నెం. 1 ర్యాంకును కైవసం చేసుకున్న జకోవిచ్… తీవ్ర భావోద్వేగానికి గురైన స్టార్

మన ఇండియాలో టెన్నిస్ అంటే అంత ఫేమ్ లేదు కానీ ఉంటే మాత్రం జకోవిచ్ అంటే క్రేజ్ ఒక లెక్కలో ఉండేది. మన దేశంలో ఇంతలా క్రికెట్​ను ప్రేమించినా కానీ.. జకోవిచ్ అంటే మాత్రం క్రీడాభిమానులకు తెలియకుండా ఉండదు. అంతలా క్రీడాభిమానుల మీద ఈ సెర్బియా స్టార్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. టెన్నిస్ అంటే అంతగా పట్టించుకోని దేశంలో, ఈ స్టార్ క్రేజ్ ఇలా ఉంటే.. టెన్నిస్ అంటే పడి చచ్చే దేశంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. […]

Share:

మన ఇండియాలో టెన్నిస్ అంటే అంత ఫేమ్ లేదు కానీ ఉంటే మాత్రం జకోవిచ్ అంటే క్రేజ్ ఒక లెక్కలో ఉండేది. మన దేశంలో ఇంతలా క్రికెట్​ను ప్రేమించినా కానీ.. జకోవిచ్ అంటే మాత్రం క్రీడాభిమానులకు తెలియకుండా ఉండదు. అంతలా క్రీడాభిమానుల మీద ఈ సెర్బియా స్టార్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. టెన్నిస్ అంటే అంతగా పట్టించుకోని దేశంలో, ఈ స్టార్ క్రేజ్ ఇలా ఉంటే.. టెన్నిస్ అంటే పడి చచ్చే దేశంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కరోనా సమయంలో విమర్శల పాలై..

నోవాక్ జొకోవిచ్ 2022లో తీవ్ర గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఒక ఏడాది పాటు ఈ స్టార్​కు బ్యాడ్ టైం నడిచింది. దీంతో ఈ స్టార్ చాలా టెన్నిస్ టోర్నీలకు కూడా దూరమయ్యాడు. దీంతో ఇతగాడి ప్రపంచ నెంబర్ వన్‌ ర్యాంకు కూడా పోయింది. కానీ 2023లో మరలా ఈ స్టార్ తిరిగి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సంపాదించుకున్నాడు. ఇలా ఏడాది తర్వాత నెంబర్ వన్ ర్యాంకు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఈ స్టార్ వెల్లడించాడు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. చాలా మంది లైన్లలో నిల్చొని మరీ తొక్కిసలాట జరుగుతున్నా కానీ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. కానీ ఈ స్టార్ మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించాడు. కోవిడ్-19 టీకా తీసుకోకపోవడంతో ఇతన్ని అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. ఈ కారణం వల్లే జకోవిచ్ గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. అంతే కాకుండా US ఓపెన్ 2022లో పోటీ చేయడానికి అతను యునైటెడ్ స్టేట్స్‌లోకి వచ్చేందుకు అతడు విమానాశ్రయానికి వస్తే, అధికారులు అతడిని దేశంలోకి అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక జకోవిచ్ తిరిగి పయనమయ్యాడు.

కానీ మరలా ఈ ఏడాది

2022 మిగిల్చిన పీడకలను జకోవిచ్ అంత సులభంగా మర్చిపోడు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి తాను అంటిపెట్టుకున్న వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ స్టార్ అనే ర్యాంకును ఈ వివాదం దూరం చేసింది. ఈ వివాదం కారణంగా జకోవిచ్ మ్యాచెస్ ఆడకపోవడం వల్ల స్టార్ ర్యాంకు దూరమయిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

నోటి దురుసు కూడా కారణమే..

జకోవిచ్ నెంబర్ 1 ర్యాంకును కోల్పోయేందుకు కరోనా వ్యాక్సినేషన్ ఒక్కటి మాత్రమే కారణం కాదు. ఇతగాడు.. రష్యా, బెలారస్ ఆటగాళ్లను నిషేధించాలనే వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో గ్రాస్‌కోర్ట్ మేజర్ అతడికి జరిమానా విధించాడు. ఈ కారణంగానే జకోవిచ్ గత సంవత్సరం వింబుల్డన్ గెలిచినా కానీ.. ఎటువంటి పాయింట్‌లను అందుకోలేదు. కానీ ఈ ఏడాది మేజర్ టోర్నమెంట్‌లో ఈ సెర్బియన్ ప్లేయర్ తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. మెల్‌బోర్న్‌లో తన 10వ టైటిల్‌ను, 22వ గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. దీంతో తిరిగి నెం.1 స్థానాన్ని కైవసం కూడా  చేసుకున్నాడు.

భావోద్వేగానికి గురైన సెర్బియన్ బుల్

నెంబర్ వన్ ర్యాంకును తిరిగి పొందిన తర్వాత ఈ స్టార్ ఆటగాడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాను నంబర్ వన్‌గా సాధించిన అతి తక్కువ పాయింట్లు ఇవేనని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇది రెండు గ్రాండ్ స్లామ్‌లు ఆడకపోవడం వల్ల తన నెంబర్ 1 ర్యాంకు పోయిందని ఒప్పుకున్నాడు. ఇతర ఆటగాళ్లు కూడా, కొంతమంది గాయాల కారణంగా కొన్ని స్లామ్‌లను కోల్పోయారని.. మరికొందరికి స్థిరత్వం లేదని తెలిపాడు. తిరిగి నెంబర్ వన్ ర్యాంకును పొందగానే నేను గర్వంతో పొంగిపోయానని తెలిపాడు. నేను కూడా అందరిలాగే కష్టపడి పని చేస్తానని, నిజంగా క్రీడకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నాడు.