వన్డే ప్రపంచకప్ ఇండియాలో ఆడము

పూటకి ఒక మాట మారుస్తున్న పాకిస్థాన్ బోర్డు : ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒన్డే ప్రపంచ కప్ మ్యాచులు మన ఇండియా లో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సుమారుగా పుష్కర కాలం తర్వాత మన ఇండియా లో ఈ టోర్నమెంట్ జరగబోతుంది. ఇప్పటికే మ్యాచుల షెడ్యూల్స్ మొత్తం పూర్తి అయ్యాయి. ఇక ప్రపంచం లో జట్టులన్నీ ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. అయితే అందరిదీ ఒక రూట్ అయితే , నా […]

Share:

పూటకి ఒక మాట మారుస్తున్న పాకిస్థాన్ బోర్డు :

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒన్డే ప్రపంచ కప్ మ్యాచులు మన ఇండియా లో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సుమారుగా పుష్కర కాలం తర్వాత మన ఇండియా లో ఈ టోర్నమెంట్ జరగబోతుంది. ఇప్పటికే మ్యాచుల షెడ్యూల్స్ మొత్తం పూర్తి అయ్యాయి. ఇక ప్రపంచం లో జట్టులన్నీ ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. అయితే అందరిదీ ఒక రూట్ అయితే , నా రూట్ మాత్రం సపరేటు అంటుంది పాకిస్తాన్ జట్టు. మొదటి నుండి ఈ టోర్నమెంట్ లో పాకిస్థాన్ జట్టు పాల్గొంటుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరినీ అయ్యోమయ్యం కి గురి చేసేలా చేస్తుంది. పూటకు ఒక మాట మారుస్తూ పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు పై BCCI మండిపడుతుంది. ఇక రీసెంట్ గా ఈ విషయం పై పాకిస్థాన్ క్రీడా శాఖా మంత్రి ఎహ్హ్సన్ మజారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.\

ఆసియా కప్ పాకిస్థాన్ లో ఆడేందుకు నిరాకరించిన ఇండియా :

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్ కి భారత జట్టు రాకపోతే, ఒన్డే ప్రపంచ కప్ ఆడేందుకు పాకిస్తాన్ కూడా ఇండియా కి రాబోదు’ అంటూ రీసెంట్ గా ఒక ప్రకటన చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ వేదికగా నిర్వహించాలని అనుకున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు. కానీ బీసీసీఐ మాత్రం ఇండియన్ జట్టు ని పాకిస్థాన్ కి పంపేందుకు ఒప్పుకోలేదు. దీనితో ఆసియా క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక మరియు పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచులు నిర్వహించాలని అనుకున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్స్ ఇంకా విడుదల చెయ్యలేదు. దీనిపై ఎహ్హ్సన్ మాట్లాడుతూ ‘నా మంత్రిత్వ శాఖ పరిధిలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వస్తుంది. భారత్ ఆసియా కప్పుని తటస్థ వేదికల్లో ఆడాలని నిర్ణయం తీసుకున్నట్టు గా మాకు అనిపిస్తుంది. అదే నిజమైతే మేము కూడా అదే డిమాండ్ చేస్తాం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

అత్యుత్తమ కమిటీ ని నియమించిన పాకిస్థాన్ ప్రభుత్వం :

అయితే ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పాల్గొనాలా? వద్దా అనే నిర్ణయం తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి సెహబాజ్ షరీఫ్ ఒక అత్యున్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసాడు. ఈ కమిటీలో క్రీడా శాఖ మంత్రి ఎహ్హ్సన్ మజారి కూడా ఒక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక పాకిస్తాన్ కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి  బిలావల్ భుట్టో ఈ కమిటీ కి లీడర్ షిప్ చేయనున్నాడు. 11 మందితో కూడిన  ఈ కమిటీ భారత్ పాకిస్తాన్ కి సంబంధించిన అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని, సుదీర్ఘంగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనుంది. అతి త్వరలోనే ప్రధాని కి చివరి నివేదిక అందించబోతుంది ఈ కమిటీ. ఇక ప్రస్తుతం తయారు చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15 వ తారీఖున అహ్మదాబాద్ లో జరగనుంది. మరి పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పాల్గొంటుందా లేదా అనేది దానిపై సస్పెన్స్ మరికొద్ది రోజులు కొనసాగనుంది. ప్రపంచం లోనే అత్యుత్తమ ప్రతిభ గల టీమ్స్ లో పాకిస్థాన్ కూడా ఒకటి, అలాంటి టీం ప్రపంచ కప్ లో పాల్గొనకపోతే కిక్ ఉండదు, వాళ్లకు కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకం కాబట్టి టోర్నమెంట్ లో కచ్చితంగా పాల్గొంటారని అనిపిస్తుంది, చూడాలి మరి.