడు 

స్నూకర్ గేమ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాకిస్థానీ ప్లేయర్ మాజిద్ అలీ గురువారం రోజున పంజాబ్ లోని ఫైసలాబాద్ సమీపం లోని తన స్వస్థలమైన సమండ్రి లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కలకలం సృష్టించింది. కలపల్ని కోసే యంత్రం తో గాయం చేసుకొని ఆయన చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. మాజిద్ అలీ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన స్నూకర్ గేమ్స్ లో పాకిస్థానీ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ లెవెల్ లో అగ్రశ్రేణి ఆటగాడు. గత నెలలో ఇలాగే ప్రఖ్యాత స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇది జరిగి సరిగ్గా నెల రోజులు అవుతున్న సమయం లోనే మరో స్నూకర్ ప్లేయర్ కూడా చనిపోవడం అనేది తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసే విషయం. కేవలం 28 ఏళ్ళ వయస్సు  , కెరీర్ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తున్న సమయం లో ఇలాంటి పని చేసుకోవడం అతని తల్లితండ్రులకు ఎంత శోకాన్ని మిగిలించి ఉంటుందో ఊహించుకోవచ్చు.

సోదరుడు ఆత్మహత్య చేసుకోవడం పై ఉమర్ షాకింగ్ కామెంట్స్ :

ఇక మాజిద్ అలీ ఆత్మ హత్య చేసుకొని చనిపోవడం గురించి అతని సోదరుడు ఉమర్ మాట్లాడుతూ ‘ మాజిద్ మనసు చాలా సున్నితమైనది, చిన్నతనం నుండే సాజిద్ ప్రతీ చిన్న విషయానికి కూడా డిప్రెషన్ లోకి వెళ్ళేవాడు. ఇప్పుడు కూడా వాడిని ఎదో ఒక సంఘటన చాలా తీవ్రమైన డిప్రెషన్ కి తీసుకెళ్లి ఉంటుంది, అందుకే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు, ఇది చాలా భయం కరమైన , బాధాకరమైన విషయం. డిప్రెషన్ లో ఉండడం కొత్తేమి కాదు, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం మేము కలలో కూడా ఊహించలేదు.నా సోదరుడు ఇక లేడు అనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను’ అంటూ మీడియా ముందు విలపించాడు. ఇక పాకిస్థాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ గేమ్స్ చైర్మన్ అలంగీర్ షేక్ చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా ఆయన అలీ ని తల్చుకుంటూ చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. 

సంతాపం తెలిపిన అలంగిర్ షేక్ :

ఆయన మాట్లాడుతూ ‘సాజిద్ అలీ ఎంతో ప్రతిభ గల యువకుడు. స్నూకర్ గేమ్ లో అతను దిగ్గజ కి  స్థాయి వెళ్తాడని నేను అందరితో అంటూ ఉండేవాడిని. మా దేశానికీ ఎన్నో అవార్డులు  , రివార్డులు, కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడని చాలా బలంగా నమ్మాను, కానీ ఇంతలోపే అతను ఇలాంటి చర్య కి పాల్పడడం నన్ను ఎంతో దిగ్బ్రాంతికి గురి చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీడియా అలంగిర్ షేక్ తో మాట్లాడుతూ ‘అలీ చనిపోవడానికి కారణం ఆర్థిక సమస్యలే అని ప్రచారం సాగుతుంది, దీనిపై మీ కామెంట్ ఏమిటి’ అని అడగగా, దానికి షేక్ సమాధానం చెప్తూ ‘అలీ నాకు బాగా తెలిసిన వాడు, అతని వ్యక్తిగత విషయాలు కూడా నాకు బాగా తెలుసు, నాకు తెలిసినంత వరకు అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు’ అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ నుండి మహమ్మద్ యూసఫ్ మరియు మహమ్మద్ ఆసిఫ్ వంటి వారు స్నూకర్ గేమ్ ఆడి ఆసియా ఛాంపియన్ షిప్ టైటిల్స్ గెలుచుకోవడం తో, ఆ దేశం లో స్నూకర్ గేమ్ చాలా ప్రసిద్ధి గాంచింది. ఈ గేమ్ మీద అమితాసక్తి ఉన్నవాళ్లు భారీ సంఖ్యలో ఆడేందుకు ముందుకు వచ్చారు. వారిలో సాజిద్ అలీ కూడా ఒకరు, ఇతగాడు ఆసియా అండర్ -21 పోటీలలో పాకిస్థాన్ తరుపున ఆడి రజత పతాకం ని అందుకున్నాడు. అలాంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆ దేశానికీ తీరని లోటు అనే చెప్పాలి, సాజిద్ అలీ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాం.