ప్రస్తుతానికి అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం పృథ్వీ షా కెరియర్ పై రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 16వ సీజన్‌లో నిరాశాజనకమైన ప్రదర్శనతో పాయింట్లు పట్టికలు దిగువ స్థానంలో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. స్టార్ ఆటగాళ్లు ఈ టీంలో ఉన్నప్పటికీ కూడా విజయాలను నమోదు చేసుకోవడంలో మాత్రం వెనుకంజ వేసింది. భారీగా ఆశలు పెట్టుకున్న యువ క్రికెటర్ పృథ్వీషా ఆరు మ్యాచ్లో కేవలం 47 పరుగులను మాత్రమే చేశాడు. దాంతో గత వారం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ నుంచి పృథ్వీషాను టీమ్ మేనేజ్‌మెంట్ తప్పించింది. మళ్ళీ అతనికి అవకాశాలు వస్తాయో లేదనేది […]

Share:

ఐపీఎల్ 16వ సీజన్‌లో నిరాశాజనకమైన ప్రదర్శనతో పాయింట్లు పట్టికలు దిగువ స్థానంలో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. స్టార్ ఆటగాళ్లు ఈ టీంలో ఉన్నప్పటికీ కూడా విజయాలను నమోదు చేసుకోవడంలో మాత్రం వెనుకంజ వేసింది. భారీగా ఆశలు పెట్టుకున్న యువ క్రికెటర్ పృథ్వీషా ఆరు మ్యాచ్లో కేవలం 47 పరుగులను మాత్రమే చేశాడు. దాంతో గత వారం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ నుంచి పృథ్వీషాను టీమ్ మేనేజ్‌మెంట్ తప్పించింది. మళ్ళీ అతనికి అవకాశాలు వస్తాయో లేదనేది ఫ్రాంచైజీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సమయంలోనైనా అతడికి జట్టులోకి తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. తమ జట్టులో ఓపెనర్లకు కొదవేమీ లేదని తెలిపారు. సన్రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ వేదికగా ఈ రోజు సూపర్ మ్యాచ్ జరుగునుంది. కాగా ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

 గత సీజన్ నుంచి ఇప్పటివరకు తీసుకుంటే పృథ్వీషా తన చివరి 50 మార్కును 13 మ్యాచ్‌ల నుంచి అందుకోలేకపోయారు. ఇతర జట్లలోని చాలామంది ఆటగాళ్లు టాప్ ఆర్డర్‌లో పృథ్వి కంటే ఉత్తమంగా ఆడారు. కానీ పృథ్వీషా మ్యాచ్ విన్నర్ తప్పకుండా గాడిలో పడతాడు. అందుకే అతడిని మేం రిటైన్ చేస్తున్నాం. పృథ్వీషా క్రీజులో ఆడితే మేం 90 శాతం మ్యాచ్‌లను గెలిచేస్తాం. ఇప్పటివరకు పృథ్వీషా గొప్పగా రాణించలేకపోయాడు. ఆరు మ్యాచ్లో 47 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఇలాంటి మ్యాచ్ లలో అతని ప్రదర్శన మాకు అవసరం లేదు. అతడిని పక్కన పెట్టడం కఠినమైన నిర్ణయమే. కానీ భవిష్యత్తులో తప్పకుండా అతనికి అవకాశాలు ఇస్తాం. టోర్నీకి ముందు ఎన్సీఏలో కొన్ని వారాలపాటు తీవ్రంగా శ్రమించాడు తన ఫిట్నెస్ శరీరాకృతిపై శ్రద్ధ పెట్టాడు. ఈ టాప్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని నిర్ణయించాం. అందుకోసమే ఫిల్ స్టాల్ ను గత మ్యాచ్లో తీసుకున్నాం. అది కూడా వర్కౌట్ కాలేదని రికీ పాంటింగ్ చెప్పాడు.

వరల్డ్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్‌కి ఇండియా యంగ్ క్రికెటర్ పృథ్వీషా అంటే ప్రత్యేక అభిమానం ఉంది. రికీ పాంటింగ్‌ కెప్టెన్ గా ఉండగా ఆస్ట్రేలియా టీమ్ రెండుసార్లు వరల్డ్ కప్ గెలుచుకుంది. తన కెరీర్‌లో తాను చూసినా వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్‌లలో ఒకడిగా పృథ్వీషాని పాంటింగ్‌ అభివర్ణించిన సంగతి మనందరికీ తెలిసిందే. పృథ్వీషా వరుసగా విఫలమవుతున్నా అతనికి అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. శూన్యానికి కూడా ఎక్కడో దగ్గర ముగింపు ఉంటుంది. ఇప్పుడు పృథ్వీషాకు ముగింపు పలికే సమయం వచ్చిందని భావించారు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ఆరెంజ్ క్యాప్ ఈసారి పృథ్వీషానే గెలుస్తాడని సంబరంగా చెప్పుకున్నారు. “ఇప్పటివరకు పృథ్వీషా గొప్పగా రాణించలేకపోయాడు. ఆరు మ్యాచ్లో 47 పరుగులు మాత్రమే చేశాడు. హాఫ్ సీజన్ అయ్యేసరికి కూడా పృథ్వీషా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే టీంలో ఉన్న మిగిలిన ప్లేయర్లకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఫెయిల్ అవుతున్న పృథ్వీషాకి కూడా బ్రేక్ అవసరం. రిజర్వ్ బెంచ్ లో కూర్చున్న ప్లేయర్లు ఇంతకంటే బెటర్ గానే ఆడగలరు. అందుకే అతన్ని పక్కన పెట్టాం” అని అంటూ కామెంట్ చేశారు. సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ రికీ పాంటింగ్ పృథ్వీషాపై చాలా పాజిటివ్‌గా మాట్లాడారు.