ODI ప్రపంచ కప్ 2023 పూర్తి వివరాలు ఇవే.. భారత్ సంగతేంటి..?

భారత్ తమ సొంత మైదానంలో మ్యాచులు ఆడడానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఇకపోతే ఈ ODI క్రికెట్ ప్రపంచ కప్ పోటీలలో అర్హత కావాలి అంటే ఆతిథ్య భారతదేశంతో సహా మొదటి 8 జట్లు స్వయం చాలకంగా అర్హత సాధించాలి. ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆడే ఈ టోర్నమెంట్ లో 50 ఓవర్లు ఉంటాయి. ఇక ఈ ప్రపంచకప్ ను భారత్ సొంతం […]

Share:

భారత్ తమ సొంత మైదానంలో మ్యాచులు ఆడడానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఇకపోతే ఈ ODI క్రికెట్ ప్రపంచ కప్ పోటీలలో అర్హత కావాలి అంటే ఆతిథ్య భారతదేశంతో సహా మొదటి 8 జట్లు స్వయం చాలకంగా అర్హత సాధించాలి.

ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆడే ఈ టోర్నమెంట్ లో 50 ఓవర్లు ఉంటాయి. ఇక ఈ ప్రపంచకప్ ను భారత్ సొంతం చేసుకోవడానికి బీసీసీఐ ప్రణాళికలను కూడా ప్రారంభించింది. ఇప్పటికే ODI క్రికెట్ ప్రపంచ కప్ పోటీలలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. అంతేకాదు 2022 T20 ప్రపంచ కప్ ను కూడా గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. ఇప్పుడు 2023లో కూడా ప్రపంచ కప్ గెలువుచుకోవడానికి ఒక బలమైన హక్కుదారుగా కనిపిస్తోంది.

భారత్ తమ సొంత మైదానంలో మ్యాచులు ఆడడానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఇకపోతే ఈ ODI క్రికెట్ ప్రపంచ కప్  పోటీలలో అర్హత కావాలి అంటే ఆతిథ్య భారతదేశంతో సహా మొదటి 8 జట్లు స్వయం చాలకంగా అర్హత సాధించాలి. అలాగే మిగిలిన రెండు జట్లు 2022 – 23 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్ మ్యాచ్లకు ఎంపిక చేయబడతాయి. ఇకపోతే ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ , బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్,  న్యూజిలాండ్, పాకిస్తాన్లు 2023 ప్రపంచ కప్ అర్హత సాధించాయి. ముఖ్యంగా మిగిలిన జట్లు శ్రీలంక, దక్షిణాఫ్రికా,  ఐర్లాండ్,  జింబాబ్వే , నెదర్లాండ్స్ 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కు అర్హత సాధించాయి. ఇక ఈ దేశాల నుండి రెండు జట్లు 2023 ప్రపంచ కప్ కు పోటీ పడనున్నాయి.

ఇకపోతే 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో 10 జట్లు ఆడాల్సి ఉంటుంది. 2019లో కూడా ఇదే ఫార్మాట్ జరిగింది. అలాగే 1992లో కూడా ఇదే ఫార్మాట్ నిర్వహించబడింది. ఇకపోతే ప్రతి జట్టు మిగిలిన జట్లతో రౌండ్ రాబిన్ ఆడుతుంది. ముఖ్యంగా సెమీఫైనల్ లో నాలుగు జట్లు పోటీ పడతాయి. మొదటి రెండు జట్లు ఫైనల్ కీ చేరుకుంటాయి. ఇకపోతే 2023 క్రికెట్ ప్రపంచ కప్ లో ఏఏ జెట్లు పోటీ పడిపోతున్నాయి అనే విషయానికొస్తే.. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్,  పాకిస్తాన్,  వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్ అర్హత సాధించాయి.  2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో మరో రెండు జట్లు అర్హత పొందుతాయి.

ఇకపోతే 2023లో జరిగే 13వ వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ను ఈసారి భారత్ గెలుచుకునే గొప్ప అవకాశం కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆతిధ్య భారత జట్టు పై మూడు మ్యాచుల సీరీస్ ను రెండు ఒకటి తేడాతో ఆస్ట్రేలియా గెలుచుకోవడంతో ఐసీసీ ODI ర్యాంకింగ్స్లో ముందు స్థానంలో నిలిచింది . బుధవారం చెన్నైలో 21 పరుగుల తేడాతో ఇండియాను ఓడించిన ఆసీస్ సీరీస్‌ను  కైవసం చేసుకుంది. ముంబైలోని వాకంటే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్లు పటిష్టంగా తిరిగి వచ్చారు.  రెండో వన్డే  మ్యాచ్ ని 10 వికెట్ల తేడాతో గెలిచి ఉత్తేజ కరమైన ముగింపునుఇచ్చారు. మరి ఈసారి కూడా ఎలాగైనా ప్రపంచ కప్పు సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఆస్ట్రేలియా పోటాపోటీగా భారత జట్టుపై గెలుపొందే ప్రయత్నం చేస్తోంది. మరి మన భారత టీం ఏ విధంగా పోటీ పడుతూ ప్రపంచ కప్ దిశగా అడుగులు వేస్తుందో అనే ఉత్కంఠ తీవ్రంగా నెలకొంది.