నాన్ స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్ మిస్ చేసిన హర్షల్

ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ తర్వాత సిఎస్‌కె ఆల్ రౌండర్ వెన్ స్ట్రోక్స్ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్, బౌలర్ బంతి వేయకముందే క్రీజు దాటితే ఆరు పరుగులు పెనాల్టీ విధిస్తే బాగుంటుందేమో అని వ్యాఖ్యానించాడ.  ఎల్ఎస్‌జె – ఆర్‌సిబి ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్షల్, బిష్ణోయ్‌ల విషయంలో జరిగిన […]

Share:

ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ తర్వాత సిఎస్‌కె ఆల్ రౌండర్ వెన్ స్ట్రోక్స్ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్, బౌలర్ బంతి వేయకముందే క్రీజు దాటితే ఆరు పరుగులు పెనాల్టీ విధిస్తే బాగుంటుందేమో అని వ్యాఖ్యానించాడ. 

ఎల్ఎస్‌జె – ఆర్‌సిబి ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్షల్, బిష్ణోయ్‌ల విషయంలో జరిగిన విషయం గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ స్ట్రోక్స్ ఈ రకంగా స్పందించాడు. నాన్ స్ట్రైకర్ రనౌట్‌కు ఆర్‌సీబీ బౌలర్ ట్రై చేయడంపై హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. “రవి బిష్ణోయ్ క్లియర్ గా ముందుగానే క్రీజ్ వదిలి బయటకు వెళ్తున్నాడు, ఇంకా ఇలాంటి రనౌట్స్ తప్పు అనే సిల్లీ పీపుల్ ఉన్నారా?” అని ట్వీట్ చేశాడు. బౌలర్ బంతి వేయకముందే క్రీజు వదిలి వెళ్లడం లాంటి సందర్భంలో, నాన్-స్ట్రైకర్ ఎండ్‌ అవుట్ చేయొద్దని అంటారా? అనే అర్థంలో ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్‌పై స్ట్రోక్స్ స్పందించారు.  

నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి బంతికి ఒకే ఒక్క రన్ చేయాల్సి ఉంది. అటువంటి లాస్ట్ మినిట్‌లో నాన్-స్ట్రైకర్ ఎండ్‌‌లో ఉన్న రవి బిష్ణోయ్ బంతివేగం ముందే క్రీజ్ దాటి చాలా ముందుకు వెళ్లడం గమనించిన బౌలర్ హర్షల్ పటేల్ రనౌట్ చేశాడు. అయితే దీన్ని ఎంపైర్ పరిగణించలేదు. హర్షల్ కు బాల్ వేసే ఉద్దేశం లేకపోవడంతో పాటు క్రీజు దాటినందుకు గాను  ఎంపైర్ నాన్ స్ట్రైకర్ రనౌట్ ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారం బౌలర్ బౌలింగ్ చేసే ఉద్దేశం లేకపోయినప్పుడు క్రీజ్ దాటి బయటకు వెళ్లిన బ్యాటర్‌ని నాన్ స్ట్రైకర్ రనౌట్ చేయడానికి వీల్లేదు. నాన్ స్ట్రైకింగ్ రూల్ ప్రకారం బంతి వేసే ఉద్దేశం కలిగి ఉండి, క్రీజ్ దాటకుండా ఉంటేనే రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి హర్షల్ చివరి బంతికి నాన్ స్ట్రైకింగ్ చేయలేకపోవడంతో రవి బిష్ణోయ్ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. 

లక్నో, ఆర్‌సీబీల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2023 మ్యాచ్ లో లాస్ట్ బాల్ కు ఎంత డ్రామా జరిగిందో చూశాం. ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో రనౌట్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అదే స్టంప్స్ ను తాకి ఉంటే లక్నో ఆలౌట్ అయ్యేది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లి ఉండేది. ఈ రకంగా నాన్ స్ట్రైకింగ్ రనౌట్ కోసం ట్రై చేయడంతో ఇది కరెక్టా కాదా అంటూ మళ్లీ క్రికెట్ ప్రపంచమంతా రెండుగా విడిపోయింది.

చాలా మంది ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ క్రికెటర్లు కూడా ఈ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్ కు వ్యతిరేకంగా ఉంటారు. ఏమైనా అంటే క్రీడాస్ఫూర్తిని తెరమీదకు తీసుకొస్తారు. ఇది అశ్విన్-బట్లర్ ఇన్సిడెంట్ నుంచి జరుగుతున్నదే కదా!