World Cup 2023: పాకిస్థాన్ ఇప్పటికీ సెమీస్ చేరొచ్చు..

వన్డే ప్రపంచకప్(World Cup) టోర్నీ సగానికి పైగా పూర్తయ్యింది. ఇంకా సెమీస్(Semis) బెర్తులపై క్లారిటీ రాలేదు. ఇండియా(India), సౌతాఫ్రికా(South Africa) టీమ్‌లు మరొక విజయం సాధిస్తే బెర్తును ఖాయం చేసుకుంటాయి. అయితే మూడు, నాలుగు స్థానాలపైనే క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు ప్లేసుల కోసం పోటీగా భారీగా ఉంది. అయితే టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిన పాకిస్థాన్(Pakistan) కూడా.. సెమీస్ చేరే దారి ఉంది మరి. కానీ ఈ లెక్కలు కలిసి రావాలి.. వన్డే […]

Share:

వన్డే ప్రపంచకప్(World Cup) టోర్నీ సగానికి పైగా పూర్తయ్యింది. ఇంకా సెమీస్(Semis) బెర్తులపై క్లారిటీ రాలేదు. ఇండియా(India), సౌతాఫ్రికా(South Africa) టీమ్‌లు మరొక విజయం సాధిస్తే బెర్తును ఖాయం చేసుకుంటాయి. అయితే మూడు, నాలుగు స్థానాలపైనే క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు ప్లేసుల కోసం పోటీగా భారీగా ఉంది. అయితే టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిన పాకిస్థాన్(Pakistan) కూడా.. సెమీస్ చేరే దారి ఉంది మరి. కానీ ఈ లెక్కలు కలిసి రావాలి..

వన్డే ప్రపంచకప్‌(World cup)లో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా పాకిస్థాన్ ఈ మెగాటోర్నీకి వచ్చింది. ఆ సమయానికి వన్డేలలో నెంబర్ వన్ జట్టుగా ఉన్న పాకిస్థాన్.. కనీసం సెమీ ఫైనల్ దాకా వెళ్తుందని అందరూ అంచనా వేశారు. కానీ అంచనాలకు అందని ఆటతీరుతో బాబర్(Babar) సేన.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో పాటుగా అఫ్ఘానిస్తాన్(Afghanistan) చేతిలో కూడా చిత్తుగా ఓడి సెమీస్ దారులను సంక్లిష్టం చేసుకుంది. తమ వన్డే ప్రపంచకప్(World Cup) చరిత్రలో తొలిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలై చెత్తరికార్డును మూటగట్టుకుంది.

మరోవైపు హైదరాబాద్ వేదికగా జరిగిన శ్రీలంక(Srilanka), నెదర్లాండ్స్‌(Netherlands) మ్యాచ్‌లలో మాత్రమే పాకిస్థాన్ విజయం సాధించింది. మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించిన బాబర్ టీమ్.. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. అయితే సాంకేతికంగా పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. కానీ.. ఇతర జట్ల ప్రదర్శన మీద బాబర్ టీమ్ ఆధారపడాల్సి ఉంటుంది.

Also Read: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. అశ్విన్ కి ఛాన్స్..?

టోర్నీలో భాగంగా పాకిస్థాన్(Pakistan).. బంగ్లాదేశ్(Bangladesh), న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తన తర్వాతి మ్యాచ్‌లలో తలపడాల్సి ఉంది. సెమీస్(Semis) చేరాలంటూ తప్పనిసరిగా మూడు మ్యాచ్‌లలోనూ పాకిస్థాన్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌ల లోనూ భారీ విజయం సాధిస్తే నెట్ ‌రన్‌రేట్ కలిసి రావటంతో పాటుగా పాకిస్థాన్ ఖాతాలో పది పాయింట్లు వచ్చి చేరతాయి. ఆ తర్వాత మిగతా జట్ల ప్రదర్శనను అనుసరించి బాబర్ టీమ్ టోర్నీలో ముందుకెళ్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది.

పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే..

ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్(Pakistan) సెమీస్ భవితవ్యం ఒకరకంగా టీమిండియా ప్రదర్శన మీద కూడా ఆధారపడి ఉంది. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలలో తప్పనిసరిగా ఉండాలి. పొజిషన్లు అటూ ఇటూ అయినా.. ఈ రెండు టీమ్‌లు టాప్2లో ఉంటేనే పాకిస్థాన్ సెమీస్ చేరే దారి ఉంది.

ఇక న్యూజిలాండ్.. తర్వాతి అన్ని మ్యాచ్‌లలోనూ ఓడిపోవాలి. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించిన కివీస్.. మిగతా మ్యాచ్‌లలో ఓడి 8 పాయింట్లకు పరిమితమైతే పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లే ఛాన్సుంది. ఇక ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై గెలుపొంది.. ఆ తర్వాత మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. దాంతో ఆస్ట్రేలియా ఖాతాలో కూడా ఎనిమిది పాయింట్లే మిగులుతాయి. దీంతో పాకిస్థాన్‌కు సెమీస్‌కి వెళ్లే ఛాన్సు దొరుకుతుంది.

Also Read: MS Dhoni: రిటైర్మెంట్‌ పై హింట్‌ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ..

మరోవైపు శ్రీలంక(Sri Lanka), అఫ్గానిస్తాన్(Afghanistan),) ఖాతాలో ప్రస్తుతం నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్‌లు కూడా రెండుకు మించి విజయాలు సాధించకూడదు.ఈ లెక్కలు అన్నీ వర్క్‌ అవుట్ అయ్యి.. పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లలోనూ భారీ తేడాతో గెలుపొందితే బాబర్ టీమ్ ఖాతాలో పది పాయింట్లు ఉంటాయి. దీంతో పాయింట్ల పట్టికలో మూడోస్థానంతో.. పాకిస్థాన్ సెమీస్ చేరే ఛాన్సుంది.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ సైతం పదిపాయింట్లు సాధించకపోతేనే.. బాబర్ టీమ్‌కు అవకాశం ఉంటుంది. ఈ లెక్కల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. ఈసారికి బాబర్ టీమ్ లీగ్ దశ నుంచే ఇంటి దారి పట్టాల్సి ఉంటుంది.